
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు వత్సల ఇకలేదు. 100 సంవత్సరాలకు జీవించిన ఆడ ఏనుడు వత్సల. పన్నా టైగర్ రిజర్వ్ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వత్సల హినౌటా ఎలిఫెంట్ క్యాంప్ సమీపంలో బుధవారం తుది శ్వాస విడిచింది. అటవీ కాలువ దగ్గర పడిపోయిన వత్సలను గమనించిన అటవీ సిబ్బంది, పశువైద్యులు తక్షణమే వైద్య సాయం అందించినప్పటికీ ఏనుగు ఫలితం లేకపోయింది. వయోభారంతో ఇప్పటికే బాధపడుతున్న వత్సల కన్నమూసిందని అధికారులు ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. వత్సల చనిపోలేదు - అది అడవితో ఐక్యమైంది అంటూ పలువురు వన్య ప్రేమికులు, అటవీశాఖ అధికారులు దానికి నివాళులర్పించారు. వత్సల మరణం ఒక జంతువును కోల్పోవడం కంటే ఎక్కువ. ఇది ఒక శతాబ్దం పాటు కాపలాగా ఉన్న చెట్టు కూలిపోవడం లాంటిదని సంతాపం తెలిపారు.
వత్సల మరణం గురించి వార్త తెలియగానే పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది, సమీప గ్రామాల స్థానికులు, దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికులు దుఃఖం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయంలో వత్సల మృతదేహాన్ని హినౌటాలో దహనం చేశారు. ఒకప్పుడు రాణిలా తిరుగాడిన ప్రదేశంలో ఇప్పుడిక దాని జ్ఞాపకాలే మిగిలాయి. సోషల్ మీడియాలో RIP Vatsala హ్యాష్‌ట్యాగ్‌వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి : Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
కేరళ- మధ్యప్రదేశ్
కేరళలోని నిలంబూర్ ఫారెస్ట్ డివిజన్‌లోని కేరళలోని దట్టమైన నీలాంబూర్ అడవిలో జన్మించిన వత్సల తొలుత అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తూ, దుంగల కంటే చాలా బరువైన భారాన్ని మోస్తూ గడిపింది. 50 ఏళ్లు నిండిన వయసులో 1972లో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ఆ తర్వాత 1993లో బోరి నుంచి పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అలా అప్పటి నుంచి పన్నా అభయారణ్యమే వత్సలకు నిలయంగా మారింది.
Bidding a heartfelt farewell to #Vatsala, the world’s oldest known Asiatic elephant at 109 years, who passed away in Madhya Pradesh’s Panna Tiger Reserve. A gentle matriarch, Vatsala was a beloved guardian of her herd and was the soul of the reserve. She will be missed. pic.twitter.com/IrjZA32zIT
— Parimal Nathwani (@mpparimal) July 9, 2025
‘‘వత్సల మాకు గర్వకారణం" అని ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచిత టిర్కీ చెప్పారు. "మందను గౌరవంగా నడిపించింది. ప్రసవాల సమయంలో, అనుభవజ్ఞురాలైన మంత్రసానిలా దగ్గరుండి సాయం చేసింది. బలాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. వత్సల పెద్దది మాత్రమే కాదు - ఆమె మా ఏనుగు కుటుంబానికి ఆత్మ." పెద్ద ఆడ ఏనుగుగా,సహజంగా మందను నడిపించింది, పిల్ల ఏనుగులను పోషించింది అన్నారు.
ఇదీ చదవండి: ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్
వత్సల మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “వత్సల రాష్ట్ర ప్రజలకు ఒక భావోద్వేగంగా మారింది. పలు తరాలకు స్నేహితురాలిగా, పిల్ల ఏనుగులకు అమ్మమ్మగా అభయారణ్యంలో ఎంతో ప్రేమగా మెలిగింది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వత్సల మరణం పన్నా టైగర్ రిజర్వ్‌కి తీరని లోటనిప్రముఖ పర్యావరణవేత్త రాజేష్ దీక్షిత్ సంతాపం తెలిపారు.
2003 -2008లో, రామ్ బహదూర్ అనే మగ ఏనుగు చేసిన రెండు హింసాత్మక దాడుల నుండి వత్సల సురక్షితంగా బయటపడింది. ప్రేగులను చీల్చి,లోతైన గాయా లైన రెండు సందర్భాల్లో, ఆమె వీపును కుట్టినది వన్యప్రాణి పశువైద్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గుప్తా - 2003లో 200 కుట్లు, తొమ్మిది నెలల చికిత్సచేశారు. అయినా వత్సల ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. 2020లో, వత్సల కంటిశుక్లం కారణంగా పూర్తిగా అంధురాలైంది. అయినప్పటికీ, ఆమె అటవీ బాటలలో నడవడం కొనసాగించింది. జీర్ణ సమస్యలు, పూర్తి అంధత్వంతో కారణంగా దానికి వైద్యులు గంజి తినిపించేవారు. 1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఆమె ఖచ్చితమైన వయస్సు అధికారికంగా నిర్ధారించబడలేదు, అయినప్పటికీ, ఆమె పక్కన నడిచిన వారికి, గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. ఆమె గడిపిన జీవితం - మరియు ఆమె తాకిన జీవితాలు ముఖ్యమైనవి.
1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చూసినప్పటికీ, వయస్సు అధికారికంగా నిర్ధారణ లేని కారణంగా అది మిస్ అయింది. అయితేనేం.. వత్సలకు గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. గడిపిన జీవితం చాలా ముఖ్యమైంది అంటూ కొనియాడారు అటవీ అధికారులు.