సంక్రాంతి వచ్చిందంటే ఆనందాల సందళ్లు తెచ్చినట్లే. ప్రతి ఇంటా సంబరాలు వెల్లి విరుస్తాయి. పేద ,గొప్ప అన్న తేడా లేకుండా తమకు తోచిన విధంగా అందరూ సంక్రాంతి పండగను జరుపుకుంటారు. రంగవళ్లుల లోగిళ్లు, పిండివంటల ఘుమఘుమలు, ఆత్మీయుల నవ్వుల పలకరింతలు, అనుబంధాలు, అనురాగాలతో, సంతోషాలతో ఆనందంగా గడుపుతారు.
పొంగల్ వేడుక
పల్లెటూరల్లో అయితే ఈ వేడుకల మోత మోగుతుంది. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, ఇంకా కాయ్ రాజా కాయ్ అంటూ అనేక క్రీడలు ఆడతారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో ఆడంబరంగా, ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా కోలీవుడ్‌లో మన తారలు పొంగల్ వేడుకను భక్తిశ్రద్ధలతో వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఫ్యామిలీతో రజనీకాంత్
అలా రజనీకాంత్ నుంచి దర్శకుడు మారిసెల్వరాజ్ వరకు పలువురు పొంగల్ సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన అభిమానులను సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. ఈ పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సెలబ్రిటీల సంక్రాంతి
హీరోయిన్ నయనతార ఈ పొంగల్ వేడుకలను తన భర్త ,దర్శకుడు విఘ్నేశ్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి విశేషంగా జరుపుకున్నారు. పిండివంటలు, రకరకాల తీపి పదార్థాలు, పళ్లు, చెరుకు గడలు ఏర్పాటు చేసి, పాలు పొంగించారు. హీరో కార్తీ కూడా ఇంటి ముంగిట్లో పాలు పొంగించి పొంగల్‌ను వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా శివకార్తికేయన్ తన కుటుంబ సభ్యుల సమేతంగా పొంగల్ వేడుకను జరుపుకున్నారు. నటుడు అరుణ్ విజయ్, నటుడు అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ దంపతులు, దర్శకుడు మారిసెల్వరాజ్ తదితర సినీ ప్రముఖులు సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
Thalaivar waiting to eat Pongal just like us @rajinikanth 😃😃❤️✨️#SuperstarRajinikanth #Rajinikanth #Jailer2 #Thalaivar173 pic.twitter.com/8ARzjZPmXW
— Achilles (@Searching4ligh1) January 15, 2026
இனிய பொங்கல் திருநாள் நல்வாழ்த்துக்கள் 🍚🌾🎋 తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు #MegaBlockBusterPongal pic.twitter.com/9aHE3KdODI
— Nayanthara✨ (@NayantharaU) January 15, 2026


