Blankets With Chips Packets: చిప్స్‌ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!

A Girl Makes Blankets Using Chips Packets For Homeless People - Sakshi

చాలా మంది పేదవాళ్ల కోసం తమకు తోచినరీతిలో రకరకాలు సహాయ సహకారాలు అందించడం గురించి విని ఉన్నాం. అంతెందుకు వాళ్లకు ఉండేందకు వసతి, మూడు పూటలా భోజనం వంటి రకరకాల ఏర్పాట్లు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా చూశాం. కానీ 11 ఏళ్ల బాలిక తనకు వీలైనంతలో అది కూడా పర్యావరణ రహితంగా నిరాశ్రయులకు ఉపయుక్తంగా ఉండేలా  దుప్పట్లు తయారు చేసి తనకున్న దొడ్డ మనసును చాటుకుంది.

(చదవండి: ఒమిక్రాన్‌ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్‌)

అసలు విషయంలోకెళ్లితే....యూకేలో వేల్స్‌లోని ప్రిస్టాటిన్‌కు చెందిన 11 ఏళ్ల అలిస్సా డీన్ నిరాశ్రయుల కోసం దుప్పట్లను తయారు చేస్తోంది. చలికాలంతో వెచ్చని దుప్పట్లు లేక బాధపడుతున్న అభాగ్యులను సురక్షితంగా ఉంచే నిమిత్తం దుప్పట్లను తయారు చేయాలనుకుంది. అంతేకాదు దుప్పట్లు తయారు చేసే నిమిత్తం ప్లాస్టిక్‌ సంచులను సేకరించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె టోపీలు, చేతికి వేసుకును గ్లౌజులు, చాక్లెట్‌ ట్రీట్‌ వంటి తదితర ప్యాకెట్లను ఉపయోగించి 80 దుప్పట్లను తయారు చేసింది.

అయితే ఒక్కో దుప్పటి తయారు చేయడానికి 44 ప్యాకెట్లు అవసరం. అంతేకాదు విరామ సమయంలో అలిస్సా, ఆమె తల్లి రకరకాల సంచులను సేకరించే పనిలో నిమగ్నమౌతారు. ఈ మేరకు ప్రతి దుప్పటిని ఇస్త్రీ చేసి వెదర్‌ ప్రూఫింగ్‌(అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా) చేసి  ఇస్తామని అలిస్సా తెలిపింది. అయితే తాము వారికి మన్నికైన మంచి దుప్పట్లు ఇవ్వాలనుకున్నాం అని అన్నారు. అయితే వీటిని తయారుచేసేందుకు ఆమె కూతురు తన పాకెట్‌ మనీ ఉపయోగించేది. కానీ ఇప్పుడూ తాము నిధులను సమకూర్చుకుంటున్నాం అని అన్నారు. అంతేకాదు తాము తయారు చేసే దుప్పట్లు డెన్‌బిగ్‌షైర్‌తో పాటు కాన్వీ, ఫ్లింట్‌షైర్ అంతటా పంపిణీ చేశాం అని చెప్పారు. ఈ మేరకు అలిసా, ఆమె తల్లి ఫేస్‌బుక్‌ సాయంతో దుప్పట్లు తయారు చేయడానికి అవసరమైన ప్యాకెట్లను సేకరిస్తామని తెలిపారు.

(చదవండి: క్యూఆర్‌ కోడ్‌ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top