
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు.
ఆ పాట బీట్‌కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి.
(చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!)