breaking news
kobra
-
వామ్మో.. బామ్మో: భారీ కోబ్రానే షేక్ చేసింది
సాధారణంగా పాము అన్న పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. మరికొంత మంది దాన్ని చంపేదాకా నిద్రపోరు. కానీ 70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం చూస్తే..వామ్మో..బామ్మో.. అంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పూణేలోని ముల్షి తాలూకాలోని అంబోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతల సుతార్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పామును మెడకు చుట్టుకుని నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.ఏం జరిగిందంటేచుట్టు పక్కల వాతావరణం కారణంగా ఇంట్లోకి భారీ పాము (కోబ్రా) వచ్చింది. ఈ పామును చూడగానే ఇంట్లో వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు. కానీ బామ్మ ఏమాత్రం భయపడలేదు. దాన్ని భయపెట్టి, చంపేందుకు ప్రయత్నించలేదు. పైగా దాన్ని కాపాడింది. అదీ వట్టి చేతులతోనే, చాకచక్యంగా నక్కి ఉన్న పామును పట్టుకుంది. అయితే ఆ పాము అంత ఈజీగా ఏమీ లొంగలేదు. అయినా సరే నిర్భయంగా, అత్యంత సాహసంతో దాన్ని దొరకబుచ్చుకుని పామును పట్టుకుని మెడలో వేసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో అక్కడున్న వారు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వారికి ఫోజులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.🐍💪 70 साल की उम्र में भी हौसला जवान!पुणे के मुलशी तालुका के कासर अंबोली गाँव की शकुंतला सुतार दादी ने जो किया, वो किसी फिल्मी सीन से कम नहीं।जब उनके घर में धामन सांप निकला, तो दादी नेना डर दिखायाना हंगामा कियाबल्कि बिना घबराए साँप को खुद पकड़ाऔर गले में डालकर लोगों को… pic.twitter.com/eKuoKCntat— Satyaagrah (@satyaagrahindia) July 27, 2025చదవండి: 100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్‌డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!ఈ పామును స్థానికంగా ధమన్ అని పిలుస్తారట. దీనివల్ల మనుషులకు ఎలాంటి హాని లేదు. పైగాఎలుకల నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతుంది. భారతదేశం సహా ఆగ్నేయాసియా అడవులలో కనిపించే కింగ్ కోబ్రా దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయి.అయితే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. వాటిని చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తమకు హాని కలుగుతుందని భయపడనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగని పాము కనిపించగానే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఎక్కడ ఎలా పట్టుకోవాలనే ఒడుపు, విజ్ఞానం తెలియాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా పాము, ఇతర ప్రమాదకరమైనవి కనిపించినపుడు వన్యప్రాణ సంరక్షణ అధికారులకు సమాచారం అందివ్వాలి.ఇదీ చదవండి: HealthTip ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ ! -
మెట్రో స్టేషన్లో నాగుపాము కలకలం
న్యూఢిల్లీ: ఒకప్పుడు పాములు ఎక్కడ ఉంటాయి? అని అడిగితే ఊరి చివర పుట్టల్లో, పొలాల్లో, అడవుల్లో అని చెప్పేవాళ్లం. కానీ అవి కూడా వలస వచ్చాయి.. జనావాసాల్లోకి! ఇంటి కప్పు మీద, వంటగదిలో, ఆఖరికి ఇంట్లోని బాత్రూమ్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలోని సాకెట్ మెట్రో స్టేషన్ ద్వారం దగ్గర శుక్రవారం నాలుగడుగుల నాగుపాము పాగా వేసి అక్కడి సిబ్బందిని హడలెత్తించింది. దీంతో సిబ్బంది వెంటనే వైల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారమిచ్చారు. (జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..) వారు ఘటనా స్థలానికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. ఇంకా మెట్రో రైళ్లు ప్రారంభం కాకపోవడంతో అక్కడ జనాలు ఎవరూ లేకపోయేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఇటీవలే సాకెట్ మెట్రో స్టేషన్లో కొండచిలువను, ఓక్లా బర్డ్ సాంక్చుయరీ మెట్రో స్టేషన్లో నాగుపామును రక్షించినట్లు వైల్డ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. (పాముల కాలం.. జర భద్రం) -
బర్త్‌డే స్పెషల్
కర్ణుడిగా విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘మహావీర్ కర్ణ’. మలయాళ దర్శకుడు ఆర్ఎస్ విమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కర్ణుడిగా నటిస్తున్నారు విక్రమ్. శుక్రవారం (ఏప్రిల్ 17) విక్రమ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘మహావీర్ కర్ణ’కు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తోన్న ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు విక్రమ్. ‘కోబ్రా’ టీమ్ కూడా విక్రమ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలే కాకుండా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్’లో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు విక్రమ్. లాక్డౌన్ కారణంగా ఈ సినిమాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
కోబ్రా ఫస్ట్‌లుక్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
సాక్షి, చెన్నై: చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. ఆయనకు జంటగా నటి శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఇందులో ఇర్ఫాన్ పటాన్, ఆనంద్‌రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి హరీశ్కణ్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర టైటిల్ ‘కోబ్రా’ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వెరైటీ టైటిల్... డీమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడితో విక్రమ్ సినిమా ప్రకటించడంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కోబ్రా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా... విక్రమ్ ప్రయోగాలకు ఎల్లప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఐ చిత్రం అంతకు ముందు అన్నియన్ చిత్రం ఇలా పాత్రల కోసమే కాదు, గెటప్‌ల కోసం ఆయన పడే శ్రమ మాటల్లో వర్ణించలేం. వైవిధ్యం కోసం తపించే విక్రమ్ దాన్ని తాజా చిత్రంలోనూ కొనసాగించారు. ఈ విషయం చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతుంది. కోబ్రా చిత్రంలో విక్రమ్ వివిధ గెటప్‌లలో కనిపిస్తారని యూనిట్ వర్గాలు ముందే చెప్పారు. దాన్ని ఈ ఒక్క ఫస్ట్‌లుక్‌లోనే బహిరంగపరిచారు. ఈ పోస్టర్లో నటుడు విక్రమ్ ఏడు గెటప్‌లలో కనిపించారు. వాటిలో దేనికదే చాలా డిఫెరెంట్‌గా ఉంది. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోబ్రా ఫస్ట్‌లుక్ అదుర్స్ అంటున్నారు. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తన గత రెండు చిత్రాలతోనే నిరూపించుకున్నారు. కాగా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న కోబ్రా గత చిత్రాలకంటే చాలా భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం అన్నది గమనార్హం. దీంతో కోబ్రా చిత్రంపై చిత్ర వర్గాల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయనే చెప్పవచ్చు. కాగా నటుడు విక్రమ్ కోబ్రాతో పాటు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న మరో భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్‌లోనూ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. Here’s #CobraFirstLook ! Super happy to be helming this project❤️❤️ @arrahman @Lalit_SevenScr @IrfanPathan @SrinidhiShetty7 @mirnaliniravi @theedittable @Harishdop @7screenstudio @proyuvraaj @SonyMusicSouth @dancersatz @iamarunviswa @MeenakshiGovin2 pic.twitter.com/9CPYktPYCc — Ajay Gnanamuthu (@AjayGnanamuthu) February 28, 2020 -
ఆర్టిస్ట్ ఆర్జీవి
నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టడం రామ్‌గోపాల్ వర్మకు క్లాప్‌బోర్డ్‌తో పెట్టిన విద్య. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఆర్జీవి ఆర్టిస్ట్ కాబోతున్నారు. ఇన్నాళ్లు యాక్షన్ అంటూ నటీనటులకు చెప్పిన ఆయన యాక్షన్ చేయబోతున్నారు. ఆర్జీవి గన్‌షాట్ ఫిల్మ్ బ్యానర్లో వస్తున్న ‘కోబ్రా’తో వర్మ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో సీయం కేసీఆర్ పాత్ర కూడా ఉండటం విశేషం. వర్మతో పాటు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి స్వరకర్త. -
బాలికపై బంధువుల అకృత్యం
కొబ్రా: ఛత్తీస్‌గఢ్ కొబ్రా జిల్లాలో దారుణం జరిగింది.14 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువులే అకృత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోబ్రా ఎస్పీ కీర్తన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సోల్వా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గత బుధవారం రోజూలానే మంచినీళ్లు తెచ్చేందుకు బోరింగ్ వద్దకు వెళ్లింది. ఇంతలోనే ఆమె సమీప బంధువైన యువకుడు వచ్చి అత్యవసరమైన పని ఉందంటూ ఆమెను నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే కాపుకాసిన మరో ఇద్దరితో కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపుతామని బెదిరించి వదిలేశారు. శారీక బాధ తాళలేని ఆ బాలిక చివరకు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో దురాగతం బయటికి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన భరత్ రతియా (20), త్రిలోచన్ రతియా (19), గౌతం రతియా (23)లను అరెస్టుచేశారు.