
ఆస్పత్రికి వెళ్లినప్పుడు తరుచుగా వింటుంటాం ఎంఆర్‌ఐ స్కానింగ్ గురించి. కొందరు రోగులకు సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కానింగ్ వంటివి చేయించుకోవాల్సిందిగా వైద్యులు చెబుతుంటారు. కానీ అలాంటి స్కానింగ్ చేయించుకునేటప్పుడు బహు జాగ్రత్తగా వ్యహరించాలి. లేదంటే ఈ వ్యక్తిలా గాయలపాలవ్వాల్సి వస్తుంది.
ఎంఆర్‌ఐ గదిలో స్కాన్ చేస్తుండగా ఒక వ్యక్తి మెటల్ చైన్ ధరించి గదిలోకి వచ్చాడు. అంతే అమాంతం ఎంఆర్‌ఐ మెషీన్ లోపలి శక్తిమంతమైన అయాస్కాంతం అతడిని గొలుసుతో సహా తన వైపుకి లాగేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన న్యూయార్క్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సకాలంలో అధికారులు స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.
అదేంటి ఆస్పత్రిలో మెషీన్ ఆన్‌లో ఉండగా సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ గది తలుపు లాక్ చేసి ఉంటుందా కదా అనే ప్రశ్నలు సర్వత్రా మొదలయ్యాయి. అయినా రోగి పరీక్ష చేయించుకుంటుంటే ఈ వ్యక్తి అక్కడే తిరుగుతున్నాడా అంటూ పలుఅనుమానాలు వ్యక్తమయ్యాయి అందిరిలో. కాగా, ఇక అధికారులు కూడా ఈ సంఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇలాంటి స్కానింగ్ యంత్రాల పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇలాంటి ప్రమాదాల బారినపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఎంఆర్‌ఐ యంత్రాల సమీపంలో లోహ వస్తువులు ఎందుకు ప్రమాదకరం..
ఆ యంత్రాలు శరీరం లోపలి చిత్రాలను తీయడానికి అత్యంత బలమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తాయి. ఇది మెషిన్‌ని స్కాన్ చేయనప్పుడూ కూడా అయస్కాంతక్షేత్రం ఆన్‌లోనే ఉంటుందట. ఈ నేపథ్యంలోనే వైద్యులు ప్రజలకు ఆ మెషీన్ వద్దకు ఎలాంటి లోహ వస్తువులతో రాకూడదని సూచిస్తుంటారు.
(చదవండి: Donald Trump: కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్‌కు కూడా ఇదే సమస్య!)