మూడేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు  | Brigade Group Debuts Flagship Brigade Showcase in Hyderabad | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు 

Feb 21 2026 5:02 AM | Updated on Feb 21 2026 7:30 AM

Brigade Group Debuts Flagship Brigade Showcase in Hyderabad

హైదరాబాద్‌  ప్రాజెక్టులపై బ్రిగేడ్‌ గ్రూప్‌  ప్రణాళికలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ మార్కెట్లో ప్రాజెక్టులపై వచ్చే 3 సంవత్సరాల్లో సుమారు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈడీ అమర్‌ మైసూర్‌ తెలిపారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మొదలైన వాటికి సంబంధించి సుమారు 3.5 మిలియన్‌ చ.అ. అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. 

హైదరాబాద్‌లో ఇటీవలే దాదాపు రూ. 500 కోట్లతో 4.03 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు కొనసాగుతుండగా, మరో రెండింటిని ప్రారంభించబోతున్నామన్నారు. తమ వృద్ధి వ్యూహంలో హైదరాబాద్‌ కీలక మార్కెట్‌గా ఉంటుందని అమర్‌ వివరించారు. ఈ నేపథ్యంలో బ్రిగేడ్‌ షోకేస్‌ పేరిట రెండు రోజుల ఎక్స్‌పో నిర్వహిస్తున్నామన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement