బాలికపై బంధువుల అకృత్యం | Minor girl gangraped by three of her relatives | Sakshi
Sakshi News home page

బాలికపై బంధువుల అకృత్యం

Jun 28 2015 7:30 PM | Updated on Sep 3 2017 4:32 AM

బాలికపై బంధువుల అకృత్యం

బాలికపై బంధువుల అకృత్యం

ఛత్తీస్గఢ్ కొబ్రా జిల్లాలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువులే అకృత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొబ్రా: ఛత్తీస్గఢ్ కొబ్రా జిల్లాలో దారుణం జరిగింది.14 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువులే అకృత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోబ్రా ఎస్పీ కీర్తన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సోల్వా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గత బుధవారం రోజూలానే మంచినీళ్లు తెచ్చేందుకు బోరింగ్ వద్దకు వెళ్లింది. ఇంతలోనే ఆమె సమీప బంధువైన యువకుడు వచ్చి అత్యవసరమైన పని ఉందంటూ ఆమెను నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడే కాపుకాసిన మరో ఇద్దరితో కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపుతామని బెదిరించి వదిలేశారు. శారీక బాధ తాళలేని ఆ బాలిక చివరకు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో దురాగతం బయటికి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన  భరత్ రతియా (20), త్రిలోచన్ రతియా (19), గౌతం రతియా (23)లను అరెస్టుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement