
మనకే అన్ని తెలుసు. మనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని తెగ పొంగిపోతుంటాం. కానీ కాసేపు సరదాగా బయటకు వెళ్లగానే ఆ కొద్ది నిమిషాల్లో మనకు పరిచయమై అపరిచివ్యక్తులు చాలా విషయాలను నేర్పిస్తారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురవ్వుతుంది. కానీ ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తి మాత్రం ఎదురయ్యి ఉండడు. ఈ యువకుడికి ఎదురైన అనుభవం వింటే..మనకు తెలియని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయని అంగీకరించకుండ ఉండలేరు.
ఇంతకీ ఏం జరిగిందంటే..హైదరాబాద్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ అభినవ్ మైలవరపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసుఉన్నారు. తన స్నేహితులతో కలిసి బెంగళూరులోని డీమార్ట్ షాప్‌కి వెళ్లి బాగా అలసిపోయి తిరిగి వచ్చి ఓ ఆటో ఎక్కి వస్తుండగా ఓ మంచి అనుభవం ఎదురైందంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అప్పటిదాక ఉన్న మా అలసట మొత్తం ఉఫ్ మని ఎగిరిపోయూలా గొప్ప అనుభూతిని పంచాడు ఆ ఆటో డ్రైవర్ తనకెదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు.
ఆ రోజుఆటోలో వెళ్తూ సరదాగా ఆ డ్రైవర్‌తో మాటలు కలిపినట్లు తెలిపాడు. "అతడు కూడా సరదాగా మాట్లాడుతూ..వాళ్లకో సవాలు విసిరాడు. కంప్యూటర్ అనే పదం ఫుల్ ఫామ్ చెప్పమని అడిగాడు. ఒకవేళ దానికి సమాధానం చెబితే గనుక తాను తమ వద్ద నుంచి ఈ జర్నీకి అయ్యే డబ్బులు కూడా ఛార్జ్ చెయ్యనని అంటాడు. అయితే ఆ డ్రైవర్‌కి తెలుసు తాము కచ్చితంగా సమాధానం ఇవ్వలేమని అంటున్నాడు అభినవ్. చివరికి ఆ డ్రైవరే కంప్యూటర్ అంటే: వాణిజ్యం, విద్య మరియు పరిశోధన కోసం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించే సాధారణ యంత్రం ((COMPUTER)Commonly Operated Machine Purposely Used for Trade, Education and Research) అని చెబుతాడు.
తాను 1976 ఆ టైంలో చదువుకున్నానని, అప్పడు అంతా కంప్యూటర్లు వస్తాయనేవారు..కానీ ఇప్పడంతా ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు ఆ డ్రైవర్. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ పితామహుడు ఎవ్వరని ప్రశ్నించడమే గాక ఆ భాష చరిత్ర గురించి వివరిస్తూ..తన గురించి చెప్పుకొచ్చాడు. తాను డబల్ ఎంఏ చేశానని, ఒక ఇంగ్లీష్, మరొకటి పొలిటికల్ సైన్స్‌లోనని చేసినట్లు తెలిపాడు.
సడెన్‌గా పెళ్లి ఫిక్స్ చేయడం, తర్వాత పిల్లలు, బాధ్యతలు వల్ల చదువు కొనసాగించలేకపోయానని అన్నాడు. తాను కూడా ఐఏఎస్‌కి ప్రిపరయ్యే వాడినని చెప్పుకొచ్చాడు. తాను పలు ఎంఎన్‌సీ కంపెనీల్లో అధిక వేతనానికి పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇచ్చే జీతానికి తగ్గట్టుగా అక్కడ కార్పొరేట్ అధికారులు మనల్ని ఎలా పనులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారో కూడా చెప్పాడు.
అప్పటి దాక షాపింగ్‌తో అలసిన వాళ్లకి ఆ డ్రైవర్ మనోగతం జీవితంపై స్పష్టత వచ్చేలా కళ్లు తెరిపించి ఓ గొప్ప పాఠాన్ని వివరించినట్లుగా అనిపించింది. అంతేగాదు ఆ ఆటోలో ప్రయాణించిన 15 నిమిషాల జర్నీ జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతినిచ్చింది అని వీడియోలో చెప్పుకొచ్చాడు అభినవ్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
(చదవండి: పార్లమెంటు క్యాంటీన్‌లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!)