వ్యక్తి చుట్టు కుప్పగా హాట్‌ చిప్స్‌.. ఫన్నీ వీడియో.. | Watch: Man In Australia Covers Himself In Hot Chips: Viral Video | Sakshi
Sakshi News home page

వ్యక్తి చుట్టు కుప్పగా హాట్‌ చిప్స్‌.. ఫన్నీ వీడియో..

Oct 29 2021 1:32 PM | Updated on Oct 29 2021 2:04 PM

Watch: Man In Australia Covers Himself In Hot Chips: Viral Video - Sakshi

కాన్‌బెర్రా: సోషల్‌ మీడియాలో చాలా మంది వెరైటీ చాలెంజ్‌లు వేసుకుంటూ ఓవర్‌నైట్‌ ఫేమస్‌ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైస్‌బకెట్ చాలెంజ్‌, ట్రీ చాలెంజ్‌ వంటి.. అనేక రకాల చాలెంజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, మైఖేల్‌ బ్రోఖుయ్స్‌, మార్టిన్‌ సోకోలిన్స్కి జంట ఒక కొత్త రకం స్కిట్‌ను చేశారు.  ఈ ఫన్నీ జంట.. ఎప్పటి కప్పుడు కొత్త ప్రయోగాలు, కామెడి స్కెచ్‌ వీడియోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటారు.

తాజాగా వీరు.. ఒక విచిత్రమైన వీడియోను తమ మార్టియండ్‌ అండ్‌ ​మైఖేల్‌ అనే  ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం దాన్ని చూసి నెటిజన్లు ఫన్నీగా ఫీలవుతున్నారు. ఈ వీడియోలో.. ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్‌ ప్యారడైజ్‌ బీచ్‌లో మైఖేల్‌ తనను తాను.. హట్‌ చిప్స్‌తో కప్పించుకున్నాడు. దాదాపు 75వేలరూపాయల.. చిప్స్‌లను అతని చుట్టు కుప్పగా పోశారు. 

ఈ చిప్స్‌లను తినడానికి అక్కడి పక్షులు.. అతని చుట్టు కొన్ని వందల పక్షులు గుమిగూడాయి. పాపం.. అతను మాత్రం కదలకుండా ఒక శిల్పం మాదిరిగా ఉండిపోయాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘బలే.. ఫన్నీగా ఉంది..’..‘పాపం.. చిప్స్‌లో కప్పేసారుగా..’ అంటూ సరదాగా కామెంట్‌లు పెడుతున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement