జూబిలెంట్ సీఈవో మను అహుజా కన్నుమూత | Jubilant Industries MD and CEO Manu Ahuja passes away | Sakshi
Sakshi News home page

జూబిలెంట్ సీఈవో మను అహుజా కన్నుమూత

Dec 10 2023 6:20 PM | Updated on Dec 10 2023 6:20 PM

Jubilant Industries MD and CEO Manu Ahuja passes away - Sakshi

జూబిలెంట్ ఇండస్ట్రీస్ (Jubilant Industries) ఎండీ, సీఈవో మను అహుజా కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మను అహుజా డిసెంబర్ 9 శనివారం నాడు ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాము" అని జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదివారం (డిసెంబర్ 10) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

అహుజా ఆకస్మిక మరణం కంపెనీకి కోలుకోలేని నష్టమని పేర్కొన్న యాజమాన్యం కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులందరూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, విచారం, సంతాపాన్ని తెలియజేస్తున్నారని అని వివరించింది.

మను అహుజా 2018 మేలో జూబిలెంట్ ఇండస్ట్రీస్‌లో చేరారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, అహుజా జంషెడ్‌పూర్‌లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, పాటియాలాలోని థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదివారు. భారత్‌తోపాటు ఆగ్నేయాసియా అంతటా విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలలో ఆయనకు విశేష అనుభవం ఉంది.

జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది జూబిలెంట్ భారతీయ గ్రూప్‌నకు చెందిన అగ్రి, పెర్ఫార్మెన్స్ పాలిమర్స్ కంపెనీ.  విస్తృత శ్రేణి పంట పోషణ, పంట పెరుగుదల, పంట రక్షణ ఉత్పత్తులతో పాటు  అడెసివ్‌లు, వుడ్‌ ఫినిషెస్‌ వంటి వినియోగదారు ఉత్పత్తులు, వినైల్ పిరిడిన్, ఎస్‌బీఆర్‌, ఎన్‌బీర్‌ లేటెక్స్‌ వంటి ఆహార పాలిమర్‌లు కంపెనీ ఫోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement