విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
బాపట్ల: బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎంపిక ఆదివారం జరిగింది. బాపట్లలోని బ్రహ్మంగారి దేవస్థానంలో ఈ ఎంపిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కడలి జగదీష్ అధ్యక్షతన ఎంపిక చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా మత్సా. సుధాకర్, గౌరవ అధ్యక్షులుగా మార్టూరు నుంచి మత్సా శేషాచారి, పొతకమూరి ప్రభాకర్, కోశాధికారిగా, ఆర్గనైజయింగ్ సెక్రటరీగా రేపల్లె నుంచి కొసూరి శివ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గాసాంబశివరావు శనగపటి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెదురుపర్తి లక్ష్మణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు జి. ప్రభాకర్ విశ్వకర్మ, బ్రాహ్మగారి మఠం అన్నదానం సేవా సమాజం అధ్యక్షులు కోడూరి సుబ్రహ్మణ్యాచారి, చిరంజీవి చిత్తరంజన్ శర్మ, సున్నం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


