
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేంత వరకు మంచి ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. "టర్బన్డ్ టోర్నడో"గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఫౌజా సింగ్ జూలై 14న 114 వయసులోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత శతాధిక వృద్ధ మారథాన్ అథ్లెట్‌గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరం. ఆయన చనిపోయేంత వరకు చక్కటి క్రమశిక్షణయుత జీవనశైలికి మారుపేరుగా నిలిచారాయన. వందేళ్ల వయసులో కూడా యువకుడు మాదిరి దూకుడుగా ఉండే అతడి తీరు అందర్నీ ఆశ్చచకితులను చేసేది. అంతలా సుదీర్ఘకాలం జీవించడమే కాకుండా..ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండేందుకు ఆయన ఎలాంటి ఆహార తీసుకునేవారు..?. అతడి జీవన విధానం ఎలా ఉండేది అంటే..
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫౌజా సింగ్ 1911లో జన్మించారు. వందేళ్లు పూర్తి అయిన వెంటనే మారథాన్‌లో పాల్గొని పరుగుపెట్టడం ప్రారంభించారు. ఆ వయసులో అతడి అపారమైన ఓపిక, చలాకితనం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ఈ మారథాన్ ప్రయాణాన్ని 89 ఏళ్ల వయసులో ప్రారంభించి 2000 నుంచి 2013 మధ్య మొత్తం 9 మారథన్‌లు పూర్తి చేశారు.
అంతేగాదు ఆయన తన 101వ పుట్టి రోజు జరుపుకున్న మూడు వారాలకే లండన్ మారథాన్‌లో పాల్గొని ఏడు గంటల 49 నిమిషాల్లో పూర్తి చేశారట. గత 12 ఏళ్లలో మొత్తం ఎనిమది మారథాన్లు పూర్తి చేశారు. ఇంతలా యాక్టివ్‌గా ఆ వయసులో మారథాన్లు పూర్తి చేయడానికి గల సీక్రెట్ సింపుల్ ట్రిక్సేనని అంటారు ఫౌజా సింగ్. తాను శాకాహారాలు మాత్రమే తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు.
అంతేగాదు ఆయన శాకాహారులు మాంసం తినేవారికంటే సుదీర్ఘకాలం బతుకుతారని బలంగా విశ్వసిస్తాడాయన. ఇదే విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తాను ప్రతిరోజు చపాతీ, పప్పు, సబ్జీ, సాగ్ వంటి శాకాహారాలు తినడం తోపాటు నడవడం, జాగింగ్ వంటివి కూడా చేస్తానని వెల్లడించారు. వయసు పరిణితిని అందిచవచ్చేమో గానీ ఓర్పు, ప్రశాంత జీవనం, మంచి ఆరోగ్యం మాత్రం పోషకాహారమైన శాకాహారంతోనే వస్తుందని సదా పిలుపునిచ్చేవారు ఫౌజా.
తాను జీవితాంతం శాకాహారినే అని ప్రకటించారు కూడా. సిక్కు మతం "జీవించడానికి తినాలే తప్ప తినడానికే జీవించకూడదు" అని ప్రభోదిస్తుంది. తాను పుట్టిన భారతావనిలోని పంజాబ్‌లో స్వయంగా తాము పండించే పంటలనే తింటారని, అదే వారి దీర్ఘాయువు రహస్యమని తరుచుగా చెబుతుండేవారు.
ఆ క్రెడిట్ అంతా శాకాహారాలకే ఆపాదిస్తానని అంటుండేవారు. మన భారత ప్రధాని మోదీ సైతం శాకాహారాలతోనే ఆరోగ్యం అని మన్‌కీ బాత్‌లో చెబుతుంటారు. అలానే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మొక్కల ఆధారిత ఆహారాలతోనే అనారోగ్యం బారిన పడకుంటా ఉంటామని చెబుతుండటం విశేషం.
(చదవండి: హీరో మాధవన్ వెయిట్‌లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..)