Ola Electric:ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!

Ola To Delay Delivery Of First Batch Of Scooters Due To Chip Shortage - Sakshi

భారత ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల లాంచ్‌తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్‌ కొరత పలు ఆటోమొబైల్‌ కంపెనీలను తీవ్రంగా వేధిస్తూనే ఉంది. చిప్‌ కొరతతో సతమతమవుతున్న కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్‌ కూడా చేరింది. దీంతో  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. డెలివరీ వాయిదా పడటంతో  కొనుగోలుదారులకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. 
చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌..!

డెలివరీ ఎప్పుడంటే..!
ఓలా ఎలక్ట్రిక్‌ బైక్ల తొలి బ్యాచ్‌ డెలివరీ నవంబర్‌ 30న జరగాల్సి ఉండగా...అది కాస్త డిసెంబర్‌ 15కు వాయిదా పడింది. చిప్‌సెట్స్‌, ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల కొరత కారణంగా బైక్ల డెలివరీ మరోసారి వాయిదా పడింది.  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లను ప్రిబుక్‌ చేసుకొని పూర్తి అమౌంట్‌ను చెల్లించిన కొనుగోలుదారులకు డిసెంబర్‌ 31న  డెలివరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

క్షమాపణలు కోరిన ఓలా..!
ఓలా ఎలక్ట్రిక్‌ ఫ్యాక్టరీ బృందం , గ్లోబల్ సప్లై చైన్‌ల మధ్య శనివారం జరిగిన సమావేశంలో చిప్స్ , ఎలక్ట్రానిక్ విడిభాగాల డెలివరీ మరింత అధ్వాన్నంగా ఉండడంతో తొలి బ్యాచ్‌ స్కూటర్ల డెలివరీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డెలివరీ మరోసారి వాయిదా పడటంతో కొనుగోలుదారులకు కంపెనీ క్షమాపణలను చెప్పింది. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్ల 4జీ కనెక్టివిటీలో భాగంగా కంపెనీ క్వాలకమ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
చదవండి: గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top