
మన సాంప్రదాయ విధానం ప్రకారం, పూజ మొదలుపెట్టే ముందు పసుపు, కుంకుమ రాసి పవిత్ర తంతువు (నూలు దారం) సిద్ధం చేసి పూజారి లేదా ఇంటి పెద్దవారు దేవుని నామస్మరణతో కుడి చేతికి (పురుషులు) లేదా ఎడమ చేతికి (స్త్రీలు) కడతారు. ఆలా కడుతూ ఈ మంత్రం జపిస్తారు:
‘ఓం రక్షా బంధనం మమ శుభం భవతు’ ఈ కంకణాన్ని పూజ ముగిసిన తర్వాత కొన్ని రోజులు లేదా కనీసం పండుగ ముగిసే వరకు ఉంచటం సాంప్రదాయం.
ప్రత్యేకతలు:
దైవ రక్షణ : అపశకునం, దుష్ప్రభావాల నుండి కాపాడుతుంది.
సంకల్ప బంధనం : పూజలో చేసిన ప్రతిజ్ఞలను గుర్తు చేస్తుంది.
శుభ సంకేతం : ఎరుపు, పసుపు రంగుల
కలయిక శుభాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది.
ఇదీ చదవండి: దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా
వినాయక పూజలో:
వినాయక చవితి లేదా ఇతర వ్రతాల్లో కంకణం కట్టుకోవడం వ్రత ప్రారంభానికి గుర్తు. కంకణం విప్పేటప్పుడు, సాధారణంగా పత్రి లేదా పుష్పాలతో నదిలో/తీర్థంలో విడిచిపెట్టటం చేస్తారు. అంటే దేవునికి తిరిగి సమర్పించడం, ప్రకృతిలో లీనమవ్వడం. ఇలా చేయటమనేది, దేవుని ఆశీర్వాదాన్ని సక్రమంగా ముగించి, పవిత్రతను భూమికి అంటే ప్రకృతికి తిరిగి సమర్పించే ఆచారం అన్నమాట!
అలాగే వివాహం సమయంలో, సత్యనారాయణ వ్రతం, గౌరీ పూజ సమయం, యజ్ఞ యాగాదుల సమయంలోను చేతికి కంకణం ధరించటం ఆచారంగా ఉంది.
చదవండి: Vinayaka Chavithi: వినాయక చవితి పూజ ప్రాముఖ్యత,అష్టోత్తర శతనామావళి
భక్తసులభుడు
గణేశుడు భక్తసులభుడు. నిండు మనసుతో పూజించే వారికి క్షిప్రప్రసాది. ఇచ్చుటలో వున్న హాయిని తెలిపిన బోళాదైవం ఆయన. పామరుడైనా, కర్మనిష్ఠుడుగా దృఢవిశ్వాసంతో పూజిస్తే స్వామి అనుగ్రహిస్తాడు. తనను చూసి, తన గుజ్జురూపాన్ని చూసి పరిహశించిన చంద్రుడినే గణపతి కరుణించి తన శాపానికి, దోషనివారణ మార్గం చూపాడు అని మనం వినాయకవ్రత కథలో చదువుకొంటున్నాము.
వినాయకుని విగ్రహం నేర్పే నీతి...
మహాగణపతి.. సకలవేదాల సారం, ఉపనిషత్తుల అంతరార్థం, సర్వ పురాణాల సంక్షిప్తరూపం, ఏనుగుతల నుంచి ఎలుక వాహనం వరకూ... ఆ అపురూప రూపమంతా ప్రతీకాంతమే..పెద్ద తలతో గొప్పగా అలోచించమని, గొప్ప ఆలోచనతోనే గొప్ప ఆచరణ.. గొప్ప ఆచరణ ద్వారానే.. గొప్ప విజయాలు.. పాతాళం వైపు చూస్తూ ఆకాశాన్ని అందుకోలేం..ఆకాశాన్ని చేరుకోవాలంటే ఆకాశమంత..ఉన్నతంగానే ఆలోచించాలి.