
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణేశ నవరాత్రి పూజలు చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. గ్రీన్ గణేశ పేరిటి రీ సస్టైనబిలిటీ, 92.7 బిగ్ ఎఫ్‌ఎమ్‌లు మరో ముందడుగు వేశాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే సీడ్ గణేశ విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి.
రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీలోని మై హోం భూజ గేటెడ్ కమ్యూనిటీలో సీడ్ గణేశ విగ్రహాల పంపిణీ వాహనాన్ని నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నటి మధుషాలిని, రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ మాలిక్ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1500 ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. పర్యావరణానికి మేలుచేసే ఆక్రీ యాప్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఆక్రీ యాప్‌లో సంప్రదిస్తే శానిటరీ వేస్ట్, డైపర్స్, ప్లాస్టిక్, ఈ వేస్ట్, పేపర్ కార్డ్‌బోర్డ్, ఉడ్ అండ్ ఫర్నీచర్, క్లాత్స్, షూస్, మెటల్ స్క్రాప్ సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. సేకరించే చెత్తకు కొంత డబ్బులు కూడా చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో 92.7 ఎఫ్‌ఎం ఆర్‌జే శేఖర్ భాషా, ఆర్‌జే గ్రేస్, మై హోం భూజ అసొసియేషన్ ప్రతినిధులు రాజు మధనపల్లి, విద్యా రెడ్డి, డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.
(చదవండి: 82 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..)