
ఉత్తరాది, దక్షిణాది రుచులు ఒకచోట, ఒకే ఐటమ్‌లో కనిపిస్తే?
ఆ ఐటమ్ పేరే... గాజర్ కే హల్వా కా దోశ.. Gajar Ke Halwa Ka Dosa!
ఇండోర్‌కు చెందిన ఈ దోశలో అదనపు ఆకర్షణ క్యారట్ హల్వా, రబ్డీ (ఇదొక నార్డ్ ఇండియన్ స్వీట్. పాలను బాగా మరిగించి చేసేది). ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లోకంలో హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌పై మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపించాయి. కొందరు...‘ఆహా!’ అంటున్నారు.
అటు దక్షిణ భారతీయులకు ఎంతో ప్రియమైన దోశను, ఇటు ఉత్తర భారతీయులు మెచ్చే స్వీట్ క్యారెట్ హల్వాను రెండూ మిక్స్ చేయడంతో నెటిజనులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ వీడియోను స్వాద్ ఇండోర్ డా అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "గాజర్ కా హల్వా దోశ" అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఎక్కువ శాతం ప్రతికూలంగా స్పందించారు. కొందరు అయ్యో దేవుడా.. ఇదేమి వంటకం రా బాబూ అంటున్నారు. మరికొందరు ‘దేని ప్రత్యేకత దాంతే, రెండూ కలిపేస్తే ఎలా అని’ అంటూ నిట్టూరిస్తే, కొందరు...‘ఛీఛీ’ అంటున్నారు. "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" “ఇండోర్ ప్రజలందరి తరపున నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను.” "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" మరొకరు, “ఇది అల్పాహారమా లేక డెజర్టా? అని వ్యాఖ్యానించడం గమనార్హం.