
ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో మన ముందుంటుంది. కింగ్ కోబ్రా అయినా పులులు, సింహాలైనా, ఏనుగులైనా ఆకర్షణీయమైన వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. వర్షాలకు పరవశంతో ఆటుకుంటున్న పిల్ల ఏనుగుల వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది.
"మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే" అని శ్రీశ్రీ అన్నట్టు పిల్లలు ప్రకృతిలోని అందాలను స్వచ్ఛమైన మనసుతో ఆస్వాదిస్తారు. ఆడిపాడతారు. పసితనం అనేది మనుషులకైనా.. జంతువులకైనా ఒకటే నిరూపించే ఘటన ఇది. ఒక జోరు వాన పడుతోంది. దీంతో గజరాజులతో కలిసి పిల్ల ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి. ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ అన్నట్టు, ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ తొండంతో కొట్టుకుంటూ అల్లరి చేశాయి. బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్‌గఢ్ అటవీ శాఖ డ్రోన్ కెమెరా బంధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని ధరమ్‌జైగఢ్ ఫారెస్ట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!
#WATCH | Chhattisgarh: Raigarh Forest Department's drone captured a herd of elephants with their calves playing in the mud in the monsoon season. Visuals from Dharamjaigarh Forest Division. (08.07.2025)
(Video Source: Chhattisgarh Forest Department) pic.twitter.com/BheMJESyxs— ANI (@ANI) July 9, 2025
కాగా వర్షాకాలంలో ఏనుగులు బురదలో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అవి గుంపులుగా చేరి, ఒకదానితో ఒకటి బురదను చల్లుకుంటూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.