
కొందరు ఒక మంచి పనికి పూనుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అది తన హోదా కంటే కాస్త దిగి చేయాల్సిందే అయినా వెనుకడుగు వేయరు. అంతేగాదు వృత్తి విరమణను కూడా పక్కనపెట్టి సేవకు విరామం ఉండదనే కొత్త అర్థం చెబుతారు. అలాంటి వ్యక్తి ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్..ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆయన విశాల హృదయానికి ఫిదా అయ్యి అతడి గురించి నెటింట షేర్ చేశారు. మరి ఆ వ్యక్తి ఎవరంటే..
అతడిని పరిశుభ్రతకు మారుపేరు, స్వచ్ఛ భారత్ ముఖచిత్రంగా పేర్కొనవచ్చు. అతడే చండీగఢ్‌లోని 88 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ. ఆయన 1964 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పదవీ విరమణ చేసినా..ప్రజా సేవకు మాత్రం ఉండదనే కొత్త అర్థం ఇచ్చేలా ఓ మంచి పనికి ఉప్రక్రమించాడు సిద్ధూ.
స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో చండీగఢ్ ర్యాంక్ చాలా తక్కువకు పడిపోయిందని, తానే ఆ పనికి పూనుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం అధికారులకు ఫిర్యాదు చేయడం కంటే..మార్పు మన నుంచి మొదలైతే అది నిశబ్ధంగా అధికారులను ప్రేరేపించేలా ప్రతిధ్వని చేస్తుందని విశ్వసించాడు ఈ రిటైర్డ్ ఆఫీసర్ సిద్ధూ. ఆ నేపథ్యంలోనే ఆయన తన రోజుని వీధుల్లో చెత్తను తీయడంతో ప్రారంభిస్తాడు.
ఉదయం ఆరుగంటలకు చండీగఢ్ సెక్టార్ 49 వీధుల్లో ఓ బండిపై చెత్తను ఆయనే స్వయంగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు. వయసు రీత్యా ఆయన ఈ వయస్సులో అంతలా కష్టపడాల్సిన పని కాదు. పైగా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసి వదిలేయొచ్చు కానీ అవేమి చేయలేదు సిద్ధూ. తానే చర్య తీసుకోవాలని సంకల్పించి ఇలా చెత్తని సేకరిస్తున్నాడు ఆయన.
గుర్తింపు, వయసుతో సంబంధం లేకుండా నిరంతరం స్వచ్ఛ భారతే తన లక్ష్యం అన్నట్లుగా వీధుల్లో చెత్తను తీస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారాయన. స్వచ్ఛ భారత్ స్పూర్తికి నిదర్శనంలా నిలిచాడు. అతడి అంకిత భావం, సమాజం పట్ల అతడి వైఖరి నెటిజన్లను సైతం ఫిదా చేసింది. అంతటి అత్యున్నత హోదాలో పనిచేసి కూడా ఎలాంటి డాబు దర్పం చూపకుండా సాదాసీదా వ్యక్తిలా చెత్త సేకరించడం అంటే అంత ఈజీకాదంటూ ఆ ఐపీఎస్ ఆఫీసర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
(చదవండి: Dr Megha Saxena: డాక్టర్... ట్రీట్‌మెంట్..! కార్చిచ్చుకి సమూలంగా చెక్..)