breaking news
ganesh chaturdi
-
గణేశ నిమజ్జనం ఆంతర్యం..!
అనంత చతుర్దశికి ఒక విశేషం వుంది. ఆ రోజు నాడే శ్రీ వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఆయనను ప్రతిష్టించి పది రోజులు పూజలు జరుపుకున్న తరువాత మట్టితో చేసిన ఆయన ప్రతిమను నదిలో గానీ, సముద్రంలో గానీ కలపడానికి కారణం అలా పూజలందుకున్న వినాయకునికున్న శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాప్తి చెందుతాయని, ఆ విధంగా శ్రీ గణేశుని శక్తులు, తత్వమయిన పవిత్రత, వివేకం, అబోధితత్వం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణా భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి. అనంత అంటేనే శ్రీ వినాయకుడు. అనంత అంటే నాశనం లేనివాడు. అనంతగా వ్యాపించి వున్న గణేశశక్తి.అంతటి మహత్తు, మహిమాన్వితుడిని నిమజ్జనానికి తీసుకెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్దలతో, మేళ తాళాలతో, మంగళ ప్రదమైన గణేశ్ కీర్తనలతో సాగనంపాలి. ఆయన జన్మించిన భాద్రపద శుక్ల చవితి నాడు ఆయనను ప్రతిష్టించి, ఆ తరువాత పదవ రోజున, అంటే అనంత చతుర్దశి నాడు సముద్రంలో నిమజ్జనం చేయడానికున్న ప్రాముఖ్యత అటువంటిది.మట్టినుంచి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి తద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత నిమజ్జనం కార్యక్రమాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పుణ్యకార్యంగా జరుపుకోవాలి తప్పించి అశ్లీలతకు, నిందారోపణలకు, ఘర్షణలకు దారితీసే వాతావరణంలో కాదు. – డా. పి.రాకేశ్(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాలు ఆధారంగా) -
నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు. ఆ పాట బీట్కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by Dream Catchers Academy 🇳🇬 🌍 (@dreamcatchersda) (చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!) -
మొక్కిన చోటే 'మొలకెత్తి'..!
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణేశ నవరాత్రి పూజలు చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. గ్రీన్ గణేశ పేరిటి రీ సస్టైనబిలిటీ, 92.7 బిగ్ ఎఫ్ఎమ్లు మరో ముందడుగు వేశాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే సీడ్ గణేశ విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీలోని మై హోం భూజ గేటెడ్ కమ్యూనిటీలో సీడ్ గణేశ విగ్రహాల పంపిణీ వాహనాన్ని నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నటి మధుషాలిని, రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ మాలిక్ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1500 ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. పర్యావరణానికి మేలుచేసే ఆక్రీ యాప్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆక్రీ యాప్లో సంప్రదిస్తే శానిటరీ వేస్ట్, డైపర్స్, ప్లాస్టిక్, ఈ వేస్ట్, పేపర్ కార్డ్బోర్డ్, ఉడ్ అండ్ ఫర్నీచర్, క్లాత్స్, షూస్, మెటల్ స్క్రాప్ సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. సేకరించే చెత్తకు కొంత డబ్బులు కూడా చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో 92.7 ఎఫ్ఎం ఆర్జే శేఖర్ భాషా, ఆర్జే గ్రేస్, మై హోం భూజ అసొసియేషన్ ప్రతినిధులు రాజు మధనపల్లి, విద్యా రెడ్డి, డాక్టర్ కుమార్ పాల్గొన్నారు. (చదవండి: 82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..) -
దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు (ఫొటోలు)
-
గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా చేసుకోవాలి
ఏలూరు అర్బన్ : గణేశ్ నిమజ్జనోత్సవాలను జిల్లా వాసులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ భాస్కర్భూషణ్ సూచించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాసులు చట్టాలను గౌరవిస్తారనే మంచిపేరు ఉందని చవితి వేడుకలు ఆనందంగా ప్రశాం తంగా ముగించడం ద్వారా దానిని మరోమారు నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలువురు ఫోన్ చేసి ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఏలూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నగరంలో పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. పెనుమంట్ర నుంచి ఓ మహిళ ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మోసం చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పెరవలి నుంచి మరో వ్యక్తి ఫోన్ చేసి రోడ్లపై ఆటోలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారని, లౌడ్స్పీకర్లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ద్వార కాతిరుమల నుంచి కొంతమంది ఫోన్ చేసి గ్రామంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. ఇంకా పలువురు ఆటోవాలాల ఆగడాలపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ ఆటోవాలాల ఆగడాలపై తరుచూ ఫిర్యాదు వస్తున్నాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.