టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం | NHAI Might Discontinue Cash Transactions At Nationwide Toll Plazas From April 1st, 2026 | Sakshi
Sakshi News home page

టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం

Feb 20 2026 9:34 PM | Updated on Feb 21 2026 10:50 AM

NHAI might discontinue cash transactions at all toll plazas from April 1, 2026

ఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వాహనదారులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా టోల్‌ ప్లాజాలలో నగదు లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఈ కొత్త విధానం ఈ ఏడాది  ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.  

దేశవ్యాప్తంగా 1,150కి పైగా టోల్‌ ప్లాజాలలో ఫాస్టాగ్‌లు,నగదు చెల్లింపులు ద్వారా జరుగుతున్నాయి. తద్వారా టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీతో పాటు పారదర్శకత లోపిస్తుండడంపై ఎన్‌హెచ్‌ఏఐ దృష్టిసారించింది. ఇందులో భాగంగా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని భావిస్తోంది. యూపీఐ,ఫాస్టాగ్‌ ద్వారా వాహనదారులు టోల్‌ ఛార్జీలు చెల్లించే వెసలు బాటు కల్పించనుంది.  

గతంలో, ఫాస్ట్‌ట్యాగ్‌ల స్వీకరణ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ ప్లాజాలలో సగటు వేచి ఉండే సమయం 734 సెకన్ల నుండి 47 సెకన్లకు తగ్గిందని ఎన్‌హెచ్‌ఏ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement