breaking news
Bapatla District Latest News
-
బాబోయ్.. వెజి‘ట్రబుల్స్’
●అద్దంకి: వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రెండు రోజుల్లోనే ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు, పేదలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు ఖర్చు చేసినా ఓ చిన్న కుటుంబానికి నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయాలు రావడం లేదు. పచ్చి మిర్చి ధర కిలో రూ.120కి చేరుకుంది. మిగిలిన కూరలు కిలో రూ.50పైగానే పలుకుతున్నాయి. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో పేదలు కనీసం పచ్చడి మెతుకులు వండుకోవడానికీ ఆలోచించాల్సి వస్తోంది. ప్రతి వంటకు అవసరమైన పచ్చిమిర్చితో పాటు మునగ కాయలు కూడా కొండెక్కాయి. కిలో పచ్చిమిచ్చి నాలుగు రోజుల కిందట రూ.50 ఉండగా, ప్రస్తుతం రూ.120 చేరుకుంది. మునగ రూ.120 పలుకుతోంది. రూ.20 ఉండే బీర, దోస ధరలు రూ.60కి పైమాటే. ఇక క్యారెట్, బీట్రూట్ రూ.70 పలుతున్నాయి. చిక్కుడు ధర రూ.90కి పైమాటే. టమోటా కిలో ధర రూ.40 వరకు పలుకుతోంది. ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వర్షాలు లేకపోవడంతో కూరగాయలు పండలేదని, సుదూరప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతోనే ధరలు బాగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడినా, ఈ ప్రాంతంలోని భూముల్లో కూరగాయలు పండి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసరికి కనీసం నలభై నుంచి యాభై రోజులు పడుతుందని, అప్పటివరకూ ఈ ధరలు భరించక తప్పదేమోనని ప్రజలు భయపడుతున్నారు. కూరగాయ రకం ధర (రూ) పచ్చి మిర్చి 120 మునగకాయలు 120 చిక్కుళ్లు 90 క్యారెట్ 80 బీట్రూట్ 70 బంగాళాదుంప 50 దోస 40 బెండ 60 బీర 60 కొండెక్కిన కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్న పచ్చిమిర్చి -
నేడు మారనున్న రూపు
ఏ ప్రభుత్వానికై నా ముందు చూపు అవసరం. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఫలాలు ప్రజలకు అందుతాయి. అందులో భాగంగానే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021లో బెంగళూరు–విజయవాడను కలిపే కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అదే సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రణాళికను ఆమోదించింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026 నాటికి హైవేపై వాహనాలు పరుగులు తీయనున్నాయి. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయంతోపాటు డబ్బు ఆదా కానున్నాయి. అంతేకాదు అద్దంకి పరిసర ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. అద్దంకి: అభివృద్ధిలో వైఎస్సార్ సీపీ ఏనాడూ వెనుకంజ వేయలేదనే సత్యం నేడు వెలుగులోకి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021లో బెంగళూరు–విజయవాడను కలిపే కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అదే సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రణాళికను ఆమోదించింది. దీంతో బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి శ్రీకారం చుట్టారు. 2024 మార్చిలో పనులు ప్రారంభమయ్యాయి. 2026–27 నాటికి ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ రహదారి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. దీంతో అద్దంకి పరిసర గ్రామాలు, నియోజకవర్గలోని వివిధ గ్రామాల్లోని వారికి బెంగళూరు–విజయవాడ ప్రయాణ సమయం తక్కువ కానుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాలను కలుపుతూ వెళ్తున్న కన్యాకుమారి–కొల్కత్తా జాతీయ రహదారి, అద్దంకి పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే అద్దంకి –నార్కెట్‌పల్లి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన రాష్ట్రీయ రహదారులున్నాయి. ప్రస్తుత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో తూర్పు–దక్షిణ భారతదేశం మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడనుంది. బెంగ ళూరు నుంచి సత్యసాయి జిల్లాలోని కొడికొండ వద్ద మొదలై బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద జాతీయ రహదారిలో కలుస్తుంది. బెంగళూరు నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వరకు నిర్మించ నున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు 14 ప్యాకేజీలుగా విభజించారు. అందులో మిగిలిన ప్యాకేజీలు ఇప్పటికే జరుగుతుండగా, ప్రకాశం జిల్లాలోని సోమవరప్పాడు నుంచి, అద్దంకి మండలం కొటికలపూడి, వేలమూరిపాడు, దక్షిణ అద్దంకి, ఉత్తర అద్దంకి, కలవకూరు, ముప్పవరం, జాగర్లమూడివారిపాలెం కొటికలపూడి గ్రామాల్లో 14 నంబరు ప్యాకేజీగా పనులు మొదలై చురుగ్గా సాగు తున్నాయి. దానిలో భాగంగా ఇక్కడ తొలుత కల్వర్టులు, పైప్లైన్లు, యుటిలిటీ పనులు చేస్తున్నారు. గుండ్లకమ్మపై మరో వంతెన.. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఇప్పటికే గుండ్లకమ్మ నదిపై ఒక వంతెన 1981 నుంచి అందుబాటులో ఉండగా, సమీప గ్రామమైన కొటికలపూడి–వేలమూరిపాడు గ్రామాల మధ్య మరో వంతెన అందుబాటులోకి రానుంది. రూ.703 కోట్లతో ఈ వంతెన నిర్మాణానికి డ్రిల్లింగ్ చేసి పనులను ప్రారంభించారు. నిర్మాణంలో వంతెన రహదారి వివరాలు. 2021లో ప్రతిపాదనలు పంపిన నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023 నుంచే భూ సేకరణ పనులకు శ్రీకారం 14 ప్యాకేజీలుగా రహదారి నిర్మాణం అద్దంకి, ముప్పవరం దగ్గర హైవేలోకి వాహన ప్రవేశాలు 2026కి అందుబాటులోకి రానున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఈ రహదారి ఆరు లైన్లతో.. 14వ నంబరు ప్యాకేజీలో 28.64 కిలోమీటర్లు పొడవున నిర్మాణం కానుంది. ఈ రహదారి 70 మీటర్ల వెడల్పుతో నిర్మించనుండగా, రెండు వైపులా ప్లాంటేషన్, కొన్ని ప్రాంతాల్లో మినహా మధ్యలో డివైడర్, అద్దంకి, ముప్పవరం ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మినహా మరెక్కడా వాహనాలకు ప్రవేశ ద్వారాలు ఉండవు. పట్టణంలోని ఒంగోలు రహదారిని క్రాస్ అయ్యే ప్రాంతంలో రెండు ఔటర్ రింగ్‌లు చిన్నచిన్న వాహనాలు పోవడానికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన చోట్ల రహదారి నుంచి క్రాస్ అయ్యే సమయంలో అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. ఈ రహదారిలో 120 నుంచి 150 కిలోమీటర్ల వేగం ఉంటుందని అంచనా. దాంతో అద్దంకి పరిసర ప్రాంతాల్లో వ్యాపార, రవాణా, అత్యధిక దూరంలోని బెంగళూరు, విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణం సమయం12 నుంచి 13 గంటలు తగ్గి 8 గంటల నుంచి 9 గంటల్లోకి రానుంది. -
వేరుశనగ సాగుకు కేరాఫ్ బాపట్ల
బాపట్ల : ఇరవై ఏళ్ల కిందట వరకు బాపట్ల మండలం స్టువార్టుపురం నుంచి కర్లపాలెం వెళ్లేంతవరకు రహదారికి ఇరువైపులా ఖాళీ పొలాలు దర్శనమిచ్చేవి. అక్కడక్కడ ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసే వారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకంతో బీడు భూములు కాస్త సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం పొలాలన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. ఏడాది పొడవునా వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు. ఉచిత పథకంతో మహర్దశ గతంలో నీటి సౌకర్యం లేక బీడు భూములను తలపించేలా ఉండే పంట పొలాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై చేశారు. పథకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. ఈ పధకం కింద చిన్నగంజాం, వేటపాలెం, చీరాల, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో సూదూర ప్రాంతం నుంచి విద్యుత్ లైన్లు సౌకర్యం ఏర్పాటుచేసుకొని పొలాల్లో బోర్లు దింపి వాటి సహాయంతో వేరుశనగ సాగుచేస్తున్నారు. మొదట్లో 2 వేల ఎకరాలలో వేరుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 15వేలకు పైగా ఎకరాలలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ఏ ఒక్క రైతును పలుకరించిన మహానేత అమలుచేసిన ఉచిత విద్యుత్ పథకమే మా బతుకుల్లో వెలుగులు నింపిందంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. వేలాది కుటుంబాలకు నిత్యం ఉపాధి ఒకప్పుడు ఈ ప్రాంతంలోని కూలీలకు ఖరీఫ్ సీజన్లో మాత్రమే వ్యవసాయ పనులుండేవి. సీజన్ ముగిసిన తర్వాత ఏడాది అంతా ఖాళీగా ఉండేవారు. ప్రస్తుతం వేరుశనగ ఏడాది పొడవునా సాగు చేస్తుండడంతో ఆయా గ్రామాల్లోని వేలాది మంది కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి లభించింది. వేరుశెనగ పొలంలో తక్కు రొల్లడం, కలుపు తీయటం, కాయలు కోయటం, కల్లాలను శుభ్రం చేయటం, కాయలు నుంచి పప్పును వేరు చేయటం లాంటి పనులు నిత్యం ఉంటున్నాయి. దీంతో ఉపాధి కోసం వలసలు వెళ్లే అవసరం లేకుండా గ్రామంలోనే ఉపాధి దొరుకుతుందని కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాలకు ఎగుమతి రాష్ట్రంలోనే వేరుశనగ సాగుకు అనంతపురం జిల్లా పేరుగాంచింది. ప్రస్తుతం బాపట్ల జిల్లా కూడా అనంతపురం జిల్లా సరసన చేరింది. వేరుశెనగ ప్రస్తుతం ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుంది. మార్కెట్లో బస్తా రూ.2,500 ఉండగా దళారులు రైతుల వద్ద రూ.2వేలకే కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి రూ.2500కు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారు. వేరుశెనగ కాయలతోపాటు ఉడికించిన కాయలు, వేరుశనగ పచ్చి పప్పు, వేయించిన పప్పు, వాటి నుంచి నూనె, వేరుశెనగతో తయారుచేసి తినుబండరాలను కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏడాదిలో రెండు, మూడుసార్లు సాగు ఇతర జిల్లాలకు ఎగుమతి వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంతో సాగులోకి వచ్చిన బీడు భూములు రాజన్నను మరువలేమంటున్న రైతులు -
పిల్లల సంరక్షణపై సర్టిఫికెట్ కోర్సు
గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల హోంసైన్స్ విభాగంలో నానీ కేర్ అండ్ న్యూట్రీషన్ (పిల్లల సంరక్షణ)పై ఏడాది వ్యవధి గల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను 2025–26 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యూట్రీషన్, చైల్డ్‌కేర్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. చేరేందుకు ఆసక్తి కలిగిన పదో తరగతి, ఆపై విద్యార్హతలు ఉన్న వారు అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు 90592 00037, 95420 32539 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ‘అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేయాలి వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు కె.ఆంజనేయులు నరసరావుపేట: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ‘అక్షర ఆంధ్ర’ను సమర్థంగా నిర్వహించి విజయవంతం చేయాలని వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిరక్షరాస్యులైన మహిళలు, పురుషులకు చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం నేర్పించాలని సూచించారు. డిజిటల్ లిటరసీ, ఫైనాన్సియల్ లిటరసీలను విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. జిల్లాలోని 1,27,565 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారుల సహకారంతో ఆగస్టు ఏడో తేదీన అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి నిరక్షరాస్యులకు విద్య నేర్పించి, ప్రభుత్వ లక్ష్యాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదే మార్చిలో నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహణకు సంపూర్ణ సహాయ, సహకారాలు అందించాలని వివిధ శాఖల అధికారులను కోరారు. వయోజన విద్యాశాఖ తరఫున నిరక్షరాస్యులెన ప్రతి ఒక్కరికీ రెండు వాచకాలు, వర్క్ షీట్స్, దృశ్య శ్రవణ వీడియోలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వలంటీర్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ పది మంది నిరక్షరాస్యులను అప్పగించాలని చెప్పారు. ఈనెల 26వ తేదీలోగా సమగ్రంగా నివేదికలు అందజేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఝాన్సీరాణి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డీపీఎం వీరాస్వామి, ఐసీడీఎస్ పీడీ అరుణ, డీఈవో చంద్రకళ, జీఎస్‌డబ్ల్యూఎస్ వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి పాల్గొన్నారు. -
మైక్రో ఆర్టిస్ట్ మహితకు కలెక్టర్ మురళి ఆర్థిక ప్రోత్సాహం
బాపట్ల : చీరాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అన్నం మహిత జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తన అద్భుతమైన కళా ప్రతిభతో మహిత 93 ఫెన్సిల్స్పై నెల్సన్ మండేలా జీవిత చరిత్రను, మరో 810 ఫెన్సిల్స్పై మహాభారతంలోని 700 శ్లోకాలను అత్యంత సూక్ష్మంగా చెక్కి అందరి ప్రశంసలు అందుకున్నారు. మహిత అసాధారణ ప్రతిభను కలెక్టర్ మురళి అభినందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, తన వంతు సహాయంగా రూ.15వేలు చెక్కు రూపంలో మహితకు అందజేశారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా కలెక్టర్ తీసుకున్న ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు. దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి రేపల్లె: చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్‌ను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో దూర విద్య ద్వారా పదో తరగతి చదువు మానేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా స్టడీ సెంటర్ల నిర్వాహకులు పనిచేయాలని కోరుతూ పట్టణంలోని ఓ స్టడీ సెంటరులో శుక్రవారం వాల్‌పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ ఓపెన్ పదో తరగతి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్, ఎంఈవో రత్నశ్రీధర్, వివిధ స్టడీ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. కాలువలో గుర్తు తెలియని మృతదేహం అమర్తలూరు(వేమూరు): అమర్తలూరు మండలం తురిమెళ్ల తూర్పు కాలువలో శవం కనిపించడంతో గ్రామస్తులు శుక్రవారం గ్రామ వీఆర్వోకు దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్వో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవితేజ తెలిపారు. -
అందుబాటులోకి పురమిత్ర యాప్
కమిషనర్ జి.రఘునాథరెడ్డి బాపట్ల అర్బన్: బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురమిత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి తెలిపారు. ఈమేరకు పురమిత్ర యాప్‌ను మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. కమిషనర్ జి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఉండే అన్ని సేవలను పొందే విధంగా రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చిందని, ‘పుర మిత్ర‘ యాప్ ఇక నుంచి ప్రజలకు పౌర సేవలను అందించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ (ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన ఈ యాప్‌లో పలు సేవలు పొందే వీలు ఉంటుందని తెలిపారు. అద్దంకిలో 62.6 మి.మీ వర్షపాతం అద్దంకి రూరల్: అద్దంకి శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 62.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరింది. ముగిసిన పవిత్రోత్సవాలు పెదకాకాని: శివాలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకల చివరిరోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, 20వ తేదీన శ్రీ భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి విశేష పూజలు చేయనున్నారు. స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, దాతలు నేలవెల్లి కోటేశ్వరి, కర్నే శివ సందీప్ నాగశిరీష, రెడ్డి నవీన్ కుమార్ విజయలక్ష్మి, నేలివెల్లి నాగప్రత్యూష, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. వాటర్ గ్రిడ్ స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్ విజయపురి సౌత్: మేకల గొంది నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రూ.1200 కోట్లతో మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత స్థలాన్ని అధికారులు పరిశీలించారు. మేకల గొందిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే స్థలంలో సర్వే మ్యాపులను పరిశీలించారు.అన్ని అనుమతులు మంజూరయితే నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, డీఎఫ్ఓ సందీప్ కుమార్, మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ రమేష్ పాల్గొన్నారు. -
జీవన ఎరువులతో ఆరోగ్యకర దిగుబడులు
సత్తెనపల్లి: సాగులో ఫాస్ఫరస్ సాలుబు లైజింగ్ బాక్టీరియా, అజోల్లా, వామ్ తదితర జీవన ఎరువులు వాడుకుని ఆరోగ్యవంతమైన దిగుబడులు సాధించాలని పల్నాడు జిల్లా రైతు శిక్షణ కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(డీడీఏ) ఎం.శివకుమారి సూచించారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవాలని ఆమె చెప్పారు. మండలంలోని గుడిపూడిలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీడీఏ శివకుమారి మాట్లాడుతూ ఆఖరి దుక్కిలో ఫాస్ఫరస్ వేసుకోవాలని, దీనివల్ల వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. నారు మడిలో చల్లుకునే ముందు శిలీంధ్ర నాశిని అయిన కార్బెండిజం మూడు గ్రాములను కేజీ వరి విత్తనాలకు కలిపి, విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా విత్తన దశ నుంచే తెగుళ్లను నివారించవచ్చని తెలిపారు. జిల్లా రైతు శిక్షణ కేంద్రం అధికారిణి ఎం.అరుణ మాట్లాడుతూ తొలకరి వర్షాలకు నవ ధాన్యాలను సాగు చేసుకొని పూత దశలో భూమిలో కలియ దున్నుకోవాలని చెప్పారు. దీని వల్ల సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది, భూమి సారవంతం అవుతుందని వివరించారు. సత్తెనపల్లి మండల వ్యవసాయధికారి బి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పత్తి, మిరప, వరి సాగు చేసే రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువులను వేసి, పూత దశలో భూమిలో కలియ దున్నుకోవాలని సూచించారు. మిరప రైతులు షేడ్ నెట్ లలో నారు పెంచుకోవాలని ఆమె చెప్పారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం కింద 100 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందజేసిన మినుములు, కంది విత్తనాల చిరు సంచులను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శివకుమారి -
22 ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి
బాపట్ల అర్బన్: దశాబ్దాలుగా 22–ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. నిజాంపట్నం మండలం ముత్తుపల్లి గ్రామంలోని రైతులతో శుక్రవారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని పోరంబోకు భూమిగా దస్త్రాలలో నమోదు చేశారన్నారు. తప్పుగా నమోదు చేయ డం ద్వారా ఆరు దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నామని 20 రోజుల కిందట కలెక్టర్‌కు విన్నవించారు. మా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. తదుపరి రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెవెన్యూ దస్త్రాలలో తప్పుగా నమోదు చేయడం ద్వారానే ఆ గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. అప్పట్లో ఉన్న రెవె న్యూ అధికారులు వాటిని సరిచేయక పోవడంతోనే 1987 లో పోరంబో కు భూములుగా దస్త్రాలలో నమోదయ్యిందన్నారు. తదుపరి 22 ఏ నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లిపోయిందని తెలిపారు. దశాబ్దాల కిందట దస్త్రాలన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విచారించిన తదుపరి ఆ భూములు 87 మంది రైతులవేనని తేలిందన్నారు. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఆ భూమికి సాగు పట్టా భూమిగా గుర్తించామన్నారు. సాగులో ఉన్న ఆ భూమి యజమానులకు పూర్తిస్థాయిలో యాజ మాన్య హక్కులు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. పాస్ పుస్తకాలు ఇస్తామన్నా రు. సమావేశంలో రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, నిజాంపట్నం తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, ముత్తుపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు... పనితీరు వేగవంతం చేయాలి బాపట్ల: రెవెన్యూ శాఖ నిర్వహించే వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పనితీరును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ–4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను, మార్గదర్శలను నిర్ధారించడంలో వారి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బంగారు కుటుంబా లు, మార్గదర్శకులకు సంబంధించి గ్రామసభ లు ఏర్పాటుచేసి చేర్పులు, తొలగింపులకు చర్య లు తీసుకోవాలన్నారు. ఈనెల 21వ తేదీ లోపు మార్పులు, చేర్పులు పూర్తిచేయాలన్నా రు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్ గౌడ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కనకరాజు, సీపీఓ షాలేమ్ రాజు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎల్డీవోలు పాల్గొన్నారు. పొగాకు నిల్వ చేసేందుకు గోడౌన్ల అన్వేషణ కొనుగోలు చేసిన పొగాకును నిలువ చేసేందుకు కొత్త గోడౌన్లను అన్వేషించే బాధ్యతను జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారులకు, జిల్లా మేనేజర్‌కు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన 2529.650 మెట్రిక్ టన్నులను బ్లాక్ బర్లీ పొగాకును జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశం ఆమోదించింది. కొనుగోలు చేసిన పొగాకును గోడౌన్లలో కొంతవరకు పెట్టడం జరిగిందన్నారు. మిగిలిన పొగాకును వేరొక పెద్ద గోడౌన్లకు తరలించి ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేయాలని తీర్మానించినట్లు కలెక్టర్ తెలిపారు. బ్లాక్ బర్లీ పొగాకును తరలించడానికి టెండర్ల ఆహ్వానం బాధ్యతను జిల్లా మేనేజర్‌కు అప్పగించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
