
ఆస్ట్రేలియన్ జూకీపర్, సంరక్షకుడు స్టీవ్ ఇర్విన్ స్టింగ్రే చేతిలో మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసేలా మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా పర్యావరణ పర్యాటక రంగంలో పేరు గాంచిన మల్టీ మిలియనీర్ సీఈవో, ఎకోటూరిజం వ్యాపారవేత్త ఎఫ్‌సీ క్రిస్టియన్ కాన్రాడీ(39) తన సొంత జూలోనే ఏనుగు దాడిలో దుర్మరణం పాలైన ఘటన వన్యప్రాణి ప్రేమికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. జనసాంద్రత ఉన్న ప్రాంతం నుండి ఏనుగులను తరలించడానికి ప్రయత్నిస్తుండగా జూలై 22న ఉదయం 8 గంటలకు గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.
దక్షిణాఫ్రికాలోని టాప్ రిజర్వ్‌లలో ఏనుగు అతనిపై దారుణంగా దాడిచేసి తొక్కి చంపింది. ది డైలీ మెయిల్ ప్రకారం.. కాన్రాడీ పర్యాటక లాడ్జీల నుండి ఏనుగుల గుంపును దూరంగా నడిపించడానికి ప్రయత్నించినప్పుడు జరిగింది. ఏనుగు తన దంతాలతో కాన్రాడీని పొడిచి, పలు మార్లు తొక్కడంతో, సమీపంలోని రేంజర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయారు. గోండ్వానా గేమ్ రిజర్వ్ మిస్టర్ కాన్రాడీ మృతిపై సంతాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని ప్రముఖ గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్‌లో జరిగిన విషాద ఘటన ఎకోటూరిజం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గేమ్ రిజర్వ్‌లలో భద్రతా ప్రోటోకాల్‌ల గురించి చర్చకు దారితీసింది.
కేలిక్స్ గ్రూప్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ యజమానికి కాన్రాడీకి ఏనుగులు, ప్రకృతి అంటే చాలా ప్రేమ అట. వాటిని ఫోటో తీయడానికి ఇక్కడకు తరచూ వచ్చేవారని సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఎంత ప్రేమ అయినా కానీ అడవిలో ఉన్నాయనేది ఎప్పటికీ మర్చిపోకూడదంటూ ఆయన అకాలం మరణంపై సంతాపం ప్రకటించారు. కాన్రాడీకి జంతుశాస్త్రం, జంతు అధ్యయనాలు, వాణిజ్యం, మార్కెటింగ్‌లో ఆనర్స్ డిగ్రీలు కూడా ఉన్నాయి. ముగ్గురు బిడ్డలకు తండ్రి.
Francois Christiaan Conradie, 39, CEO of Gondwana Private Game Reserve, killed by elephant on July 22 at 8 AM. Visionary conservationist, husband, father of three. Family seeks privacy in the meantime. pic.twitter.com/vxMIENplav
— Inside Out News (@InsideOutNews_) July 24, 2025
చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!
గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్ పాపులర్ ఫైవ్‌స్టార్ సఫారీ లాడ్జి. ఆఫ్రికాలోని ప్రసిద్ధ "బిగ్ ఫైవ్" సింహం, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, బఫెలోలను దగ్గరగా చూడాలనుకునే పర్యాటకులకు ఇది ఫేవరెట్ డిస్టినేషన్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, ఫోటోగ్రాఫర్లు, వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడకు వస్తుంటారు. మరోవైపు గోండ్వానా రిజర్వ్‌లో గత ఏడాది కూడా బోనీ అనే 36 ఏళ్ల ఉద్యోగి ఒకరు ఏనుగుల దాడిలో మృతి చెందారు. ఈ వరుస ఘటనలు గేమ్ రిజర్వ్‌లలో సిబ్బంది, పర్యాటకుల భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఎఫ్‌సీ కాన్రాడీ మరణం వన్యప్రాంతాల్లో పనిచేసే వారికీ, పర్యాటకులకూ ఒక హెచ్చరిక అని, తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం