Reliance Consumer Products partners with General Mills to launch Alan's Bugles snacks in India - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ స్నాక్స్‌ బిజినెస్‌.. భారత్‌లోకి అమెరికన్‌ బ్రాండ్‌ చిప్స్‌

May 27 2023 9:17 AM | Updated on May 27 2023 9:34 AM

reliance retail partners with general mills to launch alans bugles chips snacks - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అమెరికాకు చెందిన బ్రాండెడ్‌ కన్జూమర్‌ ఫుడ్స్‌ తయారీ సంస్థ జనరల్‌ మిల్స్‌తో రిలయన్స్‌ రిటైల్‌ చేతులు కలిపింది. తద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్నాక్స్‌ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. దేశీ మార్కెట్లో అలాన్స్‌ బ్యూగుల్స్‌ బ్రాండ్‌ కార్న్‌ చిప్స్‌ స్నాక్స్‌ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్‌ రిటైల్‌లో భాగమైన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్, (ఆర్‌సీపీఎల్‌) తెలిపింది.

ముందుగా కేరళతో ప్రారంభించి ఇతర రాష్ట్రాల్లో క్రమంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. వీటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుంది. 110 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) మార్కెట్లో గణనీయ మార్కెట్‌ వాటాను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆర్‌సీపీఎల్‌ ఇటీవల క్యాంపా, సోస్యో, రస్‌కిక్, టాఫీమ్యాన్‌ తదితర బ్రాండ్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: రిలయన్స్‌ రిటైల్‌ చేతికి లోటస్‌ చాకొలెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement