
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాళ్ల వాపుతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు అనంతరం ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇదేమీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితి కాదని, 70 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే సమస్య అని పేర్కొన్నారు వైద్యులు. వృద్ధుల్లో ఇది అత్యంత సర్వసాధారణమైన పరిస్థితి అని తేల్చి చెప్పారు. ఇలా తరుచుగా ట్రంప్‌కి కాళ్ల వాపు ఎందుకు వస్తుంది అనే దిశగా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. వృద్ధులను వేదించే ఈ అనారోగ్య సమస్య ఎందువల్ల వస్తుంది..అసలేంటి వ్యాధి తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!.
దీర్ఘకాలిక సిరల లోపం అంటే..
ఇది ఎందుకు వస్తుందంటే..కాళ్లల్లోని సిరలు దెబ్బతిన్నప్పుడూ రక్త ప్రవాహాన్ని సరిగా నిర్వహించలేనప్పుడు సంభవిస్తుంది. కాళ్లలోని రక్తం గుండెకు తిరిగి రావడానికి కష్టమవ్వడంతో కాళ్ల సిరల్లో రక్త పేరుకుపోయి వాపు లేదా మచ్చల రావడం వంటి సమస్యలు వస్తాయి. అక్కడ సిరలు అధిక పీడనానికి గురై దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సిరలు మూడు రకాలుగా ఉంటాయి.
వాటిని లోతైన, ఉపరితల, డీప్ అనే సిరలుగా విభజిస్తారు. శరీరంలో లోతైన సిరలు కండరాల గుండా ప్రవహిస్తాయి. ఈ ఉపరిత సిరలు చర్మం ఉపరితలంతో కనెక్ట్ అవుతాయి. అంతకుమించి డీప్‌గా ఉండే సిరలు లోతైన, ఉపరితల సిరల రెండింటిని కనెక్ట్ చేస్తాయి
ప్రభావం ఎలా ఉంటుందంటే..
దీర్ఘాకాలిక సిరల లోపం( Chronic Venous Insufficiency) కారణంగా కాళ్ల నుంచి రక్తం గుండెకు చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కాళ్ల సిరల్లో ఒత్తిడి ఏర్పడి అతి చిన్న రక్తనాళాలు, కేశనాళికలు పగిలిపోతాయి. ఆ ప్రాంతంలోని చర్మం ఎర్రటి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. కాస్త గుద్దిన లేదా గీతలు ఏర్పడ్డ సులభంగా చీరుకుపోయినట్లు అవుతుంది.
అంతేగాద ఆ ప్రాంతంలో కణజాల వాపు, నష్టం ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం ఉపరితలంపై పుండ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్ల బారినపడతారు. ఈసమయంలో గనుక సకాలంలో వైద్యం తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది.
సంకేతాలు, లక్షణాలు..
కాళ్లు నొప్పి, తొందరగా అనిపించడం,జలదరింపు లేదా సూదులు గుచ్చుతున్న అనుభూతి
కాళ్లలో తిమ్మిరి ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా ఉండటం
రంగు మారిన చర్మం లేదా ఎర్రటి రంగులోకి మారడం
కాళ్లపై చర్మం పొరలుగా లేదా దురదగా ఉండటం
తోలులా కనిపించే చర్మం
పుండ్లు
వేరికోస్ సిరలు
కాలికింద భాగంలో వాపు మచ్చ కణజాలం అభివృద్ధి చెంది కణజాలాలోని ద్రవాన్ని బంధిస్తుంది.
ఇన్ఫెక్షన్‌కి రీజన్..
వైద్యుల అభిప్రాయం ప్రకారం, కాళ్ళ సిరల్లోని కవాటాలు సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు దీర్ఘకాలిక సిరలోపం సాధారణంగా ఏర్పడుతుంది. అలాగే కాళ్ళ సిరల్లో సరైన దిశలో రక్త ప్రవాహానికి సహాయపడే కవాటాలు ఉంటాయి. ఒకవేళ అవి కూడా దెబ్బతిన్నట్లయితే, రక్తం గుండె వైపు పైకి తిరిగి ప్రవహించడంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలా వాల్‌లు కూడా పనిచేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు.
కాళ్ళ సిరల్లో పుట్టుకతోనే వచ్చిన వైకల్యాలు.
కాళ్ళ సిరల్లో మార్పులు వల్ల
లోతైన సిరల త్రాంబోసిస్ కారణంగా ఈ సమస్య వస్తుంది. ఎక్కువగా వృద్ధులే ఈ సమస్య బారినపడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..)