
ప్రముఖ గాయని, నటి, వ్యాపారవేత్త ప్రెటా గిల్ కేన్సర్ పోరాడి, పోరాడి తనువు చాలించింది. తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్నిఉర్రూత లూగించిన ఆమె, 50 ఏళ్ల వయసులో పేగు క్యాన్సర్ తో పోరాడి, చికిత్స పొందుతూ,న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. దీంతో సంగతం ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురుప్రముఖుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
ప్రేటా గిల్ బ్రెజిలియన్ సంగీత పరిశ్రమలో పేరుగాంచిన మహిళ ప్రెటా. 2023 జనవరిలో ఆమెకు పేగు కేన్సర్ నిర్ధారణ అయింది. కేన్సర్‌తో పోరాటం గురించి బహిరంగంగా చర్చించేది. రెండేళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన, కఠినమైన తన పోరాటంలో అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. 2024లో శస్త్రచికిత్స జరిగింది.కణితిని, గర్భాశయాన్ని కూడా తొలగించారు. కీమోథెరపీ , రేడియోథెరపీతో చికిత్స తీసుకుంటూ ఎంతో ధైర్యంగా, చాలా ఆశావహ దృక్పథంలో ఉండేది. తన పోరాటంలో అనేక సవాళ్ల గురించి ఆత్మస్థైర్యంతో మాట్లాడేది. తద్వారా తనలాంటి కేన్సర్ రోగులకు ఎంతోమందికి ధైర్యాన్నిచ్చేది.సంగీత కారుడు, రాజకీయవేత్త గిల్బర్టో గిల్ కుమార్తెప్రేటా. 'ప్రేటా' అంటే పోర్చుగీస్ భాషలో 'నలుపు' అని అర్థం. తన కుమార్తెకు ఈ పేరు పెట్టడానికి చాలా ఇబ్బందలు పడ్డాడట.
గిల్బర్టో గిల్ తన కుమార్తె ప్రేటా గిల్ మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.

lutou até o fim. tentou, foi forte, foi guerreira. lidou com abandono, traição em plena descoberta da doença e em nenhum momento parou de sorrir. descanse em paz, preta gil. você é amor 🤍 pic.twitter.com/T6ddwBpPcY
— mari (@ahcamilas) July 20, 2025
పేగు కేన్సర్, లేదా పెద్ద పేగు కేన్సర్, పెద్దప్రేగు లేదా మలనాళంలో ఏర్పడే కేన్సర్. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్ కనిపిస్తుంది, కానీ ఇటీవల యువతలో కూడా ఈ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
లక్షణాలు:
మలంలో రక్తం
మలబద్ధకం లేదా అతిసారం వంటి ప్రేగు అలవాట్లలో మార్పు
బలహీనత, అలసట, బరువు తగ్గడం
కడుపు నొప్పి, తిమ్మిరి, లేదా ఉబ్బరం
పేగు కదలిక తర్వాత ప్రేగులు పూర్తిగా ఖాళీ అవ్వడం లేదనే భావన
కారణాలు:
50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది.
పేగు కేన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ.
ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, తక్కువ పీచు పదార్థాలు తీసుకోవడం.
శారీరక శ్రమ లేకపోవడం.సిగరెట్లు, మద్యపానం.