జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా

Jan 12 2026 7:26 AM | Updated on Jan 12 2026 7:26 AM

జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా

జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా

జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా

వివిధ విభాగాల్లో బంగారు, వెండి పతకాలు కై వసం ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన బాపట్ల జిల్లా క్రీడాకారులు అభినందించిన కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

చీరాల రూరల్‌: జాతీయ స్థాయిలో నిర్వహించిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో చీరాల క్రీడాకారులు తమ సత్తా చాటారు. రన్నింగ్‌, షాట్‌పుట్‌, జావలిన్‌ త్రో వంటి వివిధ విభాగాల్లో రాణించి బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్నట్లు మాస్టర్‌ అథ్లెట్‌ పంబా నాగయ్య ఆదివారం తెలిపారు. పూర్తి వివరాలు ... ఆంధ్రప్రదేశ్‌ ఓవరాల్‌ చాంపియన్‌ షిష్‌ కై వసం చేసుకోగా, బాపట్ల జిల్లాలోని క్రీడాకారులు ఓవరాల్‌గా 32 పతకాలు సాధించి జిల్లాకు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆల్‌ ఇండియా మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7వ తేదీల్లో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఆల్‌ ఇండియా మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా తరఫున వివిధ విభాగాల్లో మాస్టర్స్‌ క్రీడాకారులు పోటీల్లో నిలిచి తమ సత్తా చాటుకున్నారు.

పతకాలు సాధించింది వీరే..

● 70 ఏళ్ల ప్లస్‌ విభాగంలో పంబా నాగయ్య 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు, 1500 మీటర్ల పరుగులో వెండిపతకం సాధించారు. 45 ప్లస్‌ విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు పరుగులో బంగారు, 100 మీటర్ల పరుగులో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్‌ మెడల్‌ అందుకున్నారు.

● 45 ప్లస్‌ విభాగంలో ఎస్‌. శివన్నారాయణ 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, లాంగ్‌జంప్‌లో వెండిపతకం సాధించారు.

● 45 ప్లస్‌ విభాగంలో షేక్‌ రెహమాన్‌ షాట్‌పుట్‌, 800 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానం సాధించి వెండిపతకాలు సొంతం చేసుకున్నారు.

● అలానే 40 ప్లస్‌ విభాగంలో సీహెచ్‌ నాగరాజు షాట్‌పుట్‌, డిస్కస్‌త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు, జావలిన్‌త్రోలో ద్వితీయ స్థానం సాధించి వెండిపతకం అందుకున్నారు.

● 40 ప్లస్‌ విభాగంలో ఎం. నాగరాజురెడ్డి 400 మీటర్ల రన్నింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, 1500 మీటర్లు, 5 కిలో మీటర్లు పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి వెండిపతకాలు అందుకున్నారు.

● 35 ప్లస్‌ విభాగంలో బడే శ్రీనివాసరెడ్డి జావలిన్‌త్రో, డిస్కస్‌త్రోలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండిపతకం అందుకున్నా రు.

● 35 ప్లస్‌ విభాగంలో ఆర్‌. ప్రదీప్‌ 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం, 100 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ అందుకున్నారు.

● అలానే 30 ప్లస్‌ విభాగంలో పిట్టు మాధవరావు 1500 వందల మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్‌ మెడల్‌ అందుకున్నాడు. బంగారు పతకాలు సాధించి క్రీడాకారులు ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement