
ఆ మూగజీవి స్కూల్‌కి ఎందుకొచ్చిందో గానీ..అక్కడున్న పిల్లల వద్ద అది కూడా ఓ పసిపాపాయిలా కూర్చొని ఉండటం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ అదిచేసే పని చూస్తే..కళ్లార్పడమే మరిచి ఆ శునకాన్నే చూస్తుండిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక అందమైన కుక్క పాఠశాల తరగతి గదిలో పిల్లల తోపాటుగా కూర్చొని ఉంటుంది. చాలా అమాయకంగా అందర్ని చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్‌లో పిల్లలంతా డ్రాయింగ్ వేయడంలో మునిగిపోతే..ఈ కుక్క కూడా వేయాలనుకుందో ఏమో గానీ ఒక కాలుపైకిత్తి తనకు సమీపంలో ఉన్న పిల్లవాడి చేతిని తాకుతుంది. నేనే రంగులు వేస్తా అన్నట్లుగా అతడి చేతిలో తన కాలుని పైకెత్తి పెడుతుంది. ఆ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది.
అయితే ఆ పిల్లవాడు చేతిని వదిలించుకని తన పనిలో తాను నిమగ్నమవుతుండగా మరోసారి అడుగుతున్నట్లుగా కాలుతో కదుపుతుంది. అయితే ఆ చిన్నారి కూడా నీ వల్ల కాదులే అన్నట్లుగా తన పని తాను చేసుకుంటున్న ఆ నిశిబ్ధ సంభాషణకు ఎలాంటి వారి మనసైనా ఇట్టే కరిగిపోతుంది. పాపం అది మాత్రం ఎవ్వరైనా నాకు కొంచెం డ్రాయింగ్ వేసే పేపర్ ఇవ్వరూ..అన్నట్లుగా చూస్తున్న దాని చూపు భలే నవ్వుతెప్పిస్తోంది .
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మూడు మిలయన్లకు పైగా వ్యైస్ నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు యూనిఫాం ఏది.. ? వేసుకుని వచ్చి ఉంటే నీకు డ్రాయింగ్ వేసే పేపర్ ఇచ్చేవారు అంటూ ఆ క్యూట్ కుక్కని ఉద్దేశిస్తూ.. కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఎంఆర్‌ఐ స్కానింగ్ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..)