తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌..!

E scooter Bounce Infinity to be launched on Dec 2 - Sakshi

Bounce Infinity Electric Scooter With Removable Battery Teased: బెంగళూరుకు చెందిన ప్రముఖ బైక్‌ రెంటల్‌ సర్వీసెస్‌ స్టార్టప్‌ బౌన్స్‌ త్వరలోనే భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్‌ చేయనుంది. డిసెంబర్‌ 2 న బౌన్స్‌ ఇన్ఫినిటీ ఈ-స్కూటర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఈ-స్కూటర్‌ ప్రిబుకింగ్స్‌ కూడా ప్రారంభంకానున్నాయి. కొనుగోలుదారులు రూ.499 చెల్లించి ప్రి-బుకింగ్‌ చేసుకోవచ్చునని బౌన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ బైక్లను బౌన్స్‌ డెలివరీ చేయనున్నుట్లు తెలుస్తోంది. 
చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!

ఈవీపై కన్ను..!
భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై వస్తోన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవడానికి బౌన్స్‌ తన సొంత ఈ-స్కూటర్‌ ఎలక్ట్రిక్‌ వాహానంతో ముందుకొచ్చింది. అందుకుగాను బెంగళూరుకు చెందిన 22మోటార్స్‌ ఈవీ స్టార్టప్‌ను బౌన్స్‌ చేజిక్కించుకుంది. 22మోటార్స్‌తో సుమారు 7 మిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని బౌన్స్‌ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా.. రాజస్థాన్‌లోని భివాడిలోని 22మోటర్స్‌ తయారీ ప్లాంట్‌ బౌన్స్‌ కొనుగోలు చేసింది. అత్యాధునికమైన ఈ ప్లాంట్ సంవత్సరానికి 180,000 స్కూటర్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్‌ ధర సుమారు రూ. 75 వేలలోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. 

దేశంలో తొలి సారిగా సరికొత్త పంథా...!
భారత్‌లో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ మార్కెట్లలోకి బౌన్స్‌ సరికొత్త పంథాతో ముందుకురానుంది. ‘బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌’  మోడల్‌ను బౌన్స్ పరిచయం చేయనుంది. ఇన్ఫినిటీ ఈ-స్కూటర్లను కొనుగోలుదారులు విత్‌ అవుట్‌  బ్యాటరీ లేకుండా కొనుగోలుచేసే అవకాశాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇన్ఫినిటీ బైక్‌ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 నుంచి 50 శాతం మేర బౌన్స్‌ ఇన్పినీటీ బైక్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది.  పలు నగరాల్లో బ్యాటరీ ఛేంజ్‌ స్టేషన్లను బౌన్స్‌ ఏర్పాటు చేయనున్నుట్ల తెలుస్తోంది. వీటి సహయంతో వాహనదారులు బ్యాటరీ స్వాపబుల్‌ చేస్తూ... కేవలం బ్యాటరీ మార్పిడి చేసినప్పుడు మాత్రమే చెల్లించే విధానాన్ని బౌన్స్‌ తీసుకురానుంది. 

చదవండి: టెస్లాకు చెక్‌పెట్టనున్న ఫోర్డ్‌..! అదే జరిగితే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top