పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. | Makar Sankranti 2026: Is Your Festive Food Diet Causing Stomach Pain | Sakshi
Sakshi News home page

పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..

Jan 16 2026 6:42 PM | Updated on Jan 16 2026 7:06 PM

Makar Sankranti 2026: Is Your  Festive Food Diet Causing Stomach Pain

ఆరోగ్య స్పృహ బాగా ఉన్నవాళ్లు కూడా పండుగ సమయంలో ఫుడ్‌ విషయంలో తమ నియంత్రణలను కాస్త సడలించుకోవడం, పండుగ వంటల్నిఇ ఆస్వాదించడం సాధారణమే. ఇక భోజన ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. పైగా సంక్రాంతి అంటే 3రోజుల పాటు కొనసాగే పండుగ...పిండింటలకూ కొదవలేని పండుగ. అందుకే ఈ పండుగ సీజన్‌ తర్వాత,కొంచెం నిస్సత్తువగా అనిపించడం, ఉబ్బరం, తక్కువ శక్తి, నిద్రలేమి  తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పండుగ తర్వాత ఆహార విహారాల్లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు.

రీహైడ్రేట్, టాక్సిక్స్‌ బయటకు...
పండుగల సమయంలో, మనం తరచుగా అదనపు చక్కెర, నూనె పదార్ధాలు  అలవాటున్నవాళ్లు ఆల్కహాల్‌ కూడా తీసుకుంటారు. ఇవన్నీ డీహైడ్రేషన్,  అలసటలతో బాధపెడతాయి. కాబట్టి పండగ తర్వాత రోజుల్ని ఒక సాధారణ దినచర్యతో ప్రారంభించాలి.   పుష్కలంగా నీరు త్రాగాలి. 

ఉదర వ్యవస్థను ఫ్లష్‌ చేసి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కనీసం 8–10 గ్లాసుల నీటిని  లక్ష్యంగా పెట్టుకోవాలి. నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను జోడించడం వల్ల మరింత రిఫ్రెష్‌గా ఉంటుంది తేలికపాటి డిటాక్స్‌ ఇస్తుంది. అల్లం, పుదీనా లేదా సోంపు వంటి హెర్బల్‌ టీలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి శరీరాన్ని లైట్‌గా మారుస్తాయి.

సమతుల ఆహారం వైపు తిప్పు చూపు...
పండుగలు అంటే స్వీట్లు, వేయించిన వంటలతో భారీ భోజనం. ఇక ఇప్పుడు భోజనంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలి. జీర్ణక్రియను నియంత్రించడంలో ఉబ్బరం తొలగించడంలో ఫైబర్‌–రిచ్‌ ఫుడ్స్, తృణæధాన్యాలు, ఓట్స్‌  తాజా పండ్లు  సహాయపడతాయి.

బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్‌ కూరగాయలను వంటలో చేర్చాలి.    పండుగ తర్వాత పెరిగే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడానికి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

కాయధాన్యాలు, పప్పు, కాటేజ్‌ చీజ్‌ గుడ్లు వంటి సాధారణ ప్రోటీన్లు కడుపు నిండినట్టు తృప్తికరమైన స్థితిలో ఉంచుతాయి, ఆయిల్‌ ఫుడ్స్‌ పట్ల ఇష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

గింజలు, విత్తనాలు  తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన నూనెలు (ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె వంటివి) చేర్చాలి.

తేలికపాటి ఉపవాసం జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడానికి సులభమైన మార్గం. పూర్తి రోజు చేయలేకపోతే కనీసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తినడం వంటి  పద్ధతిని అనుసరించాలి. 

తద్వారా రాత్రిపూట 14 గంటల ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. ఈ విధానం  శరీరపు పండుగ ఓవర్‌లోడ్‌ను ప్రాసెస్‌ చేయడానికి  జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను రీసెట్‌ చేస్తుంది.

పండుగ తర్వాత అలసటతో  వ్యాయామాన్ని ఆపేయాలని అనుకోవచ్చు, కానీ సున్నితమైన కదలికలు అయినా తప్పనిసరి. దశలవారీగా 20–30 నిమిషాల నడక రక్త ప్రసరణను పెంచుతుంది,  మరింత శక్తినిచ్చేలా చేస్తుంది.  

జీర్ణక్రియకు సహాయపడుతుంది. తేలికపాటి యోగా భంగిమలు, లోతైన శ్వాసపై దృష్టి సారించి చేసే  స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలు ఉబ్బరాన్ని   కండరాల బిగుతు ను తగ్గిస్తాయి మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి.

పండుగ రోజుల రాత్రులు, తెల్లవారుఝాములు నిద్ర షెడ్యూల్‌లను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కోలుకోవడానికి  ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడానికి  మేల్కొలపడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్  వీక్షణను నివారించి బదులుగా, పుస్తకం చదవడం మంచిది. 

ప్రశాంతమైన సంగీతాన్ని వినడం కూడా మంచిదే.  నిద్ర పోయే గది పూర్తి నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు  ధ్యానం లేదా లోతైన శ్వాస మనస్సును ప్రశాంతపరుస్తుంది  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

కొన్ని ఆయుర్వేద చిట్కాలు...
డిటాక్స్‌ వాటర్‌: ఒక టీస్పూన్‌ పసుపు లేదా చిటికెడు దాల్చిన చెక్క కలిపిన గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. రెండు సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పేరుకున్న చెడు టాక్సిన్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి.

భోజనానికి చిటికెడు ఆసాఫోటిడా (హింగ్‌) జోడించడం లేదా సోంపు లేదా అజ్వైన్‌ నీటిని త్రాగడం అనేవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి  ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి.

త్రిఫల పౌడర్‌:  పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్‌ త్రిఫల పౌడర్‌ తీసుకోండి. ఈ ఆయుర్వేద మిశ్రమం ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది  జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

జీలకర్ర, కొత్తిమీర, సోంపు నీరు: ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్‌ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలను ఉడకబెట్టండి. జీర్ణక్రియను ప్రోత్సహించడానికి  ఉబ్బరం తగ్గించడానికి రోజంతా త్రాగండి.

ఒక టీస్పూన్‌ పసుపు  చిటికెడు నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని పాలు టర్మరిక్‌ లాట్టే (గోల్డెన్‌ మిల్క్‌)ఉపశమనం కలిగించేవి  శోథ నిరోధకమైనవి. రోజును ప్రారంభించడానికి వెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన అల్లం  తేనె కలిపితే... ఇది జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

(చదవండి: పొంగల్‌వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement