Plaza
-
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్ : స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతూ..!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువచేసే డైమండ్ ఆభరణాలు అనగానే ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, గొప్ప దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్ ప్లాజాలో స్టైలిష్‌గా మెరిశారు.ఆరుపదుల వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉంటారు. వ్యాయామం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన స్నేహితులకు టైం కేటాయించడంలో ముందుంటారు. ఏప్రిల్ 16న నీతా అంబానీ తన ప్రాణ స్నేహితులు అబు జాని , సందీప్ ఖోస్లా స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ సందర్భంగా నీతా అంబానీ అద్దాలతో అలంకరించిన చీరలో అద్భుతంగా కనిపించి అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్నారు. తెల్లని ఛాయలో మెరిసి నీతా అంబానీకి బ్లాక్ కలర్ శారీకి మిర్రర్-వర్క్ అలంకరణ హైలైట్‌గా నిలిచింది. దీనికి సీక్విన్డ్ గోల్డెన్ బ్లౌజ్ మరింత అందాన్నిచ్చింది. ఈ చీరకు తగ్గట్టు లేయర్డ్ ముత్యాల నెక్లెస్ మ్యాచింగ్ చెవిపోగులు , డైమండ్ బ్యాంగిల్స్ మరింత స్టైల్‌గా నప్పాయి. బంగారు పొట్లీ బ్యాగ్ సొగసుగా అమిరింది. మరోవైపు, డిజైనర్ ద్వయం అబు జాని , సందీప్ ఖోస్లా తెల్లటి దుస్తులు, ముత్యాల నగలతో రాయిల్లుక్తో అలరించారు. (రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్)అంతకుముందు పారిస్‌లో జరిగిన ఫెసిలిటేషన్ డే కోసం నీతా అంబానీ అబు జాని , సందీప్ ఖోస్లాద్వజం డిజైన్ చేసిన వింటేజ్ దుస్తులను ఎంచుకున్నారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ఒక్కో సందర్భానికి ఒక్కోలా ముస్తాబై తనదైన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు. నీతా అంబానీ. ఎపుడూ చీరలకు ప్రాధాన్యత ఇచ్చే నీతా నూతన సంవత్సర వేడుకల కోసం, కేప్ స్టైల్ డిటైలింగ్‌తో సీక్విన్డ్ వర్క్ ఫ్లోర్ లెంత్ గౌను, గ్రే షాల్, డైమండ్ చెవిపోగులు , రింగ్, తన లుక్‌ను స్టైల్ చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన -
బెంగళూరులో చిరుత పులి సంచారం కలకలం
కర్ణాటకలోని బెంగళూరులో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తుమకూరు రోడ్..హోసూర్ రోడ్ మధ్య ఫేజ్ 1 టోల్ ప్లాజ్ ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3.00 గంటలకు చిరుతపులి టోల్‌ప్లాజా సమీపంలోని ఫ్లైఓవర్‌ను దాటుతున్నట్లు టోల్ ఫ్లాజా అధికారులు గుర్తించారు. పనక్ ఇండియా కంపెనీ ప్రాంతం నుండి నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఎన్ టీటీ ఎఫ్ ) వైపు చిరుత పులి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీటీఎఫ్ ప్రిన్సిపల్ సునీల్ జోషి మాట్లాడుతూ.. టోల్ గేట్ సమీపంలోని కెమెరాలో కాంపౌండ్ వాల్ దగ్గర నుండి చిరుతపులి వెళ్ళినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం ఇనిస్టిట్యూట్ లలో అన్నీ గదులను, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశాం.ఎక్కడా పులి ఆనవాళ్లు కనిపించలేదు. క్యాంపస్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించాం. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు. చిరుతపులి కాంపౌండ్ ప్రక్కన ఉన్న దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో మాకు తెలియదు’ అని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ తరగతులను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి : రూటు మార్చిన ఇజ్రాయెల్ -
చారిత్రక నగరంలో ఫుడ్ నైట్
రాజమహేంద్రవరం సిటీ: ఆహార ప్రియులకు శుభవార్త.. రాత్రివేళ టిఫిన్ లేదా మరే ఇతర ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా ఎక్కడ దొరుకుతాయనే దిగులు చెందనక్కర లేదు. ఒకచోటే ఫుడ్ ఐటమ్స్ కొలువుతీరి స్వాగతం పలకనున్నాయి. చీకటి పడిందని చింతపడనక్కర్లేదు. అర్ధరాత్రి సమీపిస్తున్నా ఆదరాబాదరా పడనక్కరలేదు. హ్యాపీగా తినివెళ్లొచ్చు.. రాజమహేంద్రవరంలోనే ఈ అవకాశమండోయ్.. ఈ వివరాలేంటో తెలుసుకుందాం..! నగరంలో వినూత్నరీతిలో అర్బన్ ఫుడ్ ప్లాజా ఏర్పాటు కానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రమయ్యాక చాలా మంది నగరానికి చేరుకునే ఇతర ప్రాంతాల వారు గాని ఇక్కడి ప్రజలు గాని రోడ్ల మీద ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? అని వెతకటం సహజం. దీనిని దృష్టిలో పెట్టుకుని నగరపాలకసంస్థ రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ వివిధ రకాల ఫలహారాలు ఒకేచోట అందించాలని సంకల్పించింది. బిర్యాని, చైనీస్ ఫుడ్, తందూరీ, వెజిటేరియన్ ఫుడ్స్, పండ్ల రసాలు, ఫాస్ట్ ఫుడ్స్, టిఫిన్స్ ఇలా 10 రకాల ఆహారాలను ఒకే వేదికపైకి అందుబాటులోకి తేనుంది. ఇందు కోసం 33 స్టాల్స్‌ను సిద్ధం చేస్తోంది. విజయవాడ తరువాత మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఇలాంటి సదుపాయం కల్పించనుంది. స్టాల్స్ ఏర్పాటుకు రూ.1 కోటి వెచ్చించనుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రెండో గేట్ అర్బన్ స్క్వేరు సెంటర్‌ను ఆనుకుని అర్బన్ ఫుడ్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మీటర్లు పొడవున్న ఈ రోడ్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఫుడ్ ప్లాజా ప్రాంతాన్ని అలంకరించనున్నారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులో సన్నాహాలు ఈ స్టాల్స్‌లో నిబంధనలకు అనుగుణంగా.. నాణ్యతను పాటించేలా ఉత్సాహవంతులైన వ్యాపారుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. ఎన్నింటికి తెరవాలి.. ఎన్నింటికి క్లోజ్ చేయాలి.. ఎలాంటి నాణ్యత కల్పించాలి?, సందర్శకులతో వ్యవహరించే తీరు.. ఫుడ్ ఐటమ్స్ లాంటి విషయాలపై 521 మంది దరఖాస్తుదారులతో ఇప్పటికే కమిషనర్ దినేష్‌కుమార్ మాట్లాడారు. మొదటి దశలో కంబాల చెరువు రోడ్డు పక్కన, కోటి లింగాల ఘాట్ వద్ద ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. అర్బన్æ ఫుడ్ ప్లాజాను ఈట్ స్ట్రీట్ పేరుతో షాడే బాలికల స్కూల్ రోడ్లో ప్రతిపాదించి సిద్ధం చేశారు. ఆ రోడ్డు సక్రమంగా లేదని చివరికి ఆర్ట్స్ కళాశాల రోడ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో పదిరోజులే సమయం ఉండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో రాత్రి సమయాల్లో ప్రధాన సెంటర్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పుడ్ప్లాజాతో ఈ ఇబ్బందులు చక్కబడే అవకాశాలున్నాయి. అర్బన్ ఫుడ్ ప్లాజా కచ్చితంగా ప్రజలకు ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పంచుతుందని కమిషనరు దినేష్‌కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలను నియంత్రించనున్నారు. ఆహార ప్రియులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని హాయిగా వెళ్లగలగాలనేది తమ ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు. డిసెంబరు 1న ప్రారంభం రాజమహేంద్రవరంలో ఫుడ్ ప్లాజా ఏర్పాటుతో ఆహార ప్రియుల కోసం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. విజయవాడ తరువాత ఈ నగరంలోనే ఏర్పాటు చేస్తున్నాం. 10 కేటగిరీల్లో 33 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25 వేలు ముందుగా డిపాజిట్ చెల్లించాలి. నెలకు రూ.10 వేలు అద్దెగా నిర్ణయించాం. ఈ నెల 21 వరకూ డిపాజిట్ చెల్లించేందుకు సమయం ఇచ్చాం. అందరి సమక్షంలో డ్రా తీసి దరఖాస్తుదారులకు షాపుల స్థలం కేటాయిస్తాం. రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ కోరుకున్న ఆహారం ఒకే వేదిక వద్ద లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – దినేష్‌కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం -
చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!
బీజింగ్ః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనా వాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులను సృష్టించడంలోనూ వారికి వారే సాటి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని వేలమంది ఒకే వేదికపై చేరి, నృత్య ప్రదర్శన చేసి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించారు. చైనా వాసుల దృష్టి ఈసారి నృత్యం వైపు మళ్ళింది. బీజింగ్, షాంఘైతోపాటు మరో నాలుగు నగరాలను ఎంచుకొని, ఒకేవేదికపైకి చేరడమే కాదు.... ఏకంగా 31,697 మంది ఒకేసారి నృత్య కార్యక్రమంలో పాల్గొని దాదాపు ఐదు నిమిషాల పాటు అడుగులు కలిపి అందర్నీ ముగ్ధుల్ని చేయడంతోపాటు ప్రపంచ రికార్డును సైతం సాధించారు. నగరంలోని ప్రముఖ బర్డ్స్ నెస్ట్ స్టేడియం ముందు చేరి పెద్దా చిన్నా వయోబేధం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో సమయానికి వర్షం నేనున్నానంటూ వచ్చి చేరింది. దీంతో నృత్యకారులంతా రెయిన్ కోట్లు ధరించి మరీ డ్యాన్స్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరే ఉండి పర్యవేక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందించారు. సాధారణంగా మధ్యవయసు, వయసు మళ్ళిన మహిళలు పార్కులు, ప్లాజాల వంటి పబ్లిక్ ప్లేసుల్లో నృత్యం చేస్తుండటం చైనాలో చూస్తాం. అయితే ఆరోగ్యానికి సహకరించేదిగా భావించి పబ్లిక్ ప్లేసుల్లో చేసే డ్యాన్స్... దానితో పాటు పెట్టే భారీగ మ్యూజిక్ సౌండ్ ఒక్కోసారి చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు వేలమంది స్థానికులు కలసి ఒకేచోట చేపట్టిన నృత్య కార్యక్రమం మాత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాక రికార్డును కూడ తెచ్చి పెట్టింది. -
సహారా ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ హోటల్స్ వేలం?
న్యూయార్క్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహారా గ్రూప్.. అమెరికాలో తనకున్న ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ హోటల్స్‌ను వేలం వేసే సూచనలున్నట్లు వార్తలొస్తున్నాయి. వేలం ఏప్రిల్ 26న జరిగే అవకాశముందని, దీని విలువ దాదాపుగా 1 బిలియన్ డాలర్లు ఉంటుందని ఒక అంచనా. కాగా ఈ విషయమై సహారా గ్రూప్ స్పందించలేదు. గత రెండేళ్లుగా జైలులో ఉన్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌ను బయటకు తీసుకురావడం కోసం విశ్వప్రయత్నాలు జరుగుతున్న విషయం విదితమే. -
గాలిపటం ఎగరవేసిన 'కవిత'