కార్తికేయుని సన్నిధిలో పండుగ వాతావరణం
మోపిదేవి: పండుగ వాతావరణంలో సుబ్బారాయుడి పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో రెండో రోజు శుక్రవారం ఆషాఢ కృత్తిక పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్ శర్మ, వేదపండితులు, రుత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, నిత్యార్చన, నవకుంభారోపణం, ఏకాదశ ద్రవ్యాభిషేకం, అన్నాభిషేకం, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్టానాలు, హవనం, మూల మూర్తులకు ఉత్సవ మూర్తులకు పట్టు పవిత్రాలు సమర్పణ, మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రదోష కాలార్చన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగం భక్తిశ్రద్ధలతో జరిపించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. -
పాత పింఛను విధానం అమలుకు డిమాండ్
గుంటూరు వెస్ట్: పాత పెన్షన్ విధానాన్ని 2003 డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని అమలు చేయాలని డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మోపిదేవి శివశంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తమకు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఓపీఎస్ విధానం అమలు కాలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టెక్నికల్ తప్పుల వలన తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 57 ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సకాలంలో స్పందించకపోతే తమ న్యాయ పోరాటం ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సలగల ప్రసన్న కుమార్, ఘంటసాల శ్రీనివాసరావు, నరసింహారావు, శ్రీలం యలమంద, మారెళ్ళ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కార్మికుల వినూత్న నిరసన
రేపల్లె: సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మణిలాల్ అన్నారు. ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరం శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం పొర్లు దండాలు పెట్టారు. కూటమి ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వంగా, ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వంగా అభివర్ణించారు. మణిలాల్ మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ వ్యతిరేకతను మూటకట్టుకుంటోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత కార్మికులుగా చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. చట్టపరమైన సెలవులను అమలు చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్.రవిబాబు, కె.రాఘవేంద్రరావు, రవి, శ్రీను, సుబ్బారావు, సుధాకర్, వాసు తదితరులు పాల్గొన్నారు. -
బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886
కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886 వచ్చినట్లు ఆలయ ఈవో జి.నరసింహమూర్తి తెలిపారు. గురువారం బాపట్ల డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం.గోపి, చందోలు ఎస్ఐ ఎంవి శివకుమార్‌యాదవ్ పర్యవేక్షణలో పొన్నూరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ నాగరాజు ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బందితోపాటు అమ్మవారి భక్తులు హుండీ నగదు లెక్కించారు. ప్రతి మూడు నెలలకు అమ్మవారి హుండీ నగదు లెక్కిస్తున్నామని గతంకంటే అమ్మవారి హుండీ ఆదాయం ఎక్కువగా ఉందని ఈవో తెలిపారు. వైభవంగా పవిత్రోత్సవాలు పెదకాకాని: శివాలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానములో మూడు రోజుల పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం అర్చకులు, వేదపండితులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు పర్యవేక్షణలో ఇవి జరిగాయి. ఈ పవిత్రోత్సవాల్లో చివరిరోజు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఉదయం అన్నదానం, సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, అర్చకులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు. గిరిజా కల్యాణం పోస్టర్ ఆవిష్కరణ నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం గిరిజా కళ్యాణ పోస్టర్‌ను వైశ్యకుల గురువు వామనాశ్రమ మహా స్వామీజీ ఆవిష్కరించారు. ఈ నెల పది నుంచి సెప్టెంబర్ ఏడో తేదీ వరకు చాతుర్మాస దీక్షలో భాగంగా 27న గిరిజా కల్యాణం నిర్వహిస్తున్నట్లు చాతుర్మాస సేవా సమితి కన్వీనర్ తటవర్తి రాంబాబు తెలిపారు. కల్యాణంలో పాల్గొనేందుకు 94406 05773 నంబర్లో సంప్రదించాలని అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో గుడివాడ రవి, జుజ్జూరు శ్రీనివాసరావు, బాపారావు, కోటా శేషగిరి, మహంకాళి శ్రీనివాసరావు, సునీత, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు నిలుపుదల రూ.85.52 విలువైన ఉత్పత్తులపై అధికారుల చర్యలు కొరిటెపాడు: జిల్లాలోని గుంటూరు నగరం, తెనాలి, ప్రత్తిపాడులో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైల్ దుకాణాల్లో రెండు బృందాలుగా సోదాలు చేశారు. ఎనిమిది దుకాణాల్లో రూ.57.11 లక్షల విలువైన 318.67 టన్నుల ఎరువులు, 11 దుకాణాల్లో రూ.19.83 లక్షల ఖరీదు చేసే 6,630 లీటర్ల పురుగు మందులు, ఐదు దుకాణాల్లో రూ.8.58 లక్షల విలువైన 1,278 మెట్రిక్ టన్నుల విత్తనాల విక్రయాలను నిలుపుదల చేశారు. తనిఖీల్లో గుంటూరు వ్యవసాయాధికారి ఎ.నాగేశ్వరరావు, ఏడీఏలు పి.మురళీకృష్ణ (పశ్చిమ గోదావరి), ఎం.సునీల్ (గన్నవరం), విజిలెన్స్ సీఐలు కె.వెంకటేశ్వర్లు, సీహెచ్ రవిబాబు, వ్యవసాయ అధికారులు సునీల్‌కుమార్ (ఒంగోలు), బి.కిషోర్‌కుమార్ (గుంటూరు రూరల్) పాల్గొన్నారు. -
చదువు మధ్యలో ఆపేసిన వారికి దూర విద్య వరం
క్రోసూరు: వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దూర విద్య వరం అని జిల్లా కో–ఆర్డినేటర్ ఎంఏ.హుస్సేన్ తెలిపారు. క్రోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం దూరవిద్య అడ్మిషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కో–ఆర్డినేటర్ చిల్కా సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యార్థులు పొందే సర్టిఫికెట్లకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెగ్యులర్ విద్యార్థులతో పాటు సమానమైన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతిలో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 24 సంవత్సరాలు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. చదవడం, రాయడంతో పాటు ఏదొక తరగతి టీసీ, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. ఇంటర్‌కు 10వ తరగతి మార్క్స్ సర్టిఫికెట్, టీసీ, బ్యాంకు అకౌంట్ కాపీ అందజేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులు అయితే వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం లేకుండా ఈనెల 30 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని తెలియజేశారు. వివరాలకు పని వేళల్లో మండల రిసోర్సు కేంద్రంలో, సచివాలయాల్లో , మండల కో–ఆర్డినేటర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. మీసేవ, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం రామాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముక్తేశ్వరుని సాక్షిగా ఇసుక అక్రమ తవ్వకాలు
రేపల్లె: సాక్షాత్తూ ముక్కంటి కనులు కప్పి కూటమి నేతలు అక్రమ ఇసుక తవ్వకాలకు బరితెగించారు. దక్షిణకాశీగా పేర్గాంచిన రేపల్లె మండలం మోర్తోట గ్రామంలో పార్వతీ సమేత ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో కూటమి నేతల కనుసన్నలలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి కేవలం 300 మీటర్ల దూరంలో కృష్ణమ్మ ఒడ్డున జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రసిద్ధిగాంచిన ముక్తేశ్వరస్వామి ఆలయానికి సాధారణ రోజులతో పాటు కార్తికమాసంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుని కృష్ణానదిలో పుణ్యస్నానమాచరిస్తుంటారు. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో ఇదే అదునుగా భావించిన కూటమినేత కన్నుసన్నలలో ఇసుకాసురులు జేసీబీల ద్వారా గుంతలు తవ్వి ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రకృతి సంపద తరలిపోవటంతోపాటు భవిష్యత్‌లో తవ్విన ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం
బాపట్ల టౌన్: వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున, నియోజకవర్గాల సమన్వయకర్తలు కోన రఘుపతి, వరికూటి అశోక్‌బాబు, ఈవూరి గణేష్‌తోపాటు పలువురు నాయకులతో కలిసి ఎస్పీ తుషార్ డూడీకి గురువారం వినతి పత్రం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ లా అండ్ ఆర్డర్‌కు పూర్తిగా సహకరిస్తుందని, అయితే కొంతమంది అధికారులు నాయకుల మెప్పు పొందేందుకు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అధికారం ఎప్పుడు ఒకరి వద్దనే ఉంటుందని భావించవద్దని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీలో పని చేస్తున్న బలమైన నాయకులు, కార్యకర్తలపై సంబంధంలేని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. కరోనా సమయంలో 68 మంది రేపల్లె ప్రాంతంలో చనిపోతే మృతదేహాలను ఖననం చేసిన ఒక నాయకుడిపై అక్రమ కేసులు బనాయించటం ఎంత వరకు న్యాయమో వారే ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండతో పేట్రేగిపోతున్న కొంతమంది ఆగడాలు తగ్గించుకోవాలని సూచించారు. అత్యుత్సాహం మానుకోవాలి: కోన నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది కిందిస్థాయి పోలీసు అధికారులు మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ పలు కేసులకు సంబంధించి ఏవిధంగా అక్రమ కేసులు బనాయించారనేది స్పష్టంగా వివరించామని తెలిపారు. ఈ విషయాలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జోగి రాజా, కోకి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అక్రమ కేసులపై పునఃపరిశీలన చేయాలి అధికారం శాశ్వతం కాదు వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున -
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం
దాచేపల్లి : వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు గురువారం కిసాన్ మేళా నిర్వహించారు. ఇందులో రైతుల ప్రదర్శనలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పరిశీలించారు. ఆధునిక పద్ధతులను అవలంబించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులు వ్యవసాయం చేయాలని మంత్రి రవికుమార్ చెప్పారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సహకారం అందించి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎక్స్న్వెషన్ ఏఎన్జీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జి.శివన్నారాయణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఏఎన్జీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పి.వి సత్యనారాయణ, పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, డీఆర్ఓ మురళి, ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. రైతుల్లో తీవ్ర అసంతృప్తి పంటలకు కనీసం గిట్టుబాటు ధరతో పాటు పొగాకు కొనుగోలుపై కిసాన్ మేళాలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు నుంచి హామీ వస్తుందని రైతులంతా ఎదురు చూశారు. వీటిపై సరైన స్పష్టత ఇవ్వకుండానే మేళాను ముగించడంపై రైతులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో మాచవరం పీహెచ్‌సీకి మొదటి స్థానం రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం మాచవరం: గ్రామీణ ప్రాంత ప్రజలకు జూన్‌లో మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించినందుకు గానూ మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లాలో మొదటి స్థానం దక్కిందని పీహెచ్సీ వైద్యాధికారి ఎస్. ప్రసాదరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల్లోనూ రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచిందని ఆయన తెలియజేశారు. ఇటీవల పీహెచ్‌సీల పనితీరుపై వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన నివేదికలో అధికారులు గ్రేడ్లను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. మెరుగైన వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ -
దళిత ఉద్యమాలకు స్ఫూర్తి కారంచేడు
చీరాలరూరల్: దేశవ్యాప్త దళిత ఉద్యమాలకు కారంచేడు ఉద్యమం స్ఫూర్తి నింపడమే కాక దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని పలువురు దళిత, బహుజన నేతలు, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. కారంచేడు గ్రామంలో మారణకాండకు నేటితో 40 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం మండల పరిధిలోని విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతవీరుల రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభ నిర్వహించి మృతవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పలువురు వక్తలు మాట్లాడా రు. దేశానికి స్వాతంత్య్ర పోరాటం ఎలాంటిదో.. కారంచేడు ఉద్యమ పోరాటం కూడా అటువంటిదన్నారు. ఈ ఉద్యమం ఎంతోమంది దళితులు నా యకులుగా ఎదగటానికి దోహదపడిందని అ న్నారు. వారి ప్రాణ త్యాగాలు మరువలేనివన్నారు. పెత్తందారుల అక్రమాలు, ఆగడాలు, దౌర్జన్యాలను అరికట్టడానికి ఆయుధంగా కారంచేడు ఉద్యమం ఉపయోగపడిందని వక్తలు పేర్కొన్నారు. అంతేకాక మృతవీరుల మరణం ఎంతోమంది సామాజిక ఉద్యమకారులలో స్ఫూర్తిని నింపి ఆత్మగౌరవ ఉద్యమాలు కొనసాగించటానికి కారణభూతమైందన్నారు. కారంచేడు మృతవీరుల రుధిర క్షేత్రాన్ని సందర్మించి వారికి నివాళులర్పించడం పౌరులుగా సామాజిక బాధ్యత అని వారు పేర్కొన్నారు. కారంచేడు ఉద్యమ సీనియర్ నాయకుడు దుడ్డు భాస్కరరావు అధ్యక్షత వహించిన సభలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి, వీకేసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ఎల్కే రాజారావు, ఏపీ లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, బైరి నరేష్, తేళ్ల సుబ్బారావు, తేళ్ల లక్ష్మీప్రసాద్, దుడ్డు ఏసు, మున్నంగి లక్ష్మయ్య, గోసాల ఆశీర్వాదం, నీలం నాగేంద్రరావు పాల్గొన్నారు.కారంచేడు మృతవీరుల సంస్మరణ సభలో నేతలు -
టౌన్‌హాలుకు ఘన చరిత్ర ఉంది
బాపట్ల అర్బన్: అనాదిగా ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు బాపట్ల టౌన్ హాల్ పట్టుగొమ్మగా నిలిచిందని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. టౌన్ హాలు 120వ వార్షికోత్సవ కార్యక్రమంలో గురువారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ టౌన్ హాల్‌ను 1905 జూలై 17న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రూడీ ప్రారంభోత్సవం చేశారన్నారు. టౌన్ హాల్‌కు 12 దశాబ్దాల చరిత్ర ఉందని తెలిపారు. ఎందరో జాతీయ నాయకుల ప్రసంగాలకు వేదికగా టౌన్ హాలు నిలిచిందని పేర్కొన్నారు. 1913లో ప్రథమాంధ్ర మహాసభ ఇక్కడే జరిగిందని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు ఇక్కడే బీజం పడిందని తెలిపారు. ఇది ఎందరో కవులు, కళాకారులకు ఆలంబనగా నిలిచిందని అన్నారు. చారిత్రక టౌన్ హాల్ 120వ వార్షికోత్సవ సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, నాటి టౌన్‌హాల్ వ్యవస్థాపకులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఏవీ రమణారావు, రచయిత మల్లికార్జున, ఖాజీపాలెం డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కృష్ణంరాజు, అధ్యాపకులు డాక్టర్ అబ్దుల్ కలాం, రత్నేశ్వరరావు, మల్లేశ్వరి, సుశీలావతి, వెంకటలక్ష్మమ్మ, పద్మజ, విద్యార్థులు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా -
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఆగదు
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె డివిజన్ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజినీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె గురువారంతో నాల్గవ రోజుకు చేరింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేసిన సందర్భంగా 17 రోజులకు జీతాలు ఇతర బెనిఫిట్స్ అందిస్తామని చేసిన ఒప్పందాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులందరికి వర్తింపజేసి కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి రవిబాబు, కోశాధికారి రాఘవేంద్రరావు, నాయకులు శివ, రవి, శ్రీను, సుబ్బారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రభాకరరావు -
వైఎస్సార్ సీపీ నిరసన
‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై తెనాలి: సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాలతో ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక కేబుల్ చానళ్లలో సాక్షి చానల్‌తోపాటు టీవీ9, ఎన్టీవీ తదితర చానళ్ల ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికం అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించటమే కాకుండా, ప్రజలకు వాస్తవాలను తెలియకుండా అడ్డుకోవాలని చూడటమేనని పార్టీ నాయకులు ఆరోపించారు. సూపర్‌సిక్స్ హామీలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన వందల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగించటం, పాలనలో వైఫల్యాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించటం వంటి వాస్తవాలను ప్రజాపక్షం వహించి ప్రసారం చేస్తున్న సాక్షి గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఒత్తిడి తెచ్చి మరీ... పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాయ్‌తో సంబంధం లేకుండా బ్రాడ్కాస్టర్లు, ఎంఎస్ఓలపై ఒత్తిడి తీసుకొచ్చి సాక్షి ప్రసారాలను నిలిపివేయటం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ అనుకూల చానళ్లపైనా ఇదే చర్య తీసుకోవాలని సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ లీగల్ సెల్ న్యాయవాది చింకా సురేష్‌చంద్రయాదవ్ మాట్లాడుతూ కేబుల్ టీవీ ఖాతాదారులకు సాక్షి, మరికొన్ని చానళ్ల ప్రసారాలను అందించకపోవడంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. అంతవరకు వెళ్లాలని తాము అనుకోవటం లేదని, ఎంఎస్ఓలు, బ్రాడ్కాస్టర్లను సంప్రదించి అన్ని చానళ్లను ప్రసారం చేయాలని చెప్పారు. అప్రజాస్వామిక వైఖరి పార్టీ మహిళా నేత, మున్సిపల్ కౌన్సిలరు కొర్రపాటి యశోద మాట్లాడుతూ భజన చేసే చానళ్లను మాత్రమే ప్రసారం చేస్తూ, విమర్శించే వాటి ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికం అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని విమర్శించారు. సూపర్‌సిక్స్ హామీల మోసం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, న్యాయవాది మైలా విజయ్‌నాయుడు కూడా మాట్లాడారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, గోల్డ్ రహిమా, తాడిబోయిన రమేష్, బొంతు నరేంద్రరెడ్డి, మన్నవ ప్రభాకర్, కాకి దేవసహాయం, కొడాలి క్రాంతి, ఆవుల కోటయ్య, పెదలంక వెంకటేశ్వరరావు, కటెవరపు దేవానంద్, బండ్లమూడి నాగేశ్వరరావు, అక్కిదాసు కిరణ్, మల్లెబోయిన రాము, అమర్తలూరి సీమోను, పినపాటి రవికిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, న్యాయవాదులు గుమ్మడి రవిరాజ్, దాట్ల మోహన్‌రెడ్డి, డి.మల్లికార్జునరెడ్డి, గుంటూరు కృష్ణ, మహిళా నేతలు తమ్మా సుజాతరెడ్డి, షేక్ జకిరా, షేక్ ఇస్రత్, ఇందిర, రెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
భట్టిప్రోలు: పిడుగుపాటుకు గురై బాపట్ల జిల్లాలో గురువారం ఇద్దరు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం ఓలేరు శివారు వెంకటరాజు నగర్‌కు చెందిన గుంటూరు లూదు మరియన్న (70) పొలంలో పనిచేస్తుండగా గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం ఆరంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో సమీపంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నాడు. అదే సమయంలో అతడికి అత్యంత సమీపంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి గురై మృతి చెందాడు. గమనించిన స్థానికులు వృద్ధుడు మృతిచెందిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. మహిళ మృతి సంతమాగులూరు(అద్దంకి): పిడుగు పాటుకు మహిళ మృతిచెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండలంలోని ఏల్చూరు గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన వారు పొలాల్లో గేదెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు ధాటికి పద్మ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. గాయడిన వ్యక్తిని వైద్యశాలకు తరలించారు. -
బాపట్ల జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
బాపట్ల: బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో శనివారం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. శనివారం బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో భారీ అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థులు, మరో వెయ్యి మంది అధికారులు, ప్రజలు పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు, స్ట్రాలు వంటి వాటిపై పూర్తి నిషేధం విధించినట్లు తెలిపారు. వ్యాపారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఆయన ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్మినా, కొన్నా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిషేధం జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 25 మండలాల్లో పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు దీర్ఘకాలంగా ఉపయోగపడే వస్తువులను వాడాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పాడైన ప్లాస్టిక్‌ను సేకరించి రీసైకిల్ చేయాలని, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించడాన్ని ప్రోత్సహించాలని, ప్రత్యామ్నాయంగా అరటి నారు, జనపనార, బాదం ఆకులు, వస్త్రపు సంచుల ను వాడాలని సూచించారు. డ్వాక్రా మహిళలు, ఎస్.ఎస్.జి. సభ్యుల నుంచి ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీకి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సా హం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమగ్ర నిషేధం ద్వారా బాపట్ల జిల్లాలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి అమలు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి -
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరణ
నెహ్రూనగర్: సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 2024–25 పోటీల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఆనందంగా ఉందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరాం, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రలు అవార్డును స్వీకరించారు. భవిష్యత్తులో గుంటూరు నగరాన్ని దేశంలోనే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. -
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
తాడికొండ: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. నలుగురు మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి అమరావతికి మ్యారేజ్ బ్యూరోకు సంబంధించిన నలుగురు మహిళలతో కారు వెళుతోంది. అమరావతి నుంచి గుంటూరు మరో కారు వస్తోంది. కళాజ్యోతి కార్యాలయం వద్దకు రాగానే ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొదటి కారు డ్రైవర్ విజయవాడ యనమలకుదురుకు చెందిన పి.నాగేశ్వరరావు (38) మృతి చెందాడు. నలుగురు మహిళలు తీవ్రగాయాలపాలై స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. సీఐ వాసు, సిబ్బంది సహకారంతో నాగేశ్వరరావును మృతదేహాన్ని బయటకు తీశారు. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారంతా పెదకూరపాడు ఎమ్మెల్యేకు చెందిన బంధువులుగా సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.ఒకరు మృతి, నలుగురు మహిళలకు గాయాలు -
19 నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20వ తేదీల్లో 52వ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అండర్–11 నుంచి అన్ని విభాగాలతోపాటు మాస్టర్స్ విభాగంలో 35 + నుంచి 70 + వరకు పోటీలు ఉంటాయన్నారు. విజయాలు సాధించిన వారిని విభాగాలుగా రాష్ట్ర పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శ్రీనివాసరావుతోపాటు రమేష్, వెంకటేశ్వరరావు, సతీష్ చంద్ర, రాము, రమేష్. కోచ్ బాషా ఆవిష్కరించారు. -
మహిళలపై మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులు అరికట్టాలి
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి రేపల్లె: మహిళలపై వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, డ్వాక్రా మహిళల వద్ద అక్రమ వసూళ్లూ, అవినీతిని అరికట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. పట్టణంలోని జగనన్న కాలనీలో అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లు అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల చదువులు, ఆరోగ్యాల కోసం తప్పని పరిస్థితుల్లో అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారన్నారు. ప్రభుత్వ బ్యాంకులు, డ్వాక్రాలో ఉన్న మహిళలకు కూడా సక్రమంగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవటంతో ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారన్నారు. ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి మహిళలను మానసికంగా, ఆర్థికంగా హింసిస్తున్నారని అన్నారు. డ్వాక్రాలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు పలుచోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ డ్వాక్రా గ్రూపు సభ్యులను లంచాల కోసం వేధిస్తున్నారన్నారు. ప్రతిచోట డ్వాక్రాలో అవినీతి రాజ్యమేలుతున్నా ఉన్నతాధికారులు పట్టీపట్లనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని అర్హతలు ఉన్న గ్రూపులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించకుండా ఆర్పీలు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. రుణాల కోసం ఆర్పీలకు లంచాలు చెల్లించి నెలవారి కిస్తీలు కట్టలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించామని అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మహిళలను చైతన్యపరుస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. మైక్రోఫైనాన్స్ సంస్థల ఆగడాలు అరికట్టటంతో పాటు డ్వాక్రాలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలు అంశాలపై మాట్లాడారు. సదస్సులో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్.మణిలాల్, ఐద్వా పట్టణ కార్యదర్శి నాంచారమ్మ, నాయకులు వి.ధనమ్మ, సభ్యులు ఎస్కే.ఫర్జానా, స్వావమ్మ, వనజాక్షి, లక్ష్మణరావు, డి.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యవర్తిత్వం–దేశం కోసం’ ప్రదర్శన
బాపట్ల: మధ్యవర్తిత్వం–దేశం కోసం అనేది ప్రతి ఒక్కరూ గమనించాలని అడిషనల్ డిస్టిక్ జడ్జి ఓ.శ్యామ్‌బాబు అన్నారు. మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం బాపట్ల పట్టణంలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి బయలుదేరి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు. అడిషనల్ డిస్టిక్ జడ్జి ఓ.శ్యామ్‌బాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా తగాదాలు, వివాదాలు పరిష్కరించే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల సమయం వృథా కాకుండా చేసుకోవచ్చని ఇది కోర్టు తీర్పు కంటే బలమైనదిగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని కోరారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ.అవినాష్ మాట్లాడుతూ ఈ మధ్యవర్తిత్వం పూర్వకాలం నుంచి ఉందని కృష్ణుడు కూడా పాండవులు, కౌరవుల మధ్య సంధి కుదర్చటానికి ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎ.వాణి, సీనియర్ సివిల్ జడ్జి పవన్‌కుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.రేణుక తదితరులు పాల్గొన్నారు. -
నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు
సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నల్ల బర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి రైతూ పండించిన నల్లబర్లీ ఆకు మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకే కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తేలప్రోలు రమేశ్, మరికొంతమంది సభ్యులుగా ప్రమాణీ స్వీకారం చేశారు. కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, ఎరిక్షన్‌బాబు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
వ్యవసాయ, విజిలెన్స్ అధికారుల తనిఖీలు
రేపల్లె: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైలవరం వ్యవసాయ సహాయ సంచాలకులు టి.శ్రీనివాసరావు హెచ్చరించారు. పట్టణంలోని ఫెర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల ఎదుట తప్పనిసరిగా స్టాక్ బోర్డును, ధరల పట్టిక వినియోగదారులకు కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. విత్తనాల నాణ్యతలో రాజీపడరాదని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించరాదన్నారు. దుకాణాలలో స్టాక్‌కు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ సమాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మహేష్‌బాబు, విస్తరణ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐకార్ విశ్రాంత శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి అధ్యక్షతన ఐకార్ (ఐసీఏఆర్) విశ్రాంత శాస్త్రవేత్తలతో విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు, శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాంనందున్న విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐకార్ విశ్రాంత శాస్త్రవేత్తలైన ప్రధాన శాస్త్రవేత్త (ఇక్రిశాట్) డాక్టర్ ఎస్ఎన్ నిగం, డైరెక్టర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్) డాక్టర్ డీఎం హెగ్డే, ఐకార్ ఏడీజీ డాక్టర్ బీబీ సింగ్‌లు పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా వ్యవసాయంలో నేల ఆరోగ్య పరిరక్షణ అనే వ్యవసాయ బులెటిన్‌ను రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది వినియోగించుకునేందుకు వీలుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎన్ నిగం మాట్లాడుతూ వివిధ పంటల రకాల రూపకల్పనలో ఆధునిక పద్ధతులతోపాటు సంప్రదాయ విధానాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. పరిశోధనలలో సరైన ప్రణాళికలు ముందుగానే రూపొందించుకుని చేయటం వల్ల ఆశించిన ఫలితాలను సులువుగా సాధించవచ్చన్నారు. వివిధ పంటల్లో బ్రీడింగ్ విధానాలు, విత్తన ఉత్పత్తి తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, కమ్యూనిటీ సైన్స్, ఏపీజీసీ శాస్త్రవేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయులకు వేతనాలివ్వాలి
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు ముగిసిన 45 రోజుల తరువాత సైతం కొంత మంది ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని, వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల్లోని అసంబద్ధ అంశాలు తొలగించి, సవరణ ఉత్తర్వులు కోరుతూ అనేక మంది ఉపాధ్యాయులు పెట్టుకున్న గ్రీవెన్స్‌ను త్వరగా పరిష్కరించాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ మెగా పీటీఎం విట్నెస్‌పై ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి మరీ విద్యాశాఖాధికారులు సమాచారాన్ని సేకరించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎండీ షకీలా బేగం, టి.ఆంజనేయులు, కె.కేదార్నాథ్, కె.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంట భూములే ప్లాట్లు
చీరాల టౌన్: భూముల విలువకు రెక్కలు రావడంతో పంట పొలాలు కాస్తా ప్లాట్లుగా మారిపోయాయి. అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసి జనం మోసపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. చీరాల ప్రాంతంలో జనాభా సంఖ్య పెరుగుతుండడంతో పంట పొలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అసైన్డ్ భూములను సైతం అమ్మకాలు చేస్తున్నారు. మండలంలోని ఈపూరుపాలెం, తోటవారిపాలెం 216 బైపాస్ రోడ్డు, పాత ఎస్సీ కాలనీ రోడ్డు, కుందేరు ఒడ్డు తదితర ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ ఇప్పుడు ఇళ్ల ప్లాట్లుగా మారాయి. వాడరేవు తీరానికి వెళ్లే రోడ్డులో, జాండ్రపేట కుందేరు సమీపంలో, అలానే చీరాల పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీల్లో సైతం ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఎన్వోసీలు లేకపోయినా అధికార పార్టీ ఆమోదం ఉంటే చాలట కనీసం పంచాయతీ అనుమతి కూడా లేకుండా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. చీరాల ప్రాంతంలో వేస్తున్న మూడొంతుల లే అవుట్లకు కనీస అనుమతులు ఉండడం లేదు. అయినా ప్లాట్లు విక్రయిస్తున్నారు. కన్వర్షన్ ఫీజూ లేదు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును కూడా రియల్టర్లు ఎగవేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలను ప్లాట్లుగా మార్చి లే అవుట్ వేయాలంటే ఆ పొలం మార్కెట్ విలువలో పదో వంతు కన్వర్షన్ ఫీజు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత విస్తీర్ణంలో పదో వంతు స్థలం పార్కులకు, రోడ్లు, ఇతర అవసరాలకు వదలాల్సి ఉంటుంది. లే అవుట్‌కు కూడా ప్రభుత్వం తప్పని సరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు కొందరు భూముల యజమానులతో ములాఖత్ అయి అనుమతులు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది. పొలాన్ని ప్లాట్లుగా మార్చుకొనేందుకు ప్రభుత్వానికి ఎటువంటి ఫీజులు చెల్లించడం లేదు. నేరుగా ప్లాట్లు వేసి ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఈ అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రామాల్లో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి చర్యలు తీసుకుంటాంమండలంలో వేసిన లే అవుట్లకు అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలన చేస్తా. గ్రామాల్లో అనుమతులు లేకుండా వేసిన వెంచర్లు, వాటి వివరాలను సేకరించడంతోపాటు అనుమతులు లేకుండా ప్లాట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూములను ఆక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా. –గోపీకృష్ణ, తహసీల్దార్ -
రెండు ఆటోలు ఢీ– ఏడుగురికి గాయాలు
పులిగడ్డ(అవనిగడ్డ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగడ్డ టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కొందరు ఆటోలో మోపిదేవి ఆలయానికి వచ్చి తిరిగి వెళుతుండగా, రేపల్లె వైపు నుంచి వస్తున్న కోడిగుడ్ల ఆటో లారీని తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీరరాఘవమ్మ, కోసూరు అరుణతోపాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరరాఘవమ్మ, అరుణలను మచిలీపట్నం తరలించగా, స్వల్పగాయాలైన మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నా భార్య కారణంగానే చనిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు. అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్‌లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్ చేసింది. లైంగికదాడి కేసులో వ్యక్తికి రిమాండ్ చీరాల: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి చీరాల కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు వన్‌టౌన్ ఎస్.ఐ జి.రాజ్యలక్ష్మి బుధవారం తెలిపారు. పట్టణంలోని ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన పుల్లేటికుర్తి పుల్లయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు సదరు బాలిక మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా ఎస్ఐ జి.రాజ్యలక్ష్మి బుధవారం ఉదయం నిందితుడిని ఇంటి వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు, -
ఇంటికి చేరేలోపే మృత్యువాత
ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి బల్లికురవ: పింగాణీ పరిశ్రమలో పనిచేస్తూ డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న యువకుడిని, సుబాబుల్ కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చెన్నుపల్లి–అనంతవరం ఆర్అండ్బీ రోడ్డులోని వేమవరం గ్రామంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. బల్లికురవ పంచాయతీలోని కొండాయపాలెం గ్రామానికి చెందిన పూరిమెట్ల శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు వెంకటేష్ బార్బర్ షాప్ నిర్వహిస్తూ జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. రెండో కుమారుడు గోపికష్ణ (30) ఎంబీఏ వరకు చదువుకున్నాడు. వేమవరం గ్రామ సమీపంలోని పింగాణీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగిసిన తదుపరి ఇంటికి వెళుతుండగా వేమవరం నుంచి చిలకలూరిపేట వైపు సుబాబుల్ కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ డోర్లు విడిచి వస్తోంది. అది అకస్మాత్తుగా ఢీకొట్టడంతో మార్జిన్ అర్థం కాక గోపికృష్ణ బైక్ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జున్జుయింది. అరగంటలో ఇంటికి చేరేలోపే ఈ ప్రమాదం సంభవించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి నాలుగు సంవత్సరాల కిందట అమూల్య కుమారితో వివాహమైంది. మూడు సంవత్సరాల బాబు ఉండగా.. ప్రస్తుతం అమూల్య నిండు గర్భిణి. బుధవారం మృతుడి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాన్ని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండాయపాలెం, చెన్నుపల్లి గ్రామాల్లో అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాసరావు కుమారుడు రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందటంతో రెండు గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ఆశ పడ్డారు...భంగ పడ్డారు
సారక్షి ప్రతినిధి, బాపట్ల: వంచనకు, వెన్నుపోటుకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు చాలామంది అదే పేరుతో సంబోధించడం తెలిసిందే! అలాంటి పార్టీ ని, అధినేతను నమ్మి చేరితే వెన్నుపోట్లు, భంగపాట్లు తప్ప ఏం జరుగుతుంది? ఇప్పుడు చీరాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అక్షరాలా ఇదే జరిగింది. ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య తన సామాజికవర్గానికే చెందిన 11వ వార్డు కౌన్సిలర్ మించాల సాంబశివరావుకే చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. పదవిని ఆశించిన వివిధ సామాజికవర్గాల సీనియర్ నేతలకు భంగపాటు తప్పలేదు. దీంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు అధికారం, పదవులను ఆశించి కన్నతల్లిలాంటి వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచిన సీనియర్ కౌన్సిలర్లు చంద్రబాబు పార్టీలో అదే వెన్నుపోటుకు గురికావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మించాలను వరించిన చైర్మన్ పదవి బుధవారం జరిగిన చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు కౌన్సిలర్ మించాల సాంబశివరావును చైర్మన్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన మించాలను పార్టీ అధిష్టానమే షీల్డ్ కవర్ పద్ధతిలో ఎంపిక చేసినట్లు పచ్చపార్టీ నేతలు కలరింగ్ ఇచ్చినా కవర్ తెచ్చినట్లు చెబుతున్నా కవర్ తెచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి సైతం అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం చీరాలలో మరింత చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఎమ్మెల్యే కొండయ్య తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మున్సిపల్ చైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల నియోజకవర్గంలోని మిగిలిన బలమైన సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బలమైన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుతోపాటు ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య, కాపు సామాజికవర్గానికి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ రాములు సైతం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీపడ్డారు. ఫిరాయింపుదారులకు పచ్చపోటు చీరాల మున్సిపాలిటీలో 33 కౌన్సిల్ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ తరపున 22 మంది, మాజీ మ్మెల్యే ఆమంచి మద్దతుదారులు 11 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి రావడంతో 26 మంది అనైతికంగా వెన్నుపోటుతో పచ్చపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే నేతలకు చంద్రబాబు వెన్నుపోటు కలిసొచ్చింది. పార్టీలో చేర్పించుకొని పచ్చ పార్టీ కసితీరా వెన్నుపోట్లు పొడిచింది. వైఎస్సార్ సీపీని వీడివెళ్లిన వారికి ఇలాగే జరగాలని చీరాల వాసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే సామాజిక వర్గానికే చైర్మన్ గిరి చీరాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే మార్క్ పదవి ఆశించి భంగపడ్డ నేతలు ఆస్తులు అమ్ముకొని నష్టపోయానంటూ కౌన్సిలర్ సుబ్బయ్య ఆవేదన ఆవేదనతో పచ్చపార్టీకి రాజీనామా వైఎస్సార్ సీపీని వీడి భంగపడ్డ మాజీ చైర్మన్ జంజనం కౌన్పిలర్ రాములుకు మొండిచెయ్యి వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన నేతలకు వెన్నుపోటు ఎమ్మెల్యే కొండయ్య తీరుపై మెజార్టీ సామాజికవర్గాల ఆగ్రహం అనైతిక వెన్నుపోట్లు మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్ పదవి దక్కకపోవడంతో 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరు సుబ్బయ్య పత్రికలు, మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంత మయ్యారు. తనను పచ్చపార్టీ చంపేసిందన్నారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని నష్టపోయానని తీవ్ర ఆవేదన చెందారు. టీడీపీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. పాపం పొత్తూరు సుబ్బయ్య ఆవేదన చీరాల వాసులను కదిలించలేక పోయింది. పదవుల కోసం తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి ఆయన పచ్చపార్టీ కండువా కప్పుకోవడాన్ని చీరాల వాసులు ఇంకా మరిచి పోలేదు. అందుకే ఆయన కన్నీళ్ల పట్ల ఇక్కడి ప్రజలలో సానుభూతి కనిపించలేదు. మొత్తంగా చీరాల కొత్త మున్సిపల్ ఎన్నిక ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్యపై మెజార్టీ సామాజికవర్గాల్లో వ్యతిరేకత పెంచగా పచ్చపార్టీ వెన్నుపోట్ల వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది. నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక చీరాల: చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక బుధవారం జరుగుతుందని ఊహించినా చివరి నిమిషంలో వాయిదా పడింది. గురువారం ఉదయం 11గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి టి.చంద్రశేఖర్‌నాయుడు తెలిపారు. చీరాల మున్పిపల్ చైర్మన్ విషయంలో టీడీపీ అవిశ్వాసం నోటీసు ఇవ్వగానే వైఎస్సార్ సీపీ తరపున గెలిచి చీరాల మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావు అప్రమత్తమై పదవితోపాటు రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారాలను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో పచ్చపార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన పొత్తూరు సుబ్బయ్య మున్సిపల్ చైర్మన్ కావాలనే తాపత్రయంతో సొంత పార్టీ వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి ఏకంగా చంద్రబాబు సమక్షంలో పచ్చపార్టీలో చేరారు. ఇక తాజాగా చైర్మన్‌గా ఎన్నికై న సాంబశివరావు సైతం వైఎస్సార్ సీపీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై ఎమ్మెల్యే సమక్షంలో పచ్చపార్టీ కండువా కప్పుకున్నారు. మరో కౌన్సిలర్ రరాములు వైఎస్సార్ సీపీ తరపున ఎన్నికై మున్సిపల్ చైర్మన్ గిరీ ఆశించి టీడీపీలో చేరారు. వీరందరూ చంద్రబాబు వెన్నుపోటును ఆదర్శంగా తీసుకొని వెన్నుపోట్లకు దిగిన వారే కావడం గమనార్హం. -
జాతీయ అవార్డు... చేనేతలకు అంకితం
బాపట్ల: ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి‘ పేరుతో కుప్పడం పట్టు చీరలకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన జాతీయ స్థాయి అవార్డును చేనేతలకు అంకితం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నుంచి కలెక్టర్ అవార్డును అందుకున్న విషయం విదితమే. జాతీయస్థాయి అవార్డును అందుకుని బాపట్ల వచ్చిన జిల్లా కలెక్టర్ వెంకట మురళిని వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా బుధవారం కలసి సన్మానించి, అభినందనలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ చీరాల కుప్పడం పట్టు చీరలు ఎప్పటినుంచో ప్రాచుర్యం పొందాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డుతో మరింత వెలుగులోకి వచ్చిందన్నారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒక జిల్లా–ఒక ఉత్పత్తి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ స్థాయి అవార్డు, గౌరవం చేనేతలకే చెందుతుందన్నారు. కుప్పడం పట్టు చీరలను ఆన్లైన్ వ్యాపార వేదికకు అనుసంధానం చేయాలన్నారు. సూర్యలంక బీచ్, వాడరేవు బీచ్ వద్ద, చీరాల పట్టణం, బాపట్ల పట్టణంలోని ప్రధాన కూడలిలో కుప్పడం పట్టు చీరల ప్రదర్శన, అమ్మకాలు జరపాలన్నారు. పొదుపు సంఘాల ద్వారా సంబంధిత నాలుగు ప్రాంతాలలో దుకాణాలు ఏర్పాటుచేసి, వ్యాపారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశమంతా ప్రాచుర్యం పొందిన కుప్పడం పట్టు చీరల ఉత్పత్తి విస్తృతం కావాలని, చేనేత కుటుంబాల్లోని నిరుద్యోగులు ఆసక్తిగా చేనేత వృత్తిలోకి అడుగులు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచి ధరలు రావాలి, చేనేత వృత్తి లాభదాయకంగా మారాలి, చేనేతలకు మరింత ప్రయోజనం కల్పించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం అన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ షాలెంరాజు, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల, రేపల్లె ఆర్డీవోలు పి.గ్లోరియా, రామలక్ష్మి, డీఎల్డీఓ విజయలక్ష్మి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి కలెక్టర్‌ను సన్మానించిన అధికారులు బంగారు కుటుంబాల నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే చేపట్టాలి బాపట్ల: బంగారు కుటుంబాల నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే కార్యక్రమం ఈనెల 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీ–4 కార్యక్రమం అమలు తీరుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నిర్వహించే ఉద్యోగులకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ ముగియగానే సర్వే ప్రారంభించాలన్నారు. ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు బంగారు కుటుంబాల అదనపు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్నారు. బంగారు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి మార్గదర్శీలు బాటలు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పీ–4 విధానం రాష్ట్ర కమిటీ సభ్యుడు సంతోష్ మాట్లాడుతూ బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించడం, వనరులను సమకూర్చే ప్రక్రియ వేగంగా చేయాలని చెప్పారు. నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సీపీఓ షాలేంరాజు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, నియోజకవర్గం ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): సామాజిక ఆరో గ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్.మోజెస్కుమా ర్ వైద్యులకు సూచించారు. పిట్టలవానిపాలెంలోని వైద్య పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రా న్ని బుధవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్.మోజెస్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది అందరూ నిర్దేశిత సమయానికే వైద్యశాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలతోపాటు ముఖ్యంగా టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రకాల వ్యాధుల కు అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించి సకాలంలో రిపోర్టులు వచ్చేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది ఉన్నారు. 558.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంం నీటిమట్టం బుధవారం 558.70 అడుగులకు చేరింది. ఇది 229.3671 టీఎంసీలకు సమానం.సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,650 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 65,900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. వైద్యులు సమయపాలన పాటించాలి జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి మోజెస్‌కుమార్ -
చరిత్రకు చిరునామా బాపట్ల వ్యవసాయ కళాశాల
బాపట్ల: చరిత్రకు చిరునామాగా బాపట్ల వ్యవసాయ కళాశాల నిలిచిపోయిందని నకాసా క్రాప్ సైన్‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగర్లమూడి చంద్రశేఖర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 80వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం కళాశాలలో నిర్వహించారు. జాగర్లమూడి మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాలుగా విద్యారంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్న బాపట్ల వ్యవసాయ కళాశాల ఆదర్శనీయమైన పాత్రను నిర్వహిస్తుందన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఉభయ రాష్ట్రాలలో అనేక ఇతర వ్యవసాయ కళాశాలల ఆవిర్భావానికి స్ఫూర్తిదాయకమైందని అన్నారు. ఇక్కడ వ్యవసాయ విద్యార్థులకు బోధనా సిబ్బంది నేర్పించే నైపుణ్యాల ప్రభావమే ఇందుకు దోహద పడిందన్నారు. పట్టభద్రులైన అనంతరం కేవలం ఉద్యోగ సముపార్జనే దృష్టిగా భావించకుండా పలు వ్యవసాయ పరిశ్రమలను స్థాపించే దిశగా పట్టభద్రులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉద్యోగతను కల్పించేందుకు సరికొత్త వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి మాట్లాడుతూ ప్రపంచ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే బీజం పడిందని, దేశ దేశాలలో తమ వ్యవసాయ సాంకేతిక ప్రతిభను చాటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులుగా ఇక్కడి విద్యార్థులు నిలిచారని పేర్కొన్నారు. జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.తుషారకు ఉత్తమ పరిశోధన పత్రాన్ని సమర్పించినందుకు బంగారు పతకాన్ని బహూకరించారు. డాక్టర్ బాలినేని వెంకటేశ్వర్లు, బాలినేని స్వరూపరాణిలు డి.మంజూషకు వెండి పతకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో పలువురు పూర్వ అసోసియేట్ డీన్లను సత్కరించారు. విశ్వవిద్యాలయ అధికారులు, పూర్వ విద్యార్థులు, పీహెచ్‌డి, పీజీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నకాసా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జాగర్లమూడి చంద్రశేఖర్ ఘనంగా వ్యవసాయ కళాశాలవ్యవస్థాపక దినోత్సవం -
రాజీమార్గమే రాజ మార్గం
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల రేపల్లె: రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్నివర్గాల కేసుల పరిష్కారం కోసం, దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేలా బుధవారం స్థానిక తాలూకా కార్యాలయం నుంచి నిర్వహించిన వన్ కే వాక్‌లో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం న్యాయశాఖ ప్రతి నెలా మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తుందన్నారు. ఇరు వర్గాలకు న్యాయం చేసి కేసులను త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా న్యాయశాఖ పనిచేస్తుందన్నారు. లోక్ అదాలత్‌లతో కేసులు త్వరగా పరిష్కారం అవటంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. తాలూకా సెంటర్ నుంచి ఓల్డ్ టౌన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతాభార్గవి, న్యాయవాదులు, పోలీసులు, పారామెడికల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం నరసరావుపేటరూరల్: అల్లూరివారిపాలెం రోడ్డులోని లింగంగుంట్ల చెక్‌పోస్ట్ సమీపంలోని మానసాదేవి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు దంపతులు, నేరేళ్ల విజయలక్ష్మి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఉద్యోగం నుంచి వార్డెన్ తొలగింపు కారెంపూడి: స్థానిక మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ఇన్‌ఛార్జి వార్డెన్ శౌరీ భాయిని ఉద్యోగ విధుల నుంచి తప్పించినట్లు డీఈఓ ఎల్.చంద్రకళ ఆదేశాలు జారీ చేశారని ఎంఈఓ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డెన్‌పై వచ్చిన అభియోగాలు నిజమని కమిటీ విచారణలో తేలడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు డీఈఓ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎంతో బాధ్యతగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యాన్ని, అభ్యంతకర ప్రవర్తనను ఉపేక్షించేది లేదని ఎంఈఓ రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మైనార్టీ విద్యాసంస్థల్లో నేరుగా ప్రవేశాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్న మైనార్టీ బాల,బాలికల పాఠశాలలతోపాటు ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కన్వీనర్ ఎం. రజని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పొన్నూరు రోడ్డులోని మైనార్టీ బాలికల పాఠశాల, పాత గుంటూరు నందివెలుగు రోడ్డులోని బాలుర పాఠశాలలో 5,6,7,8వ తరగతులతోపాటు ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 87126 25038, 87126 25039, 87126 25073 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 3 వేల కిలోల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనంపొన్నూరు: పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుకాణంలో బుధవారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాదాపు మూడు వేల కిలోల ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం 21 వార్డులోని ఓ ట్రేడర్స్‌లో విక్రయానికి ఉంచిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యజమానికి రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగంలో నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇరువురిని పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం కమిటీలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా సత్తెనపల్లికి చెందిన చిలకల జయపాల్, పెదకూరపాడుకు చెందిన చిలకల పెదబాబును నియమించారు. 20న బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్స్, సీనియర్స్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు ఇ.శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొనే చిన్నారులు జనవరి 2, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాకలకు 83477 85888 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. లక్ష్యానికి మించి ఉపాధి పనులుయడ్లపాడు: జిల్లాలో ఉపాధి హామీ పనులు లక్ష్యానికి మించి జరుగుతున్నాయని జిల్లా డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మూర్తి వెల్లడించారు. మంగళవారం యడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఉపాధి హామీ పథకం పనులు ప్రగతి, లక్ష్యాలు, ఇతర విషయాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఉపాధి పనుల లక్ష్యం 45 లక్షల పనిదినాలు కాగా, ఇప్పటికే 55.13 లక్షల పని దినాలు పూర్తయ్యాయని, ఇది లక్ష్యానికి మించి సాధించిన ప్రగతి అని వివరించారు. గోకుల షెడ్ల పథకానికి సంబంధించి గత ఏడాది మంజూరైన 740 గోకుల షెడ్లలో 63 షెడ్లు బేస్ లెవల్లో ఉన్నాయని, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం కింద 100శాతం రాయితీని అందిస్తున్నామని ఎంఎస్ మూర్తి తెలిపారు. డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మూర్తి -
జీడీసీఏ జిల్లా అధ్యక్షుడిగా రాకేష్ చౌదరి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(జీడీసీఏ) నూతన అధ్యక్షుడిగా చుక్కపల్లి రాకేష్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జీడీసీఏ ఉపాధ్యక్షుడు తోట వెంకట శివ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్‌గా వెంకటరత్నం వ్యవహరించారన్నారు. కార్యదర్శిగా ఎనుముల శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కొంగర రాహుల్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా తోట వెంకట శివరామకృష్ణ, కోశాధికారిగా సింగరాజు లక్ష్మీకాంత్, కౌన్సిలర్‌గా నందిరాజు శివ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. -
బాపట్ల
కనకదుర్గమ్మకు బోనాలు పిడుగురాళ్ల: భవానీనగర్‌లోని కనకదుర్గ అమ్మవారికి మంగళవారం బోనాలు సమర్పించారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి పవిత్రోత్సవాలు మోపిదేవి:మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమే త సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.7పోలేరమ్మకు సారె సమర్పణ పాతనందాయపాలెం(కర్లపాలెం): స్థానిక గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి మహిళలు మంగళవారం ఆషాఢ సారె సమర్పించి పూజలు చేశారు. బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025 -
స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
డాక్టర్ మధుకర్ గుప్తా బాపట్ల స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావాలని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్స్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుకర్ గుప్తా అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని అన్నారు. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డీలిమిటేషన్, రిజర్వేషన్ అమలు పరిశీలించాలని, ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. రాజకీయంగా ప్రభావితం చేసే అంశాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. బాపట్ల జిల్లాలో 459 గ్రామపంచాయతీలు ఉన్నాయన్నా రు. 426 పంచాయతీలకు ఎన్నికలు జరిగా యని, మిగిలినవి కోర్టు కేసుల నేపథ్యంలో నిలిచిపోయాయన్నారు. 4,306 వార్డు లు ఉండగా, గత ఎన్నికల్లో గెలుపొందిన వారి అధికారాలు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నాటితో ముగుస్తాయన్నారు. జిల్లా పరిషత్ స్థానాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉన్నాయన్నారు. గుంటూరు పరిధిలో 862 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 57 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ పరిధిలో 792 ఎంపీటీసీ స్థానాలు, 57 జెడ్పీటీసీ స్థానాలున్నాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రణాళికలు రూపొందించాలని ఆమె సూచించారు. డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేశామని తెలిపా రు. జిల్లాలో 12,60,997 ఓటర్లు ఉండగా, అందు లో 6,44,171 మంది మహిళా ఓటర్లు, 6,16,826 మంది పురుష ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీపీఓ ప్రభాకరరావు, గుంటూరు జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ప్రకాశం జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డీవో పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల కుటుంబాలకు ఆర్మీ అండగా ఉంటుంది
చందోలు(కర్లపాలెం): కార్గిల్ అమరవీరుడు మహ్మద్ హాజీ బాషా త్యాగాన్ని భారతీయులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని, అమరవీరుల కుటుంబాలకు ఆర్మీ అండగా ఉంటుందని ఎనిమిదో మౌంటెన్ విజన్ హెడ్ క్వార్టర్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో) ఎం వెంకటరెడ్డి చెప్పారు. 1999వ సంవత్సరంలో ఆపరేషన్ విజయ్‌లో భాగంగా కార్గిల్‌లో జరిగిన యుద్ధంలో జరిగిన బాంబు బ్లాస్టింగ్‌లో బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన జవాన్ మహమ్మద్ హాజీ బాషా అమరుడయ్యారు. 26వ కార్గిగల్ దివస్ సందర్భంగా మంగళవారం 8వ మౌంటెన్ డివిజన్ హెడ్‌క్వార్టర్ జవాన్లు చందోలు గ్రామానికి వచ్చి మాజీ సైనికులతో కలసి కార్గిల్ అమరవీరుడు, సేనా మెడల్ అవార్డు గ్రహీత హాజీబాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హాజీ బాషా కుటుంబ సభ్యులకు కార్గిల్ దివస్ మెమోంటో, ప్రశంసాపత్రం అందజేశారు. హాజీ బాషా పోరాట పటిమను, త్యాగనిరతిని స్థానిక విద్యార్థులకు, గ్రామస్తులకు సైనికులు వివరించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ కార్గిల్ వీరుని గుర్తుగా చందోలు గ్రామానికి మహ్మద్ హాజీ బాషా పేరుతో ముఖ మండపం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో 8వ మౌంటెన్ డివిజన్ హవల్దార్ రాజేష్, చిరంజీవులు, మాజీ సైనికుల అసోసియేషన్ చందోలు, చెరుకుపల్లి, నిజాంపట్నం బాపట్ల అధ్యక్షులు దావూద్, సస్త్రక్ సుల్తాన్, టి.సుబ్బారావు, పి.ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేసీవో ఎం.వెంకటరెడ్డి కార్గిల్ అమరవీరుడు హాజీ బాషా చిత్రపటానికి ఘన నివాళి -
పొగాకు కొనుగోలులో పచ్చపాతం
● పార్టీ నాయకులను ఉద్ధరించడానికేనా కొనుగోలు కేంద్రాలంటున్న రైతులు ● స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పొగాకు కొనుగోలు ● అధికారులకు కనిపించని సన్న, చిన్నకారు రైతులు ● రైతులు ఆశించినంతగా లేని పొగాకు కొనుగోళ్లు ● ప్రభుత్వ చర్యలతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణ టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకే రైతులకు ఫోన్ మెసేజ్‌లు పర్చూరు (చినగంజాం): ఆరుగాలం కష్టించి పనిచేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులు ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు, కౌలు రైతుల ఆందోళనల మధ్య ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆశించినంతగా కొనుగోళ్లు జరగడం లేదనే విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతల సిఫార్సు ఉంటేనే కొనుగోలు ప్రభుత్వం ద్వారా పొగాకు సేకరణ చేస్తున్న ఏపీ మార్క్‌ఫెడ్, ఏఎంసీ, డీసీఎంఎస్ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని, ఎక్కడికక్కడ కొర్రీలు పెడుతూ సక్రమంగా కొనుగోళ్లు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకే కొనుగోలు జరుగుతుందనే ఆరోపణలున్నాయి. పొగాకు పండించిన రైతులు అధికారుల సూచనల మేరకు తమ పంట వివరాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఆ రైతులకు మెసేజ్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాల వద్దకు పొగాకు ఎప్పుడు తీసుకొని రావాలనే విషయాన్ని ముందుగా అధికారులు తెలియజేయాల్సి ఉంది. అయితే తమకు మెసేజ్‌లు అందడం లేదని, టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే మెసేజ్‌లు వస్తున్నాయని, అది కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కొనుగోలు కేంద్రాల్లో అధికారులు మెసేజ్‌లు పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న రైతులు పొగాకు బేళ్లను సిద్ధం చేసుకున్నా మెసేజ్‌లు రాకపోవడంతో రోజుల తరబడి ఎదురు చూస్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే సమక్షంలో ఇటీవల కొద్దిపాటి వివాదం కూడా తలెత్తినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఒక టీడీపీ నాయకుడు తాము చెప్పిన వారికే మెసేజ్‌లు పెట్టాలంటూ ఎమ్మెల్యే వద్ద తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అధికారుల కుంటి సాకులు రైతులు తెచ్చిన పొగాకును పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా అధికారులు కుంటిసాకులు చెబుతూ బేళ్లను వెనక్కి పంపేస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు మెసేజ్‌లు రావడమే గగనమైతే పేర్లు వచ్చిన రైతుల పొగాకు 20 శాతం మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన దానిలో తేమశాతం ఎక్కువగా ఉందనో, నాణ్యత సక్రమంగా లేదనే సాకులు చెబుతూ పంపిస్తున్నారు. ఒకే భూమిలో పండించిన ఒకే పంటను నాణ్యత కొరవడిందంటూ తిప్పి పంపించడం ఎంత వరకు సమంజసమంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు పొగాకు బేళ్లను కట్టాల్సి ఉండగా అందుకోసం బేలుకు రూ.150, రవాణా రూ.70 మొత్తం రూ.220 ఖర్చవుతుండగా మళ్లీ కొనుగోలు కేంద్రంలో అధికారులు తిప్పి పంపితే అదే ఖర్చు ఇంటి దాకా తీసుకెళ్లేందుకు అవుతోంది. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధమవుతున్న రైతులు పొగాకు కొనుగోలు కేంద్రాల్లో అధికారులు బేళ్లను ఏదో ఒక సాకు చెప్పి కొర్రీలు పెట్టి తిప్పి పంపుతుండటంతో తమ పంటను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రూ.12 వేలు పలుకుతున్న పొగాకును ప్రైవేటు వ్యక్తులు అతి తక్కువగా రూ.8500లకే కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు కొందరు దళారులుగా మారి రైతులను మోసానికి గురి చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో పొగాకు కొనుగోలు పరిస్థితిమండలం పండించిన పంట రైతుల వద్ద రైతులు దిగుబడి నిల్వ (క్వింటాలు) (క్వింటాలు) ఇంకొల్లు 1892 1,05,990 1,00,508 యద్దనపూడి 1950 1,17,500 1,17,000 మార్టూరు 701 27,349 1927 కారంచేడు 1852 97950 5650 పర్చూరు 4359 3,11,838 12,138 చినగంజాం 290 16629 315 ఆశించిన స్థాయిలో సాగని కొనుగోళ్లు పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు 15 శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. చిలకలూరిపేట ప్రాంతంలో ఏర్పాటుచేసిన కేంద్రంలో గడచిన వారంలో అతి తక్కువగా 73.22 మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు జరిగింది. పంగులూరు, పర్చూరుల్లోని కేంద్రాల్లో అతి తక్కువగా కొనుగోలు జరిగింది. మొత్తం 11 కొనుగోలు కేంద్రాల్లో 2 వేల మెట్రిక్ టన్నులకు మించి పొగాకు కొనుగోలు జరగలేదు. పొగాకు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకొచ్చిన పొగాకులో 20 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని తిప్పి పంపించేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దాంతో ముందుగా మెసేజ్‌లు వచ్చిన కొందరు రైతులు తమ పలుకుబడి ఉపయోగించి ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్ వాళ్లకే అమ్ముతున్నట్లు సమాచారం. -
కన్న కొడుకునే కడతేర్చాడు
● ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన వైనం ● కుమారుడి అదృశ్యంపై మృతుడి పిన్ని ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన ● విచారణలో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు ● 2014లో తల్లిని, తండ్రిని చంపిన దుర్మార్గుడు ● విషయం తెలిసి తీవ్ర కోపోద్రిక్తులైన క్రోసూరు మండలం యర్రబాలెం గ్రామస్తులు క్రోసూరు: తాను సొంతంగా జీవించేందుకు, మేపుకొనేందుకు జీవాల్లో వాటా అడిగిన కుమారుడిని కన్న తండ్రే కడతేర్చిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన బూక్యా వెంకటేశ్వర్లు నాయక్, కుమారుడు మంగ్యానాయక్(19)లు జీవాలు మేపుతూ జీవనం సాగిస్తుంటారు. ఈక్రమంలో మూడు నెలల క్రితం క్రోసూరు మండలంలోని యర్రబాలెం గ్రామానికి జీవాలు మేపుకొంటూ వలస వచ్చారు. అయితే ఈనెల 3వ తేదీ నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని నిందితుడి రెండో భార్య, మృతుడి పిన్ని ప్రమీలాభాయి ఈనెల 12వ తేదీన క్రోసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్తపైనే అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తన కుమారుడిని తానే చంపినట్లు వెంకటేశ్వర్లు నాయక్ అంగీకరించాడు. ఈనెల 3వ తేదీ రాత్రి జీవాల్లో వాటా అడిగినందుకు కొట్టి చంపి, ముక్కలు చేసి, పూడ్చిపెట్టినట్లు ఒప్పుకొన్నాడు. మృతదేహం పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. కోపోద్రిక్తులైన స్థానికులు సీఐ పి.సురేష్, తహసీల్దార్ వీవీ నాగరాజు సమక్షంలో మంగ్యానాయక్ మృతదేహాన్ని పంచానామా చేసేందుకు వెలికి తీశారు. అన్నెంపున్నెం ఎరుగని కుమారుడిని చంపడంపై క్రోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు, పుట్లగూడెం నుంచి వచ్చిన బంధువులు నిందితుడ్ని వదిలిపెట్టకూడదని తమకు అప్పగిస్తే తామే శిక్ష వేస్తామని నిందితుడిని పోలీసుల దగర్గనుంచి లాక్కునే యత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజల్ని తరిమివేసి నిందితుడిని పోలీసుస్టేషన్ తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జీవాల్లో వాటా అడిగినందుకు కొడుకును చంపిన తండ్రి కన్న తల్లిదండ్రులను చంపిన కసాయి విచారిస్తున్న క్రమంలో క్రోసూరు పోలీసులకు మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వెంకటేశ్వర్లు నాయక్ క్రూర నేర చరిత్ర బయల్పడింది. 2014 సంవత్సరంలో తన సొంత తల్లిని అడవిలో నరికి చంపిన కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడని తేలింది. అనంతరం తన తండ్రిని సైతం హతమార్చడని, కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడని.. తన 3 నెలల కుమారుడిని సైతం చంపివేసిన కేసులో కూడా ఉన్నప్పటికీ సాక్ష్యాలు బలంగా లేని కారణంగా ఆ కేసు నిలవలేదని నిందితుడి మొదటిభార్య, మృతుడి తల్లి కోటేశ్వరీభాయి, గ్రామస్తులు సంఘటనా స్థలంలో మీడియాకు వివరించారు. అచ్చంపేట సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్ఐ రవిబాబు కేసును విచారిస్తున్నారు. -
బుల్లెట్ బైక్ దొంగల అరెస్ట్
● అందరూ బీటెక్ విద్యార్థులే.. ● 16 బుల్లెట్లు, స్కూటర్, రూ.25.20 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ● యూట్యూబ్ సెర్చ్ చేసి దొంగతనానికి ప్లాన్ ● కేసు ఛేదించిన అద్దంకి సీఐ బృందానికి ఎస్పీ ప్రశంసలు అద్దంకి రూరల్: యూ ట్యూబ్ మంచే కాదు చెడూ చేస్తుందనడానికి బీటెక్ విద్యార్థులు దొంగలుగా మారిన ఘటనే ఉదాహరణ. చెడు వ్యసనాలకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలని ఆశ వారిని కటకటాల పాల్జేసింది. ఒంగోలులో బీటెక్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఒక ముఠాగా ఏర్పడి ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుల్లెల్ బైక్‌లను దొంగిలించారు. అద్దంకి సీఐ బృందం కేసును ఛేదించి దొంగలను పట్టుకున్నారు. చీరాల డీఎస్పీ మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. అద్దంకికి చెందిన పల్లా సాయిరాం, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నార్లగడ్డ గోవిందరాజు, నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరిపాలెం గ్రామానికి చెందిన కోడెల పవన్‌కుమార్, ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం యోడ్లూరిపాడు గ్రామానికి చెందిన దివీ వేణుగోపాల్, దర్శి మండలం ఈస్ట్ వీరాయపాలెంకు చెందిన రాయపూడి వసంత్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్త పెండ్యాల గ్రామానికి చెందిన జీనెపల్లి నరేంద్రవర్మ, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం, ఆలూరి గ్రామానికి చెందిన అక్కుల వెంకట సాయిరెడ్డిలు ఒంగోలులోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చెడు వ్యవసనాలకు బానిసైన వీరు సులువుగా డబ్బు సంపాదించే మార్గం చెప్పాలని నిందితుడు గోవిందరాజును సలహా అడిగారు. యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి బుల్లెట్ బండ్లు దొంగతనం చేసే విధానాన్ని అందరికీ చూపించాడు. ఈ వీడియో చూసి దానిప్రకారం బుల్లెట్ బండ్లను మాత్రమే దొంగలించటం ప్రారంభించారు. శింగరకొండ తిరునాళ్లలో మొదటి దొంగతనం మొదటగా అద్దంకి మండలం శింగరకొండ తిరునాళ్ల రోజు 99 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం వద్ద బుల్లెట్ బండిని దొంగిలించారు. నామ్ హైవేపై పెట్టిన బండ్లను, అద్దంకి పట్టణంలోని చినగానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, సింగరకొండ గుడి వద్ద కలిపి అద్దంకి స్టేషన్ పరిధిలో 9 బుల్లెట్ బైక్‌లను తస్కరించారు. జె.పంగులూరు పరిధిలో బుల్లెట్, స్కూటీ, చిలకలూరిపేట స్టేషన్ పరిధిలో మూడు బుల్లెట్లు, నరసరావుపేట పరిధిలో ఒక బుల్లెట్, మద్దిపాడు, మేదరమెట్లల్లో ఒక్కొక్కటి మొత్తం 16 బుల్లెట్లు, ఒక స్కూటీ దొంగిలించారు. మొదటి నిందితడు పల్లా సాయిరాం, తోటి నిందితులు కొన్ని వాడుకుంటూ మిగిలినవి అమ్ముకుందామని అద్దంకి బ్రహ్మానందం కాలనీలోని పాడుపడ్డ బిల్డింగ్‌లో దాచిపెట్టారు. అద్దంకి పరిసర ప్రాంతాల్లో భారీగా బుల్లెట్ బైక్‌లు చోరీకి గురికావటంతో ఎస్పీ తుషార్‌డూడీ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ సుబ్బరాజు బృందం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాకచక్యంగా దొంగలను మంగళవారం అరెస్టు చేసింది. వారినుంచి 16 బుల్లెట్లు, స్కూటీ, రూ.25.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అద్దంకి సీఐ సుబ్బరాజు, ఏఎస్సై బి.వసంతరావు, హెడ్ కానిస్టేబుల్ జి.అంకమ్మరావు, కానిస్టేబుల్లు వి.బ్రహ్మయ్య, పి.బ్రహ్మయ్య, ఎం. వెంకట గోపయ్యలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
పుర ప్రథమ పౌరుడి ఎన్నిక నేడు
● నేడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ● ప్రధాన పోటీలో పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు చీరాల: పట్టణ పుర పౌరుడి ఎన్నికకు బుధవారం ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గిన రెండు నెలల తర్వాత బుధవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్‌గా ఎవరి పేరు ఖరారు చేస్తారనేది సందిగ్ధంలోనే ఉంది. చైర్మన్ కుర్చీకి ప్రధాన పోటీలో పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్గురిలో కూటమికి ఎవరు ఎక్కువగా ‘తూకం’ పెడతారో వారిదే పైచేయి అయ్యేలా ఉంది. చీరాల రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఏ చిన్న వ్యవహారం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం వెళ్లిపోతుంది. ఈసారి అయినా గట్టి పట్టుదలతో చైర్మన్ అభ్యర్థిని బయటకు పొక్కనీయడం లేదు. దీనికి తోడు ఎమ్మెల్యేతోపాటు ఆయన తనయుడు మహేంద్ర ఎవరిని చైర్మన్ చేయాలనేది మల్లగుల్లాలు పడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయి. చీరాల నైసర్గిక, ఆర్థిక వనరులపై ఒక నిర్ణయానికి వస్తున్నారు. రాత్రికి పార్టీలో ముఖ్యులతో ఎమ్మెల్యే చర్చించుకున్నారు. ఈ దశలో మహిళా కోట అడిగితే అప్పుడు ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. టీడీపీ కౌన్సిలర్‌కు గౌరవం దక్కుతుందా..? టీడీపీ తరఫున గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావును కాకుండా వైఎస్సార్ సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లే చైర్మన్ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది నెలల పదవీకాలం మాత్రమే ఉన్నా అవిశ్వాసం పెట్టించి తిరిగి చైర్మన్‌గా కొత్తవారిని ప్రకటించేందుకు కూటమికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు ఊవ్విళ్లూరుతున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించనున్నారు. డీఆర్వో, ఆర్డీఓ పర్యవేక్షణలో చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు చైర్మన్, 12 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. మరి కొద్ది గంటల్లో సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉంటుందో తేలనుంది.కౌన్సిలర్ల చూపు ఎవరి వైపు..? చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 33 వార్డుల్లో ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి 9 మంది ఉన్నారు. 2024లో ఎన్నికల అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించిన తర్వాత చైర్మన్ కుర్చీని అధిరోహించేందుకు పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్సీపీలో ఉన్నవారే. అయితే రేసులో ముగ్గురు పేర్లు ఉన్నాయి. తమ తమ బలాలు నిరూపించుకునేందుకు కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు ఎవరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారనేది వేచి చూడాలి. -
విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్ బాపట్ల: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ హెచ్చరించారు. మంగళవారం విద్యుత్ శాఖ బాపట్ల డివిజన్ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (విజయవాడ) ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల అదాలత్, అవగాహన సదస్సుకు ఇమ్మానుయేల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కర్లపాలెం మండలం గణపవరంలో గ్రామంలో లోఓల్టేజి సమస్య తీర్చేందుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు గ్రామస్తుల నుంచి రూ.రెండు లక్షలు వసూలు చేసి ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ట్రానన్స్ ఫార్మర్ ఏర్పాటుకు డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో ఓ పూరి గుడిసెలో విద్యుత్ మీటరుకు ఒకే నెలలో రూ.లక్ష విద్యుత్ బిల్లు వచ్చిందని, దానిని పరిశీలించి ఎందుకు పరిష్కరించలేదని అధికారులను నిలదీశారు. 2020లో ట్రాన్‌న్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో మురళీకృష్ణ విద్యుత్ శాఖకు డబ్బు జమ చేసినా ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బాపట్ల విద్యుత్ విభాగంలో ఏవోగా పనిచేస్తున్న రామ్ సురేష్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన తీరుపై ఇమ్మానుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే సస్పెండ్‌కు సిఫార్సు చేస్తామన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు.. ట్రూ అప్ చార్జీలు ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. సదస్సులో విద్యుత్ శాఖ ఎస్ఈ జి.ఆంజనేయులు, సదస్సు సాంకేతిక సభ్యులు ఎస్.శ్రీనివాసరావు, ఆర్థిక సభ్యులు ఆర్.సీహెచ్. శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యులు ఎ.సునీత, ప్రజాసంఘాల నాయకులు టి.కృష్ణమోహన్, కె.శరత్, విద్యుత్ వినియోగదారుల సంఘం బాపట్ల నియోజకవర్గ విభాగం నాయకులు ఆట్ల బాలాజీరెడ్డి పాల్గొన్నారు. -
23,24 తేదీల్లో భవన నిర్మాణ సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఈనెల 23, 24 తేదీల్లో పాత గుంటూరులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేటలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. గత ఏడు సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పనిచేయకపోవడం వల్ల కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని చర్చించి భవిష్యత్ ప్రణాళికను ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వారిని అవమానించడమేనన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.కోటేశ్వరరావు, నగర తూర్పు, పశ్చిమ కమిటీల కార్యదర్శులు దీవెనరావు, ఎస్.కె.ఖాసీం వలి, దూదేకుల మస్తాన్ వలి, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు సీతారామయ్య, బోయపాటి అక్కారావు, నికల్సన్, విమల్, తదితరులు పాల్గొన్నారు. -
మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల బిక్షాటన
బాపట్ల: మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో కార్మికులు పట్టణంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుంచి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె నిర్మించేది లేదని సీఐటీయూ నాయకులు మజుందార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాత్కాలికంగా ప్రైవేటు వర్కర్లతో పనులు చేయించుకున్నప్పటికీ అది శాశ్వత పరిష్కారం కాదన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు సమ్మెబాట వీడేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, సామిరెడ్డి, ప్రమీల, నరేష్ పాల్గొన్నారు. -
విద్యతోనే పేదల అభివృద్ధి సాధ్యం
యద్దనపూడి: విద్యతోనే పేదల అభివృద్ధి సాధ్యం అవుతుందని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ కుమారుడు షేక్ బాపూజీ కళా బృందంచే అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను బుర్ర కథ ప్రదర్శించారు. ముందుగా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే పేదల అభివృద్ధి సాధ్యం అన్నారు. పేద ప్రజలు తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలన్నారు. తమ పిల్లలు మత్తు పానీయాలకు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎస్సీఆర్పీ సొసైటీ కన్వీనర్ రాము మాట్లాడుతూ మన ఓటు మనకే వేసుకుని రాజ్యాధికారంలోకి రావాలన్నారు. సీపీఐఎంఎల్ రెడ్‌స్టార్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగాల సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తుందన్నారు. ప్రధాన కథకుడు షేక్ బాపూజీ అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రన బుర్రకథ రూపంలో చెప్పి ప్రజలను అలరించారు. కార్యక్రమంలో దయారత్నం, డీఎస్ బాబు.రాజేంద్రప్రసాద్, ఎస్ఎ సలీంబాబు, రాహేలు గ్రామ యువకులు వందనం, రవి, రత్న కిషోర్, కిషోర్ బాబు, ఆనంద్, విద్యార్థులు కావ్య, అనన్య, సాత్విక పాల్గొన్నారు. అనంతవరంలో సీతారామరాజు జీవిత చరిత్ర బుర్రకథ పాల్గొన్న బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ కుమారుడు షేక్ బాపూజీ -
ఏదీ.. అన్నదాత సుఖీభవ ?
● రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ● బీమా, పరిహారమూ నిల్ ● వర్షాలు లేక, గిట్టుబాటు దక్కక రైతులు అవస్థలు చీరాల: అన్నదాత సుఖీభవం పథకం అదిగో ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటిపోయినా రైతులకు ఎలాంటి సాయం చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. గత ఎన్నికల్లో రైతుల ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన వాస్తవాన్ని కూటమి నాయకులు విస్మరించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఏడాది కాలంగా సరైన వర్సాలు లేవు, పంటలు పండలేదు, అర కొరగా వచ్చిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల బాగోగులు పట్టించుకోవాల్సిన సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంతి చంద్రబాబుచేసిన ప్రకటనలకే దిక్కులేకుండా పోయింది. రూ. 480 కోట్ల పెట్టుబడి సాయం హుష్‌కాక్.. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం ఎగ్గొట్టారు. ప్రస్తుతం ఇదిగో అదిగో అంటూ రైతులను ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్నా ఇప్పటికీ అతీగతి లేదు. ఏటా రూ. 20 వేలు ఇస్తామంటూ ప్రకటించినా, జిల్లా రైతులకు మొదటి ఏడాది ఇవ్వాల్సిన మొత్తం రూ. 480 కోట్లు పెట్టుబడి సాయం ఎగొగ్గట్టేశారు. రెండో ఏడాదైనా ఇస్తారని రైతులు ఆశలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. మే అన్నారు, తర్వాత జూన్ 12, 20 అన్నారు. ఆ తర్వాత జూన్ ఆఖరులోపు అంటున్నారు. మళ్లీ జులై ఆఖరికి అని ఊసూరు మనిపిస్తున్నారు. సీఎం, మంత్రుల ప్రకటనలకూ దిక్కులేకుండా పోయింది. పీఎం కిసాన్, కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.14 వేలు ఇస్తామనా ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. కనీసం రూ. 14 వేలు ఇచ్చినా గతేడాది జిల్లాలో ఉన్న 2.40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 400 కోట్లు మేర జమ అయ్యేవి. ఈ సారి పీఎం కిసాన్ కింద మొదటి విడత ఇవ్వాల్సిన సొమ్ము కూడా జాప్యం చేస్తుండటంతో రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నన పరిస్థితి నెలకొంది. రైతుల అవస్థలు.. అన్నదాత సుఖీభవతోపాటు పంటల బీమా పథకం కింద ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. మరోవైపు పంటలు పండక అప్పుల పాలై పిల్లల చదువులు, పెళ్లిళ్లు భారమై ఆత్మహత్య చేసుకునన రైతు కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. గత జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు దాదాపు పదుల సంఖ్యలో రైతులు వివిధ రూపాల్లో బలవన్మరణ పొందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెల్లినా స్పందించక పోవడంతో బాదితుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక గత ఖరీఫ్, రబీలో పంటలు దారుణంగా దెబ్బతినడంతో కంటి తుడుపు చర్యగా కరువు మండలాలను ప్రకటించేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పైసా ఇవ్వకుండా ప్రభుత్వం రిక్తహస్తం చూపించారు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు కూడా ఇన్పుట్ ఇవ్వకుండా దాట వేశారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ లేదు. వడ్డీ రాయితీ కరువై అన్నదాత దిక్కు చూస్తున్నా కూటమి ప్రభుత్వం కరుణించే పరిస్థితి కనిపించడం లేదు. -
కార్మికుల సమస్యలపై ఉదాసీనత తగదు
రేపల్లె: సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం తగదని మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, ఇతర సమస్యలపై నెల రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. చాలీచాలని వేతనాలతో బాధపడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్నారు. జీఓ 36 ప్రకారం వెంటనే వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను సత్వరం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని చెప్పారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మణిలాల్, మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకరరావు, రవి, రాఘవేంద్రరావు, సుబ్బారావు, శ్రీనివాస్, గీత, అనూష, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
మంత్రి, అధికారులు కుమ్మక్కయారు
● 18 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు అంటూ మోసం ● కారుచౌకగా భూములు కొట్టేయాలని చూస్తున్న వైనం ● వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు బల్లికురవ: సోలార్ ప్రాజెక్ట్ కోసం కారుచౌకగా భూములు కొట్టేయాలని మంత్రి, అధికారులు కుమ్మక్కయారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి మండలంలోని కొప్పరపాలెంలో గ్రామంలో గ్రామ బూత్ కమిటీలను ఎకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఎన్నికల హమీలు నెరవేర్చకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని ఎస్ఎల్ గుడిపాడు, కుందుర్రు, మావిళ్లపల్లి, మక్కెనవాపాలెం గ్రామాల్లోని 18 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామంటూ 3 నెలలుగా మంత్రి అధికారులతో కలిసి తక్కువ ధరకే భూములు కాజేయాలని కుట్ర పన్నారని చెప్పారు. ఆ భూములు కోల్పోతే రైతులకు మనుగడే లేదని కృష్ణబాబు వివరించారు. ఈ విషయమై రైతులకు సోమవారం గ్రీవెన్స్‌లో వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు. కొప్పరపాలెం గ్రామ, బూత్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా మాగులూరి శివారెడ్డి, గొర్రెపాటి దానయ్య, యర్రకుల వెంకటేశ్వర్లు, కొయ్యలమూడి వెంకటేశ్వర్లు మరో 30 సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి అక్కయ్య ఎస్సీ సెల్ మహిళాధ్యక్షురాలు, కోయలమూడి శింగయ్య స్థానిక నేతలు ఆల్గొన్నారు. -
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యుల ఆగ్రహం ● చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతి
పోక్సో కేసు రాజీ కోసం పోలీసుల వేధింపులు నరసరావుపేట: ఓ బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు పెట్టిన తల్లిదండ్రులను రాజీ కోసం కొట్టి హింసించి వేధిస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నాదెండ్ల గొరిజవోలుకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండెబోయిన శ్రీనివాసరావు నరసరావుపేట మండలంలోని దొండపాడులో ఓ యువతి వివాహం చేసుకున్నాడని, వారికి 17ఏళ్ల మైనర్ బాలిక ఉందని తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రతిరోజు వెంటపడుతూ వేధిస్తున్నాడని చెప్పారు. దీంతో ఆ బాలికను అమ్మమ్మ ఊరు దొండపాడులో ఉంచారని వివరించారు. యువకుడు ఈ విషయం తెలుసుకొని దొండపాడు వచ్చి వెళుతుండటంతో ఆ బాలిక సోదరుడు, గ్రామస్తులు కలిసి మందలించి పంపించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక మానసికంగా కుంగిపోయి పురుగుమందు తాగగా ప్రభుత్వాసుపత్రిలో చేర్చారని తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు బాలిక నుంచి రిపోర్టు తీసుకొని ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారని గోపిరెడ్డి చెప్పారు. ఆ బాలిక 11రోజులపాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకుందన్నారు. అయితే, ఆ కేసును తప్పించుకునేందుకు రాజీ కోసం తల్లితండ్రులు కుమారుడు అదృశ్యమయ్యాడనే ఫిర్యాదును నరసరావుపేట రూరల్ పోలీసులకు ఇచ్చారని చెప్పారు. కేసులో తప్పకుండా శిక్ష పడుతుందనే ఉద్దేశంతో నెలరోజుల నుంచి బాలిక తల్లితండ్రులు, సోదరుడితో పాటు గ్రామస్తులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి వేధించటం ప్రారంభించారని గోపిరెడ్డి ఆరోపించారు. బాలిక సోదరుడిని పోలీసుస్టేషన్‌కు పిలిచి కొట్టారన్నారు. శరీరంపై పడిన దెబ్బల మచ్చలను మీడియాకు చూపించారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించటం దారుణమని ఆయన ఖండించారు. బెంగుళూరు, తిరుపతి ప్రదేశాల్లో ఆ యువకుడిని దాచిపెట్టి రాజీకోసం ఈవిధంగా తప్పుడు కేసులు పెట్టి బాధిత కుటుంబాన్ని వేధించటం రెడ్‌బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పక్షాన నిలబడాల్సిన పోలీసులు ఒక్కపార్టీ వైపే ఉండటం చాలా దారుణమని ఆయన విమర్శించారు. ఎస్పీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబం సభ్యుడైన శ్రీనివాసరావు మీడియాతో జరిగిన విషయం చెప్పారు. కార్యక్రమంలో దొండపాడు గ్రామ సర్పంచ్ జక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బాధిత బాలిక కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఈఎం. స్వామి, షేక్ కరిముల్లా, సుబ్రహ్మణ్యం నాయీ పాల్గొన్నారు. ఏపీ సార్వత్రిక ప్రవేశాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ నరసరావుపేట: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్‌స్కూలు పదో తరగతి, ఇంటర్మీడియేట్ ప్రవేశాలకు చెందిన వాల్‌పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆవిష్కరించారు. దీనిలో డీఇఓ ఎల్.చంద్రకళ, డీఆర్ఓ మురళి, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి పాల్గొన్నారు. -
మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బాపట్ల: బాపట్ల ప్రాంత అభివృద్ధిలో కీలకపాత్ర వహించటంతోపాటు మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని బాపట్లలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారవేదికలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పేపర్లును డీఆర్ఓకు అందించారు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు మురుప్రోలు ఏడుకొండలరెడ్డి మాట్లాడుతూ బాపట్ల ప్రాంతానికి కృష్ణాజలాలను తెప్పించటంలో కీలకమైన పాత్ర పోషించిన కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొంతమంది అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. పాతబస్టాండ్‌లో పునఃస్థాపించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, నాయకులు మచ్చా శ్రీనివాసరెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్వోకు వినతి -
‘వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్’కి సాయిరెడ్డి ఎంపిక
పెదకూరపాడు:మండలంలోని 75 త్యాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి కె.హెమంత్ సాయిరెడ్డి జాతీయ స్థాయిలో జరిగే అరుదైన ‘వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్’ కార్యక్రమానికి ఎంపికై నట్లు హెచ్ఎం ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. హేమంత్ సాయిరెడ్డి హైదరాబాదులోని సీఎస్ ఐఆర్ పరిశోధన సంస్థలో ఈ నెల 21న ‘వన్ డే యాజ్ ఎ సైంటిస్ట్’ గా పాల్గొంటాడు. శాస్త్రవేత్తలతో పని చేయడం, వారికి సహాయకుడిగా ఉండడం, ముఖాముఖీ, ప్రయోగాలు, ప్రయోగశాల పర్యటన, జీవ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవకణ పరిశోధన వంటి అంశాలపై ప్రయోగ అనుభవం పొందడమే కాకుండా ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో మమేకం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారాలనే ప్రేరణనిచ్చే అవకాశం అవుతుంది. -
ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలి
ఎంఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాదిగ బాపట్ల: చిన్నగంజాం మండలం కడవకుదురు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ కూలీలను ఏర్పరచుకొని రూ. 26 లక్షల ఉపాధి నిధులు స్వాహా చేశాడని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాదిగ ఆరోపించారు. ఈమేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడ్‌కు వినతి పత్రం అందించారు. బినామీ కూలీలను ఏర్పటు చేసి ఉపాధి నిధులు దిగమింగిన ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో ఎంఎస్పీఎస్ రాష్ట్ర నాయకులు గద్దె త్యాగరాజు, కొలకలూరి విజయ్ కుమార్ మాదిగ, వంశీ మాదిగ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటికి చేదు అనుభవం నరసరావుపేట: నాదెండ్లలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు చేదు అనుభవం ఎదురైంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి గ్రామంలో నారాయణస్వామి మఠం ఏరియాలో పర్యటించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అధికారులు కొనుగోలు చేయకుండా, తక్కువ ధరతో రైతులను మోసగిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. నిబంధనల పేరిట పొగాకును తిరస్కరిస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అంతేకాక గ్రామంలో చోరీలు అధికంగా జరుగుతున్నాయని, ఇప్పటికే సుమారు 10కి పైగా బైకులు చోరీకి గురయ్యాయని ఆయన దృష్టికి తెచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామస్తులు సమస్యలను వివరిస్తుండగానే ఎమ్మెల్యే పుల్లారావు పట్టించుకోకుండా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
● డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ ● ప్రజల నుంచి అర్జీల స్వీకరణ బాపట్ల: బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్ అన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. పరిష్కరించి, న్యాయం చేయాలని అభ్యర్థించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని డీఆర్వో చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. సమస్య పరిష్కారం అయిన విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలుగులో ధ్రువీకరణ పత్రాన్ని ఫిర్యాదుదారులకు అందించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, ఉప కలెక్టర్ నాగిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినాయకునికి సంకటహర చతుర్ధి పూజలు అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో సోమవారం సంకటహరచతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాచర్ల మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై కేసు వెల్దుర్తి: మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్, మరో ఇద్దరిపై వెల్దుర్తి పోలీసు స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదయింది. 2022లో పార్టీ మారమని టీడీపీ నాయకుడు దారపునేని శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేసినట్లుగా కేసు నమోదయింది. దీనిపై దారపునేని ఆదివారం ఫిర్యాదు చేయగా కిషోర్‌తో పాటు మండలంలోని బోదిలవీడు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబురావులపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పలు అక్రమ కేసులతో కిషోర్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ, కక్షసాధింపులకు దిగిన కూటమి నేతలు మూడేళ్ల నాటి ఘటనను బూచిగా చూపి మరో అక్రమ కేసు నమోదు చేయించారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. రేపటి నుంచి శివాలయంలో పవిత్రోత్సవాలు పెదకాకాని: శివాలయంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి రాహుకేతువు పూజలు, నవగ్రహపూజలు, రుద్ర, చండీ హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, శాంతి కల్యాణాలతో పాటు అన్ని సేవలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. 19వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కై ంకర్యాలు, అన్ని ఆర్ణీత సేవలు, రాహుకేతు పూజలు, యథావిధిగా జరుగుతాయన్నారు. దేవస్థానంలో వాహనపూజలు, అన్నప్రాసనలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. -
భర్త మరణించినా..
బైటమంజులూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన పాలపర్తి వెంకటేశ్వర్లు ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫెనాన్స్ కంపెనీ వద్ద ఇల్లు తాకట్టు పెట్టి రూ. 3 లక్షల రుణం తీసుకున్నాడు. చేతికి రూ. 2.75 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇందుకుగాను నెలకు రూ. 7356 కిస్తీ చెల్లిస్తున్నాడు. మొత్తం 84 నెలలు కిస్తీ చెల్లించాల్సి ఉండగా, 36 నెలలు చెల్లించాడు. అయితే అతను మే నెల 29వ తేదీన గుండెపోటుతో మరణించాడు. కుటుంబ పోషణకు దికై ్కన వెంకటేశ్వర్లు మరణించడంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. భర్తపోయిన దుఖఃలో సీతమ్మ ఉండగా.. సదరు ప్రైవేటు ఫైనాన్స్వారు మీ భర్త చనిపోతే మాకేంటి..? మాకు కట్టాల్సిన కిస్తీలు కట్టాల్సిందేనని, లేకుంటే ఇల్లు వేలం వేస్తామంటు బెదిరింపులకు దిగారు. -
కొత్తపల్లిలో పోలీసు జులుం
మాచర్ల రూరల్: బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం జరగకుండా పోలీసులు అడ్డుకొని పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వైఎస్సార్ సీపీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఎలాగైనా అడ్డుకోవాలనే అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు కొత్తపల్లి గ్రామానికి చేరుకొని సభ జరగకుండా అడ్డుకున్నారు. గ్రామంలో నివాస గృహాల మధ్య సొంత స్థలంలో పార్టీ కార్యకర్తలు షామియానాలను ఏర్పాటు చేసుకొని సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవ్వగా విజయపురిసౌత్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సభా నిర్వహణకు అనుమతులు లేవని, ఎట్టి పరిస్థితిలో సమావేశం జరపటానికి వీలు లేదంటూ హుకూం జారీ చేశారు. దీనిపై అక్కడే ఉన్న కార్యకర్తలు, నాయకులు తమ సొంత స్థలంలో పార్టీ ప్రోగ్రాం చేసుకునేందుకు ప్రత్యేక అనుమతులు అవసరమా.. గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న టీడీపీవారు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి అనుమతులు పొందారని, ఇప్పుడు మమ్మల్ని ఇలా అడ్డుకునే ప్రయత్నాలు చేయటం ఎంత వరకు సబబని వారు ప్రశ్నించారు. అయినా పోలీసులు వినిపించుకోకుండా సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, ఇరువురిని అదుపులోకి తీసుకొని రూరల్ సర్కిల్ స్టేషన్‌కు తరలించారు. గౌతంరెడ్డిని అడ్డుకున్న పోలీసులు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కొత్తపల్లి గ్రామానికి వచ్చిన వైఎస్సార్ సీపీ పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సభా నిర్వహణకు అనుమతులు లేవని, మీరు గ్రామంలోనికి రావద్దంటూ ఆయన్ను కారులోనే నిలిపివేశారు. ఆయన తీవ్రంగా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలనను లోపాలను విమర్శించే హక్కును హరించడం బాగాలేదని.. కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించటం తగదంటూ సూచించారు. పోలీసులు అడ్డుకోవటంతో తిరిగి మాచర్లకు వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే.. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పార్టీ ప్రోగ్రాంని కొత్తపల్లి గ్రామంలో జరగకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాచర్ల నియోజకవర్గంలో పక్కాగా అమలు పరుస్తున్నారని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డి విమర్శించారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కొత్తపల్లి గ్రామంలో జరుపుతుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని సభను అడ్డుకోవటం దారుణమన్నారు. తమ సొంత స్థలంలో సభ జరుపుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ స్పష్టంగా అమలవుతుందని అర్ధమవుతుందన్నారు. ●పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియోజకవర్గానికి రాకుండా అడ్డుకుంటున్నారని, అతి త్వరలో పీఆర్కే ఆధ్వర్యంలో మాచర్ల నడిబొడ్డున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తామన్నారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ తదితరులున్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సభను అడ్డుకున్న పోలీసులు కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్న వైనం వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు గౌతంరెడ్డి అడ్డగింత -
కడతారా.. చస్తారా !
జే.పంగులూరు: ప్రైవేటు కంపెనీల వలలో పడి పేదల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. మండలంలోని 21 గ్రామాల్లోని దళిత కాలనీలే టార్గెట్‌గా, వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కంపెనీలు చెలరేగుతున్నాయి. ప్రైవేటు కంపెనీలలో రుణాలు ఇచ్చి వారి ఇళ్లను తాకట్టు పెడుతున్నారు. కట్టకుంటే జప్తు పేరుతో ఇళ్లకు సీల్ వేస్తున్నారు. ఇంటిపై స్వాధీనత ముద్ర బైటమంజులూరు గ్రామానికి చెందిన ఇంటూరి అనూక్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్నాడు. మూడు నెలల నుంచి కిస్తీ చెలించకపోవడంతో ఆ ఇంటి గోడపై ఈ ఇల్లు మా ఆధీనంలో ఉంది. దీనిపై హక్కులన్ని మావే, ఇల్లు కొనదలుచుకున్నవారు మమ్మల్ని సంప్రదించాలి అంటూ గోడపై ముద్ర వేశారు. ఇటీవల కాలంలో దళిత కాలనీకి చెందిన ఇద్దరు యువకులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అప్పు చెలించలేక ఆత్మహత్యయత్నం చేయగా స్థానికులు గుర్తించి వారిని రక్షించినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా.. బైటమంజులూరు గ్రామంలో పేదల జీవితాను ఫైనాన్స్ సంస్థలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 26 ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు తిరుగుతూ పేదలను ఆకర్షిస్తూ అప్పులిచ్చి, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీలు చెలించలేక పేదలు నానా యాతనలు పడుతున్నారు. కూలీ పనుల మీద ఆధారపడి జీవించే పేదలు నెలనెలా రూ.10వేలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో పేదల బతుకులు చిత్తు పేదలే టార్గెట్‌గా అప్పులు ఇస్తామని తిరుగుతున్న 26 ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం కిస్తీలు కట్టకుంటే ఇంటిపై స్వాధీనత బోర్డులు గతంలో ఆడవాళ్లను బయటికి లాగి ఇళ్లకు సీల్ వేసిన దుస్థితి కుటుంబ యజమాని చనిపోయినా బాకీ చెలించాల్సిందేనని పట్టు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు దళిత యువకులు -
ఇసుకప్పగింతలు
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి,బాపట్ల: చీరాల నియోజగవర్గంలోని చీరాల, వేటపాలెం రెండు మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ కావాల్సినంత ఇసుక లభ్యమవుతుండటంతో పచ్చనేత ప్రతిపాదన ఇసుకదందా నిర్వాహకులకు నచ్చింది. నెలకు రూ. 30 లక్షలు చెల్లించినా మంచి లాభాలే ఉంటాయని లెక్కలు వేసుకున్న పచ్చపార్టీకే చెందిన ఓ ఇసుక వ్యాపారితోపాటు చీరాల ప్రాంతానికి చెందిన మరొక పచ్చనేత కలిపి చీరాల పచ్చనేతకు నెలకు రూ. 30 లక్షలు చెల్లించేందుకు సై అన్నారు. అక్రమ రవాణాకు శ్రీకారం చీరాల ప్రాంతానికే చెందిన కొందరు పచ్చనేతలు నెలకు రూ.15 లక్షల వరకూ ఇస్తామని సదరు నేతకు ప్రతిపాదన పెట్టినా ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరిన ఇద్దరు పచ్చనేతలు రూ. 30 లక్షలు చెల్లిస్తామనడంతో చీరాల పచ్చనేత వారికే ఇసుక వ్యాపారం అప్పగించారు. అనుకున్నదే తడవుగా ఇసుక వ్యాపారులు ఆదివారం టెంకాయకొట్టి టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారు. తొలుత నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే పందిళ్లపల్లి, దేశాయి పేటలనుంచి ఇసుకను తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చీరాలనుంచి ఇప్పటికే నిత్యం ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఈ ప్రాంతం నుంచి బాపట్ల, చీరాల నియోజకవర్గాలతోపాటు పర్చూరు ప్రాంతానికి సైతం ఇసుకను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. కొత్తదందాతో ఇసుక అక్రమ వ్యాపారం మరింతగా పెరగనుంది. వాన్‌పిక్, అసైన్డ్, అటవీ భూముల్లోనూ.. చీరాల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతోంది. ఇక్కడి పచ్చనేతలు వాన్ పిక్ భూములనూ వదల్లేదు. ప్రభుత్వ, అసైన్డ్, అటవీ భూములనుంచీ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. ఇక ఉప్పుతో కూడిన ఇసుక అయినా తీరప్రాంతంలోని ఇసుకను రియల్ వెంచర్లు, పునాదులు పూడ్చడంతో పాటు ఇతర అవసరాలకు రేయింబవళ్లు తరలించి అమ్ముతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో తీరప్రాంతం గుంతలమయంగా మారుతోంది. సీఆర్‌జెడ్ నిబంధనలు ఉన్నా ఆ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఇసుక అక్రమ తరలింపుతో పందిళ్లపల్లి ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంతలోని పుల్లరిపాలెం ఎస్టీకాలనీ ప్రజలతోపాటు ఇతరులు పలుమార్లు జిల్లా కలెక్టర్ తోపాటు జాతీయ ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమీషన్ కోరినా అప్పట్లో వేటపాలెం మండల అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. జిల్లా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు చీరాల ప్రాంతంలో మళ్లీ ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.పందిళ్లపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న మాఫియా న్యూస్‌రీల్ చీరాలలో ఇసుక అమ్ముకునేందుకు పచ్చనేతకు ప్రతి నెలా అందనున్న పైకం నియోజకవర్గంలో జోరందుకున్న ఇసుక దందా ఆదివారం కొబ్బరికాయ కొట్టి ఇసుక తవ్వకాలు ప్రారంభించిన వేలంపాట నిర్వాహకుడు పందిళ్లపల్లి, దేశాయిపేట నుంచి ఇసుక తరలింపు సముద్ర తీరగ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో విక్రయం అధిక ధరలకు అమ్మకాలు అధికారులకు నెల మామూళ్లు ! భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు ప్రజల ఫిర్యాదులు పట్టించుకోని జిల్లా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు ఇదే పద్ధతిలో కొంతకాలం క్రితం చీరాల పచ్చనేతతో ఇసుక వ్యాపారి ఒప్పందం కుదుర్చుకొని ఒక నెల కప్పం రూ. 30 లక్షలు చెల్లించి ఇసుకను రేయింబవళ్లు తరలించారు. అయితే చీరాల ప్రాంతానికి చెందిన పచ్చ నేతలు అతనికి పోటీగా ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకున్నారు. ఇదే విషయాన్ని ఇసుక వ్యాపారి సదరు పచ్చనేత దృష్టిలో పెడితే అదంతా తనకు సంబంధం లేదని, వ్యవహారం మీరే చూసుకోవాలని చావుకబురు చల్లగా చెప్పారు. పందిళ్లపల్లి ప్రాంతానికి చెందిన కొందరు పచ్చనేతలు ఇసుక అక్రమ రవాణా మానుకోలేదు. వారి పోడు పడలేక ఇసుక వ్యాపారి ఈ వ్యాపారం తన కొద్దని చేతులెత్తి పచ్చనేతకు దండం పెట్టాడు. స్థానిక పచ్చనేతలు నెల మామూళ్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్రమ సంపాదన కోసం తహతహలాడే పచ్చనేత తిరిగి ఇసుక వ్యాపారం తెరపైకి తెచ్చారు. దీంతో మరోమారు ఇసుక వ్యాపారి చీరాల ఇసుక దందా నిర్వాహకుడితో కలిసి ఇసుక అక్రమ వ్యాపారానికి సిద్ధపడ్డారు. పచ్చనేత నుంచి వర్తమానం అందిందేమో ఇసుక అక్రమ రవాణా పెద్దస్థాయిలో మొదలైందని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. -
ఇప్పుడెలా.. గురూ!
చీరాల: ఏరు దాటిసి తెప్పతగలేసిన చందంగా కూటమి పాలన తలపిస్తోంది. విద్యాసంస్థల్లో హడావుడిగా, హంగు ఆర్భాటాలతో యోగాంధ్ర, మెగా పీటీఎం కార్యక్రమాలు నిర్వహించారు. అయితే నిర్వహణకు ఒక్క రూపాయి ఇవ్వకుండా స్కూల్ గ్రాంట్లలో 25శాతం వినియోగించి ఏర్పాట్లు చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చి సరిపెట్టారు. దీంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవాక్కయ్యారు. పాఠశాలల్లో గ్రాంట్లు అంతంతమా త్రంగా ఉండడం, జూనియర్ కళాశాలల్లో అసలు లేకపోవడంతో అప్పో, సొప్పో చేసి కార్యక్రమాలు జరిపించారు. రికార్డుల కోసం ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమం తమకు గుదిబండగా మారిందని ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాపోతున్నారు. జిల్లాలో 1432 పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాల, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణకు రూ.6 నుంచి రూ. 25 వేల వరకు ఖర్చయింది. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సమావేశాలు నిర్వహించగా, ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సైతం నిర్వహించారు. అప్పులతో తిప్పలు జిల్లాలో మొత్తం 17 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కళాశాలల్లో సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం స్నాక్స్, టీ, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వీటిన్నింటిని అధ్యాపకులే అప్పులు చేసి సమకూర్చారు. అలానే టెంట్లు, కుర్చీలు అద్దెకు తెచ్చుకున్నారు. ఒక్కో కళాశాలకు సుమారుగా రూ.25వేలు ఖర్చయింది. ఆ సొమ్మంతటినీ ప్రభుత్వం చెల్లించకపోతే తాము నష్టపోతామని వారు వాపోతున్నారు. స్కూల్ గ్రాంట్ వాడితే ఎలా ? మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును స్కూల్ గ్రాంట్స్‌ను నుంచి వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. అయితే సంవత్సరానికి స్కూల్లో వివిధ రకాల ఖర్చులకు అందించే నగదును ఇటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తే.. మరి మిగిలిన కార్యక్రమాలకు నిధులు ఎక్కడనుంచి తెచ్చి వినియోగించాలని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఏరు దాటాక తెప్పతగలేసిన కూటమి సర్కార్ మెగా పీటీఎంకు భారీ ఖర్చు గ్రాంట్లు లేక... రాక అప్పులు చేసి నిర్వహించిన విద్యాసంస్థలు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు -
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
తెనాలి రూరల్: దురలవాట్లకు బానిసలై జల్సాలకు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్న నలుగురును రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆర్. ఉమేష్ వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద గంజాయి విక్రేతలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ ఆనంద్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసినట్లు చెప్పారు. డెప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం వీఆర్వోల సమక్షంలో కఠెవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశరావు, పెదరావూరు పెదమాలపల్లెకి చెందిన దర్శి ప్రదీప్‌కుమార్, చినపరిమి రోడ్డులో ఉండే నలిగల శివ నాగరాజు, తెనాలి రైల్వే క్వార్టర్స్‌కు చెందిన మెరుగుమాల ప్రశాంత్కిరణ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా దురలవాట్లకు బానిసలైనట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేలు నుంచి రూ 5వేలు, రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వేస్టేషన్, తెనాలి పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ఇమ్మానుయేలుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. గత రెండు నెలల్లో గంజాయి కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ కె. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుళ్లు డి. రవి, బీహెచ్. సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, ఓంకార్ కపూర్ నాయక్ పాల్గొన్నారు. -
రెండు బైక్‌లు ఢీ.. ఇరువురికి గాయాలు
బల్లికురవ: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనటంతో ఇరువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం మండలంలోని అంబడిపూడి –కొమ్మినేని వారిపాలెం లింకురోడ్డులో జరిగింది. కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన కాకుమాను అరుణ్‌కుమార్ పని నిమిత్తం బైకు బల్లికురవ వెళుతున్నాడు. సోమవరప్పాడు గ్రామానికి చెందిన గుజ్జులైని శ్రీనివాసరావు బైకుపై కొమ్మినేని వారిపాలెం వెళుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. స్థానికులు బల్లికురవ 108కి సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ అశోక్ ప్రథమ చికిత్స తదుపరి క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పటం వడ్డేశ్వరం పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద బట్టల సంచి మాత్రమే కనిపించిందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుడు శరీరంపై బ్లూ కలర్ ఫ్యాంటు, లైట్ బ్లూ, పసుపు తెలుపు రంగు నిలువు చారల చొక్కా ధరించి ఉన్నాడని, మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, రెండు రోజుల నుండి ఇప్పటం వడ్డేశ్వరం ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బైక్ అదుపు తప్పి యువకుడు మృతి మేదరమెట్ల (అద్దంకి రూరల్): అధికవేగంతో వెళుతున్న యువకుడు బైకు అదుపుతప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మేదరమెట్ల పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మండలంలో కోరిశపాడు గ్రామానికి చెందిన పాలేటి రాజేష్(22) ఒంగోలు వైపు నుంచి కొరిశపాడు వస్తుండగా తమ్మవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అధిక వేగంతో వచ్చి అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
క్రీడాకారులకు ఆర్థోస్కోపీతో ఉపశమనం
గుంటూరుమెడికల్: ఆటలు ఆడే సమయంలో పలువురు గాయపడుతుంటారని, గాయాల ద్వారా క్రీడాలకు దూరంగా కాకుండా ఆర్థోస్కోపీతో వారికి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ అన్నారు. గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్, గుంటూరు ఆర్ర్ధోస్కోపీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో ఆర్ర్ధోస్కోపీ కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ స్పోర్ట్స్ పర్సన్‌కు గాయాలు ఎక్కువగా అవుతాయని చెప్పారు. కీడ్రల్లో యువత ఎక్కువగా భాగస్వాములుగా ఉంటారన్నారు. ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా గాయాల నుంచి కోలుకుని ఉద్యోగాలు చేసుకోవటానికి, తిరిగి ఆటలు ఆడటానికి ఆర్థోస్కోపీ సర్జరీలు ఎంతో ఉపయోగపతాయని వివరించారు. ఈ సర్జరీతో క్రీడాగాయాలైన వారు త్వరగా కోలుకుంటారని, త్వరగా నడుస్తారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థోస్కోపీ మెడికల్ టూరిజం అభివృద్ధి చెందాలని కోరారు. గుంటూరు మెడికల్ హబ్ అవుతుందని వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలోని సంకల్ప హాస్పిటల్లో యువ వైద్యులకు, జూనియర్ వైద్యులకు, ప్రాక్టీస్‌లో ఆసక్తి ఉన్నవారికి షోల్డర్ అండ్ నీ లైవ్ సర్జరీలు లైవ్‌లో నాలుగు చేసి చూపించారు. షోల్డర్ అండ్ నీ సంకల్ప హాస్పిటల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ ఆర్థోస్కోపీ సర్జన్స్ నాలుగు లైవ్ సర్జరీలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 మంది యువవైద్యులు హాజరైనట్లు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శివ కుమార్ మామిళ్ళపల్లి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చైతన్య ఘంటా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఆర్థోస్కోపీ నిపుణులు లైవ్ సర్జరీలు నిర్వహించడమే కాకుండా వర్క్ షాప్ కూడా నిర్వహించారన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ -
ధూర్జటిది విశిష్ట స్థానం
వారణాశి రఘురామ శర్మ అద్దంకి: అష్ట దిగ్గజాల్లో ధూర్జటిది విశిష్ట స్థానమని వారణాశి రఘురామశ శర్మ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కమఠ్వేర స్వామి దేవస్థానంలో సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన వహించారు. మలాది శ్రీనివాసరావు జ్యోతిప్రజ్వలన చేశారు. ‘ధూర్జటి మహాకవి భక్తితత్త్వం’ అనే అంశంపైన శ్రీ వారణాశి రఘురామశర్మ ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ‘రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని నాటి రాజులను ఈసడిరచుకున్న కవిరాజు ధూర్జటి అని చెప్పారు. సాలీడు, పాము, ఏనుగు, తిన్నడు.. శివుని సేవించి మోక్షం పొందిన కథలను రసరమ్యంగా శ్రీ కాళహస్తీశ్వరమహాత్మ్య కావ్యంలో ధూర్జటి ఆవిష్కరించారన్నారు. ఆ పద్యాలన్నీ ధూర్జటి హృదయాన్ని ఆవిష్కరిస్తాయని, అతని ఉన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని శర్మ పేర్కొన్నారు. రోటరీ తాజా మాజీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి సుధాకరరావు, శ్రీ మలాది శ్రీనివాసరావులను, అసిస్టెంట్ గవర్నర్‌గా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన షేక్ మహమ్మద్ రఫీని సత్కరించారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి రోటరీక్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి కార్యవర్గంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గాన్ని సత్కరించారు. కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రఫీ సభాహ్వానం చేయగా అద్దంకి లేవిప్రసాద్ వందన సమర్పణతో సభ ముగిసింది. కార్యక్రమంలో యు.దేవపాలన, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), గాడేపల్లి దివాకర దత్, కె.అనిలకుమారసూరి, సంకా సుబ్రహ్మణ్యం(బాబు), అనంతు నాగేశ్వరరావు, అద్దంకి లేవిప్రసాద్, లక్కరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నిక
లక్ష్మీపురం: ఉమ్మడి గుంటూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా ఓలేటి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్. విజయలక్ష్మి, ఎం.షణ్ముఖ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కార్తిక్, కార్యాలయ కార్యదర్శిగా వి.కల్యాణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్. సరళబాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు నియమితులైనట్లు ఎన్నికల అధికారి బాపట్ల గోపాల కృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారి దేవరపల్లి జగన్నాథం ప్రకటించారు. గుంటూరులోని జిన్నాటవర్ సెంటర్లో ఉన్న వసుంధర కాంప్లెక్స్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మరో ఐదు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావులపాటి శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఉమ్మడి గుంటూరు జిల్లాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా ఓలేటి రమేష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం -
సీపీఎం నేతపై టీడీపీ వర్గీయుల దాడి హేయం
నరసరావుపేట: క్రోసూరు మండలం దొడ్లేరు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం పోగొట్టుకున్న బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తున్న సీపీఎం నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు(బంగారం వ్యాపారులు)లను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు వైఖరి, పోలీసుల తీరును ఖండిస్తూ కరపత్రం ఆవిష్కరించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ పీడిత వర్గ ప్రజల పక్షాన నిలిచి నిస్వార్థంగా పోరాటాలు చేస్తున్న నాయకులపై అధికార పార్టీ వర్గీయులు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే మొఘల్ జాన్‌ను మండల అధ్యక్ష స్థానం నుంచి తప్పించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రైతులు తనఖా పెట్టిన బంగారం గోల్మాల్ కావడంలో అప్రైజర్ నాగార్జునతో దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల హస్తం ఉందని అందుకే పోరాటాన్ని నీరుగార్చేందుకు దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై తమ పార్టీ రెండేళ్ల్ల పోరాటం ఫలితంగా 400 మంది బాధితులకు న్యాయం జరిగిందని, మిగిలిన 140 బాధితులకు న్యాయంచేయాలని పోరాటం చేస్తున్న క్రమంలో టీడీపీ నాయకులు దాడికి పాల్పడడం పోలీసులు వారికే వత్తాసు పలకడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ నెల 10న బ్యాంక్‌కు తాళంవేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగగా డీఎస్పీ వచ్చి మాట్లాడతారని ఆందోళన విరమించాలని ఎస్ఐ రవికుమార్ చెప్పడంతో ఆందోళన విరమించారన్నారు. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన తిమ్మిశెట్టి హనుమంతరావుపై అదేరోజు టీడీపీ మండల అధ్యక్షులు మొఘల్ జాన్, సోదరుడు సమీర్లు దారికాచి దాడికి పాల్పడగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. క్రోసూరు మండలంలోని పేద ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి హనుమంతరావు కృషిచేయడాన్ని అధికార పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, బాధితునికి రక్షణ కల్పించకుంటే ఆందోళన చేపడతామన్నారు. బాధిత నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావు, నాయకులు డి.శివకుమారి, జి.మల్లీశ్వరి, జి.ఉమశ్రీ, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, ఏపూరి గోపాలరావు, పెద్దిరాజు, తెలకపల్లి శీను, హరి పోతురాజు, బాలకృష్ణ, సిలార్ మసూద్, పి వెంకటేశ్వర్లు, లక్ష్మీశ్వరరెడ్డి, హరిపోతురాజు, రాధాకృష్ణ, రవిబాబు పాల్గొన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయాలి బంగారం పోగొట్టుకున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ -
ప్రజా కళలతోనే సామాజిక చైతన్యం
తెనాలి: కళలు జనజీవన స్రవంతిలో భాగమని ప్రజాకళలతోనే దోపిడీ వ్యవస్థను ఎదరించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావొచ్చని, అలాంటి కళారూపాలను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగనున్నాయని తెలిపారు. తొలిరోజున జరిగే ప్రదర్శనలో వెయ్యిమంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో కళారూపాలతో కళాకారులు పాల్గొనాలని అన్నారు. సభాధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ ప్రజానాట్యమండలికి, కళాకారులకు తెనాలి పుట్టినిల్లుగా చెప్పారు. గుంటూరు జిల్లా నుండి 100 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు. సీనియర్ కళాకారుడు, సమన్వయకర్త కనపర్తి బెన్హర్ మాట్లాడుతూ తెనాలి నుండి ‘పోస్టర్’ నాటికతో ఒంగోలులో జరిగే కళాప్రదర్శనలో పాల్గొంటామని చెప్పారు. ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు, నీలాంబరం, మల్లికార్జునరావు, రచయిత దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.రామకృష్ణ -
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు
సత్తెనపల్లి: రాష్ట్రంలో ఏడాది నుంచి రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. కారును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై దాడి చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ మహిళలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అయ్యాయనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోకడ ఎమర్జెన్సీని తలపిస్తోందని, మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడిచేయడం దారుణమని ఖండించారు. ఒక మహిళ హోం మంత్రి అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు దాచేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఆదివారం ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు కనీస రక్షణ ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా ప్రజాప్రతినిధులను మానసికంగా వేధించి, భౌతిక దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని రేవతి మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ ఎక్కడ ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. టీడీపీ గూండాలు హారికపై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన ఆమె పిలుపునిచ్చారు. బీసీ మహిళ అయినా హారికపై దాడికి హోంమంత్రి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రేవతి డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి అమానుషం చిలకలూరిపేట: బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై రాళ్లు, కర్రలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడడం అమానుషమని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వెళుతుండగా కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో దాడికి పాల్పడడాన్ని ఖండించారు. ప్రభుత్వ తీరును సభ్య సమాజం తీవ్రంగా అసహ్యించుంకుంటున్నదని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు వ్యవహరించటం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రశ్నించటం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివని, వాటిని కాలరాయాలని చూస్తే తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మహిళ నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు
తెనాలి: స్థానిక నాజర్పేటకకు చెందిన తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్, భారతీయ మజ్దూర్ సంఘ్ జోనల్ నాయకుడు టీవీ రమణ మాతృమూర్తి సీతాదేవి (80) ఆదివారం మృతిచెందారు. ఆమె కోరిక ప్రకారం నేత్రదానానికి సమాచారం పంపారు. సంబంధిత సంస్థ ప్రతినిధులు అరవింద, కృష్ణమోహన్ వచ్చి, ఆమె నేత్రాలను సేకరించి పంపారు. చీకటి ప్రపంచం నుండి ఇద్దరు రేపటి వెలుగులను చూస్తారనే విషయం తమకు ఎంతో ఆనందంగా ఉందని టీవీ రమణ అన్నారు. హిందూ చైతన్య వేదిక, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీతాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేత్రదానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మంత్రి ప్రకటనలో స్పష్టత లేదు లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్‌వాటర్ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్ప డినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూని యన్ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీని వాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్ విభాగం నాయకులు యా సిర్ ఖాన్, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్, సురేష్, లీక్ వర్కర్లు పాల్గొన్నారు. -
రాజ్యాంగంపై దాడి చేస్తారా?
చీరాల రూరల్: దేశంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో సెక్యులర్, సోషలిస్టు అనే పదాలు పొందుపరచారని వాటిని తొలగిస్తే రాజ్యాంగంపై దాడిచేసినట్టేనని విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్‌కుమార్ అన్నారు. ఏపీ ఊరూరా జనవిజ్ఞానం, వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్‌కుమార్, ఊరూరా జనవిజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన దేశభక్తి, ప్రజాస్వామ్యం, సామాజిక స్పృహ, లౌకిక భావాలు, సమసమాజ నిర్మాణం, శాసీ్త్రయ ఆలోచన, గణతంత్ర రాజ్యం, సామాజానికి న్యాయం, సామాజిక సంస్కరణ అనే ఈ పది అంశాలపై ప్రజల్లో విస్త్రృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో కూడా ఆటోచనా ధోరణి పెంపొందించుటకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరపాలని నిర్ణయించారు. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. అనంతరం వినయ్ రాజ్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గాదె హరిహరరావు, వై.రవికుమార్, టి.అంకయ్య, నాగమనోహర్ లోహియ, ఎం.మణిబాబు, ఎస్కే సుభాని, జి.జోజిబాబు, జిలాని పాల్గొన్నారు. -
అంధకారంలో బాపట్ల పట్టణం
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. పురపాలక సంఘంలో విద్యుత్తు, తాగునీరు ఇతర ఇంజినీరింగ్ విభాగాలలో సేవలు నిలిచిపోయాయి. పట్టణం అంధకారంలోకి వెళ్లిపోయింది. కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో బైఠాయించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విధుల్లోకి హాజరయ్యేది లేదని మొండికేసి కూర్చున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మజుందర్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగించలేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. కార్మికుల సమ్మెతో పట్టణంలో ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు వంటి విధులకు విఘాతం కలిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శిబిరంలో సీఐటీయూ నాయకులు శరత్, జిల్లా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, వెంకటేశ్వర రెడ్డి, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ పాల్గొన్నారు. -
బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామ దేవత బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారు విజయేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించారు. పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. ఆషాఢమాసం కావటంతో మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాడరేవు తీరంలో పర్యాటకుల సందడి చీరాల టౌన్: మండలంలోని వాడరేవు సముద్ర తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం కావడంతో చీరాల, పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చారు. ఆటలాడుకుంటూ కేరింతలు కొట్టారు. సముద్రంలో స్నానాలు ఆచరించారు. తీరం ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామికి, గ్రామంలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం నరసరావుపేట ఈస్ట్: పులుపుల వారి వీధిలోని శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన స్మార్ట్ కిడ్స్ ఇన్నోవేషన్స్ సంస్థ అధినేత గర్నీ సురేష్ ఈ మొత్తం అందించారు. ఆలయ రాతి నిర్మాణంలో భాగంగా 10వ రాతి స్తంభం నిర్మాణానికి వినియోగించాలని కోరారు. ఆలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విరాళాన్ని మున్నలూరి సత్యనారాయణ ద్వారా కమిటీ ప్రతినిధులకు అందచేశారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పులుపుల రాము, వనమా కృష్ణ, కోవూరి శివ శ్రీనుబాబు, గజవల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. వివాదాస్పద పీఈటీపై విచారణకు ఆదేశం పెదకాకాని: వివాదాస్పద వ్యాయామోపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఇటీవల నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాలకు పీఈటీగా మస్తాన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆ సమయంలో తన రూం నుంచి ఎన్సీసీ విద్యార్థుల దుస్తులు, వారి అకౌంట్లో నగదు డ్రా చేయించడం, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయానికి తులాభారం బహూకరణ పెదకాకాని: శివాలయం అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని డీసీ గోగినేని లీలాకుమార్ అన్నారు. శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి పెదకాకాని గ్రామానికి చెందిన శివకోటి సాంబశివరావు, రోజా దంపతులు ఆదివారం శివకోటి రామారావు ధర్మపత్ని పద్మావతి పేరు మీద దేవస్థానానికి రూ.40,000 విలువచేసే స్టీల్ తులాభారం (కాటా) సమర్పించినట్లు డీసీ తెలిపారు. -
గెలిపించిన మాకు విలువ ఇవ్వరా?
గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం.. పార్టీ గెలిచిన నాటి నుంచి మమ్మల్ని ఆలకించినోళ్లు లేరు’’ అంటూ టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆదివారం బూర్ల పర్యటిస్తున్న ఆయనకు మహిళలు మాటల తూటాలతో చుక్కలు చూపించారు. వీవోఏ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి సహకరించడం ఏమిటని ఆయన్ను ప్రశ్నించారు. కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకునే వారు గానీ ఆలకించే వారు గానీ లేరని ఆగ్రహించారు. తాము పార్టీలో వాళ్లమా కాదా అనేది ఇప్పుడు ఊర్లో అందరి మధ్యా చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని గెలిపించుకుని సంవత్సరం అవుతుందని, ఏరోజైనా తమను పట్టించుకున్నారా? అని ఫైర్ అయ్యారు. అరిస్తే నేను బెదిరే వాడిని కాదు దీనికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘అది మీ ఊరి సమస్య మీరే తేల్చుకోవాలంటూ సమాధానం ఇవ్వగా.. మరి మా ఊరు సమస్య అన్నప్పుడు నువ్వు ఓట్లకి ఎందుకొచ్చావ్ అప్పుడు ?’’ అంటూ మహిళలు ఎదురు ప్రశ్నించారు. ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘నాకు చాలా ఓర్పు ఉంది.. సాయంత్రం వరకు ఉండే ఓపిక ఉందని, వచ్చినప్పుడు అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను!’’ అంటూ మహిళలకు వేలు చూపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరనం తమకు లేదని మహిళలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడి అవినీతికి పాల్పడిన వీవోఏ వివరాలను నమోదు చేసుకున్నారు. వారం రోజుల్లో విచారణ చేయించి, అవినీతి నిరూపణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహిళలు శాంతించారు. తొలి అడుగులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులును నిలదీసిన టీడీపీ మహిళలు -
పేరుకే పొత్తు.. పదవులిస్తే ఒట్టు!
నరసరావుపేట: నియోజకవర్గంలోని కో ఆపరేటివ్ సొసైటీల అధ్యక్షుల నియామకంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని మరిచింది. మొత్తం తొమ్మిది సొసైటీ చైర్మన్ పదవులలో ఒక్కటి కూడా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలకు ఇవ్వలేదు. తమ పార్టీ వర్గీయులకే కట్టబెట్టుకుంది. దీనిపై జనసేన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. బయటపడి ప్రశ్నించిన వారిని పార్టీ అధినేత సస్పెండ్ చేస్తుండటంతో నేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య కొరవడిన సఖ్యత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య సఖ్యత ఎప్పుడూ కనిపించలేదు. బీజేపీ తరఫున రంగిశెట్టి రామకృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... ఆయనతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. జనసేన వర్గీయుల పరిస్థితి కూడా అదే. ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు ఒక్క ఎంపీ కార్యక్రమాలకు తప్పితే మరెక్కడా పాల్గొనటం లేదు. ఏ పని ఉన్నా ఆయన వద్దకే వెళుతున్నారు. స్థానిక టీడీపీ ముఖ్యనేత జనసేన కార్యాలయానికి వెళ్లి మాట్లాడి వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. కార్యకర్తల స్థాయిలో ఒకరిద్దరు తప్పితే ఎవరూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. బీసీ వర్గానికీ ఒక్కటీ లేదు... టీడీపీ వారు మాత్రం ఏ కార్యక్రమం తలపెట్టినా కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తీరా పదవులు పందేరం విషయంలో మాత్రం పొత్తు ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు సామాజిక న్యాయానికి పాతరేశారని విమర్శలు వస్తున్నాయి. మొత్తం తొమ్మదింటిలో ఏడు సొసైటీలకు టీడీపీకి కొమ్ము కాసే ప్రధాన సామాజికవర్గానికి కేటాయించగా, మిగతా రెండూ ఇతర కులాలకు దక్కాయి. సామాజిక న్యాయం పాటించకుండా మొత్తం తొమ్మిది సొసైటీలు ఓసీలకే అప్పగించారు. బడుగు, బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గీయులకు ఒక్కటీ దక్కలేదు. తమకు తొలి నుంచి కనీస ప్రాధాన్యత కూడా దక్కడం లేదనే ఆవేదనలో అటు జనసైనికులు, ఇటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పై స్థాయిలో తమ ప్రయోజనాల కోసం కనీసం పట్టించుకోకపోవడంతోనే తమను పదవుల పంపకం సహా అన్నింటా తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. బాధ్యతలు స్వీకరించింది వీరే... నూతనంగా నియమితులైన చైర్మన్లు, మెంబర్లకు శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్లుగా కన్యధారరాజు (లింగంగుంట్ల), యర్రం రాంబాబు (జొన్నల గడ్డ), కొల్లి వెంకటేశ్వర్లు (ఇక్కుర్రు), జల్లిపల్లి శేషమ్మ (విప్పర్ల),పొనుగోటి శ్రీనివాస రావు (సంతగుడి పాడు), సూరాబత్తుల రామారావు (బుచ్చిపాపన పాలెం), పల్లెల వెంకట రత్నారెడ్డి (రొంపిచర్ల), కుందేటి రామబ్రహ్మం (అన్నవరం), ఇంటూరి వెంకట ప్రసాద్ (సుబ్బయ్య పాలెం) స్వీకరించారు. వీరిలో కొంతమంది ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ కార్యాలయానికే రాలేదని, కానీ పదవులు మాత్రం దక్కాయని చెబుతున్నారు. పదవులు అన్ని పార్టీలకు సమానంగా ఇవ్వాలనే నిబంధనను టీడీపీ గాలికి వదిలేసిందని పలువురు విమర్శిస్తున్నారు. కూటమిలో పొత్తు ధర్మం పాటించని టీడీపీ ఏకపక్షంగా సహకార సొసైటీ చైర్మన్ల నియామకం జనసేన, బీజేపీ వర్గీయులకు దక్కని పదవులు ఒక్క కులానికే ‘పచ్చ’ పార్టీ అత్యధిక ప్రాధాన్యం -
భక్తులతో కిటకిటలాడిన నృసింహుని ఆలయం
మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు. దిగువ సన్నిధిలో నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగువ సన్నిధి నుంచి ఆటోలో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులను మధ్యలోనే పోలీసులు ఆపేశారు. -
కాసుల కక్కుర్తి.. నాణ్యత నాస్తి
రేపల్లె: ప్రధాన పంట, మురుగు కాలువల మరమ్మతులకు ప్రభుత్వం కేటాయించిన నిధులు నామమాత్రపు పనులతో కూటమి నాయకుల జేబులు నింపుతున్నాయి. కూటమి నేతలే గుత్తేదారుల అవతారమెత్తి పనులు చేజిక్కించుకుని అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట కాల్వలకు తూతూ మంత్రంగా మరమ్మతులు నిర్వహించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పది రోజులైనా ఆ పనులు ప్రజలకు ఉపయోగపడలేదు. కూటమి నేతలే కాంట్రాక్టర్లుగా... కృష్ణా డెల్టా పరిధిలోని తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని మేజర్, మైనర్ పంట కాల్వల అభివృద్ధి, పూడికతీతకు ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో మూడు నియోజకవర్గాల పరిధిలోని కాల్వలలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడను తీయిస్తూ... కాలువలను బాగు చేయించటం, బలహీనంగా ఉన్న కట్టలను బలోపేతం చేయడం వంటి పనులను చేయిస్తున్నారు. ఆయా పనులకు సంబంధించి బాధ్యతలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అప్పజెప్పటంతో నాసిరకంగా నిర్వహించారు. ప్రజాధనం కొల్లగొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపల్లె నియోజకవర్గంలోని అరవపల్లి మెయిన్ కెనాల్ పంట కాలువ లాకుల వద్ద 10 రోజుల క్రితం కట్టను బలపరిచారు. వెదురు బద్దలు ఏర్పాటు చేసి ఇసుక బస్తాలను అడ్డుపెట్టి మమ అనిపించారు. వారం క్రితం కెనాల్‌కు కొద్దిపాటి నీరు రావటంతో అరవపల్లి వద్ద ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. పూర్తిస్థాయిలో నీరు రాకముందే చేసిన అభివృద్ధి నీటిపాలవ్వటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. బలహీన పడిన కట్టలను బలపరచాలని కోరుతున్నారు. ఇంకా పనులు చేయాల్సినవి.. రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఉన్న ఆర్ఎం డ్రెయిన్ , బీఎం డ్రెయిన్ , జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడమూరుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్కోర్స్, అరవపల్లి మెయిన్ కెనాల్ ఉన్నాయి. ఈ పంట కాల్వలలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్తాచెదారాలతో పూడుకుపోయాయి. ఈ కాలువల ద్వారానే పంట పొలాల నుంచి వర్షపు నీరు బయటకు పోవాల్సి ఉంటుంది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 34,060 హెక్టారులలో ఖరీఫ్‌లో వరి సాగు అవుతోంది. ఈ సాగు భూముల్లోని వృథా నీరుతోపాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో వర్షపునీరు ఈ కాలువల ద్వారానే బయటకు వెళ్లాలి. ఇందులో భాగంగా చేపట్టిన తొలి విడత పనుల్లోనే కూటమి నేతల కాసుల కక్కుర్తికి పనులన్నీ వృథా అయ్యాయి. అరవపల్లి వద్ద కెనాల్లో నీటి ఉద్ధృతికి కోసుకుపోయిన కాల్వ కట్ట ఆ పనులు మళ్లీ చేయిస్తాం కాలువల మరమ్మతులలో భాగంగా అరవపల్లి కెనాల్లో లాకుల వద్ద బలపరిచిన కట్టలు నీటి ఒరవడికి కోసుకుపోవటాన్ని పరిశీలించాం. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. మళ్లీ కట్టలు పటిష్ఠం చేయాలని ఆదేశించాం. మరమ్మతులను దగ్గరుండి పర్యవేక్షిస్తాం. నాణ్యతాలోపాలు లేకుండా చూస్తాం. – దీనదయాళ్, డీఈ, ఇరిగేషన్ శాఖ, రేపల్లె కాలువ మరమ్మతులు, అభివృద్ధి పనులలో నాణ్యతాలోపాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారుల ఇష్టారాజ్యం -
రక్షణ.. ఆమడదూరం
బాపట్ల: సముద్ర తీరంలో రక్షణ కవచంలా ఉన్న మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. తీరం కోతకు గురికాకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడే మడ అడవులు నానాటికీ కనుమరుగు అవుతున్నాయి. అటవీశాఖ ఈ మడ అడవుల అభివృద్ధిని గాలికి వదిలేసింది. రాష్ట్రంలో 973 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో కనీసం పట్టుమని 500 ఎకరాల్లో కూడా మడ అడవులు లేకపోవటం గమనార్హం. జీవరాశులపైనా ప్రభావం సూర్యలంక సముద్ర తీరంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన డ్రైనేజీలు కలుస్తాయి. వాటికి అనుసంధానంగా ఉండే ఏటి పరివాహక ప్రాంతాల్లో సముద్రపు పోటు నీటితో బతికే మడ అడవులు ఎన్నో జీవరాశు లకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇవి అంతరించిపోవటంతో పలు జీవరాశుల్లో కొన్ని కనుమరుగు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలైన తుపాన్లు, సునామీలు సంభవిస్తే ఆ ప్రభావం జనావాసాలపై పడకుండా మడ అడవులు తీర రక్షణ గోడగా నిలుస్తున్నాయి. యథేచ్ఛగా రొయ్యల చెరువుల ఏర్పాటు తీర ప్రాంత గ్రామాలకు మేలు చేసే వీటిని పరిరక్షించాల్సిన అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైగా మడ అడవులను నరికేసి అన్యాక్రాంతం చేసుకున్న తీరంలో రొయ్యల చెరువులు ఏర్పాటవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. మడ అడవుల పెంపకం సంగతి పక్కన పెడితే.. ఉన్నవాటిని తొలగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సముద్ర తీరంలో జీవరాశులకు ఊతంగా నిలిచే అడవులు అంతరిస్తే ఆ ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై పడే ప్రమాదం ఉంది. అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం అవుతోంది. శ్రీకాకుళం మొదలు నెల్లూరు జిల్లా వరకు విస్తరించిన ఈ అడవుల రక్షణ, అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది. -
ఆశల సాగుకు శ్రీకారం
బాపట్ల : గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బాపట్లలో వాతావరణం అనుకూలంగా మారడంతో పుడమి తల్లి సేద తీరింది. మట్టిని నమ్ముకొని జీవనం సాగించే కర్షకులను సాగుకు స్వాగతం పలికారు. ఈ ఏడాది సాగు కష్టతరమే అనుకున్న అన్నదాతల ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. ఓ వైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ అన్నదాతలు మాత్రం ససాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. గట్లు వేసుకోవడం, వాటిని చదును చేసుకోవడం, ఎరువులు చిమ్మడం, విత్తనాలు చల్లుకునే పనుల్లో మునిగారు. నిన్నటి వరకు బీడు భూములను తలపించేలా ఉన్న పొలాలను సైతం సాగు సిద్ధం చేస్తున్నారు. అందరి చూపు ఈ రకాల వైపే.. బాపట్ల నియోజకవర్గంలో ఖరీఫ్‌లో సాధారణంగా 24,500 హెక్టార్లు సాగు చేయాల్సి ఉంది. ప్రతి ఏడాది సుమారు మూడు వంతుల మేర బీపీటీ 5204 (సాంబ మసూరి), నెంబర్లు రకాలైన 523, 92, ఎన్‌ఎల్‌ఆర్ 28523 (శ్రీరంగ) సాగు చేపట్టేవారు. ఇసుక నేలల్లోని ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసే వారు మాత్రమే ఎన్‌ఎల్‌ఆర్ 145 వైపు మొగ్గు చూపేవారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. అసలు సాగుకే దూరమైన ఆయకట్టు శివారు ప్రాంతాల్లోని రైతులు ఈ సారి రూటు మార్చే పనిలో ఉన్నారు. మున్ముందు వర్షాలు ఉంటాయో... లేవోనన్న భయంతో ఎక్కువకాలం ఉండే రకాలను సాగుచేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే ఎన్‌ఎల్‌ఆర్ 145, బీపీటీ 5204 రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. నీటి సౌకర్యం ఉండి, బోర్లు ద్వారా అయినా సాగు చేయగలమనుకునే రైతులు మాత్రమే ఎక్కువ కాలం పట్టే రకాల వైపు చూస్తున్నారు. వెద పద్ధతే మేలంటున్న యంత్రాంగం ప్రస్తుత పరిస్థితుల్లో నార్లు పోసుకొని 25 రోజుల తర్వాత నార్లు పీకి మళ్లీ నాట్లు వేసుకునే కంటే వెద పద్ధతి మేలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాగు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఇలా చేస్తే పైరు నీటి ఎద్దడిని తట్టుకోవడంతోపాటు తక్కువ కాలంలోనే పంట చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. నారు పెంచడం, దమ్ము చేయటం, నాటు వేయించడం వంటివి కలుపుకొని ఎకరాకు సుమారు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం భూమిలో సరిపడా తేమ శాతం ఉంటుంది కాబట్టి మొక్క త్వరితగతిన బతికే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు కారణమైన మీథేన్, నైట్రస్ ఆకై ్సడ్ వాయువులు ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని, తద్వారా వాతావరణంలో కలిగే ప్రతికూల మార్పులను కూడా వెద సాగు తట్టుకుంటుందని వివరించారు. ఇన్నాళ్లు దాగుడు మూతలాడిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. చెరువులు... కాలువలకు జలకళ వచ్చింది. పదునెక్కిన భూములను చూసి సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. వరుస వర్షాలకు పదునెక్కిన భూములు బాపట్ల నియోజకవర్గంలో రైతులు హర్షం సాగు పనులకు సిద్ధమైన అన్నదాతలు -
సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నగరం మండలం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వీరాస్వామి పిల్లలు రేష్మా 13 సంవత్సరాలు (8వ తరగతి,) హారిక 11 సంవత్సరాలు (7వ తరగతి) గూడవల్లి భారతి పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో రేష్మాకు 22 సంవత్సరాలు(జాబ్‌కార్డు నంబర్ 100075), భారతికి 21 సంవత్సరాలు (జాబ్‌కార్డు నంబర్ 100076) వయస్సు వేసి జాబ్‌కార్డులు పుట్టించి మైనర్లుగా ఉన్న వారిపేరున పోస్టాఫీసులో ఖాతాలు తెరిచి కాలువ పనులు చేసినట్లు నగదును ఖాతాలకు మళ్లించారు. వీరా స్వామి తమ్ముడు కిషోర్ కుమార్తె లక్ష్మి మైనర్కాగా ఆమెకు 21 సంవత్సరాల వయస్సు చూపించి( జాబ్‌కార్డు నంబర్ 100079) పేరున అదే పోస్టాఫీసులో ఖాతా తెరిచి పనులు చేసినట్లు డబ్బులు డ్రా చేశారు. చరణ్ (జాబ్‌కార్డు నంబర్ 100071)అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి కాగా ఇక్కడ జాబ్‌కార్డు పుట్టించి నెల రోజులపాటు ఆయన ఖాతాలోకి డబ్బులు మళ్లించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క నగరం మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో ఫేక్ మస్టర్ల జాబితా చాంతాడంత. పచ్చనేతలు, సీనియర్ మేట్లు కలిసి ఉపాధిలో అక్రమాలకు తెగబడగా డ్వామా అధికారులు వాటాలు పుచ్చుకొని వారి అవినీతికి వెన్నుదన్నుగా నిలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పచ్చ నేతలకు ఉపాధిగా మారింది.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో పచ్చపార్టీ నేతలు అక్రమాలకు అడ్డాగా మార్చారు. పనులు చేసిన పేదలకు సరైన కూలీ కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఆ సంగతి గాలికి వదలి పనికి హాజరుకాని వారిని పనులకు వచ్చినట్లు మస్టర్లో చూపించి డబ్బులు కొట్టేస్తున్నారు. చేసిన పని మేరకు కొలతలు చూసి డబ్బులు ఇస్తే వాస్తవంగా పనిచేసిన కూలీలకు గిట్టుబాటు లభిస్తుంది. కానీ ఫేక్మస్టర్లకు డబ్బులు షేర్ చేస్తుండడంతో నిజంగా పనిచేసిన పేదలు నామమాత్రపు కూలీతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అక్రమాలలో వాటాలు ఫేక్ మస్టర్ల పేరుతో కొట్టేస్తున్న డబ్బులను ఫీల్డ్ అసిస్టెంట్లు తనకు ఉద్యోగం ఇచ్చిన పచ్చనేతతోపాటు డ్వామా అధికారులకు వాటాలు పంచుతున్నారు. వాస్తవానికి ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. జిల్లాలోని చాలా పంచాయతీల్లో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌లు ఉండటంతో పచ్చనేతలు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి సీనియర్ మేట్ల పేరుతో కొత్తవారిని నియమించుకున్నారు. ఇందుకోసం ఒక్కరి వద్ద రూ.రెండు లక్షల వరకూ వసూలు చేశారు. ఉపాధి పనుల్లో వాటాలు పంచాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు ఫేక్ మస్టర్ల డబ్బుల్లో సగం డబ్బులు స్థానిక పచ్చనేతకు చెల్లిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మిగిలిన మొత్తంలో టెక్నికల్ అసిస్టెంట్, ఏపీవోలతోపాటు డ్వామా జిల్లా అధికారికి వాటాలు పంచుతున్నారు. షాట్ నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో అక్రమాలు వెలుగు చూస్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి డ్వామా అధికారులు ఏపీడీ విచారణ అస్త్రాన్ని ప్రయోగించి అక్రమాలను కప్పిపుచ్చుతున్నట్లు ఆ శాఖ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ఒక్కొక్క సోషల్ ఆడిట్‌కు జిల్లా అధికారులు రూ.లక్షకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వేసవిలో రూ.కోట్లాది నిధులతో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కృష్ణా, నాగార్జునసాగర్ కాలువల పరిధిలో ఇటీవల పూడికతీత పనులు చేసినట్లు హడావుడి చేశారు. మరోవైపు కాలువలకు నీటి విడుదల మొదలైంది. ఏడాది తర్వాత జరిగే సోషల్ ఆడిట్ నాటికి కాలువ పూడికతీత పనులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు కనిపించవు. ఇదే అవకాశంగా పచ్చనేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వామా అధికారులు కలిసి ఆధునికీకరణ పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు బొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది. -
పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల
సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రమణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 2 క్రస్ట్‌గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ నెహ్రూనగర్ : కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో శనివారం ప్రకటించిన సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు నగరం స్థానం సాధించిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు నగరం స్థానం దక్కించుకుందని వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని విద్యా భవన్లో ఈ నెల 17న రాష్ట్రపతి అవార్డ్‌లను అందిస్తారని, తనతో పాటు మేయర్ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో నగరం నిలవడానికి కృషి చేసిన ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ (జీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంఎం షరీఫ్, డి.యల్లమందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జీటీఏ ఉమ్మడి గుంటూరుజిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా రమాదేవి, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రభాకర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా చలపతిరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ.విజయకుమార్, సంయుక్త కార్యదర్శిగా పి. రమేష్‌బాబు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ. దశరఽథ్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్ బాబు నియమితులయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలను సహించం మంత్రి మనోహర్ కొల్లిపర: ఇసుక అక్రమ తవ్వకాలను సహించేది లేదని, సొంత పార్టీ వాళ్లయినా అక్రమానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి రావడంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రారంభంలో ఇసుక నిల్వ.. ప్రస్తుతం అనే అంశాలపై రేపటిలోగా తనకు నివేదికను అందించాలని ఆదేశించారు. నదిలో అర్ధరాత్రి మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నారని తనకి సమాచారం వచ్చిందని, దీనిపై సమాధానం చెప్పాలని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోయేసరికి వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు విషయం తేలే వరకు డంపింగ్ యార్డ్ నుంచి ఇసుకను తరలించవద్దని అధికారులను ఆదేశించారు. -
ప్రమాదవశాత్తు సివిల్ ఇంజినీర్ మృతి
నవీపేట: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ గ్రామ సమీపంలోని చెరువులో పడి ప్రైవేట్ సివిల్ ఇంజినీర్ గుత్తి ఉమా గణేశ్(30) మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ శనివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం గ్రామానికి చెందిన ఉమా గణేశ్ భైంసా నుంచి బోధన్ వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులలో సివిల్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనూష ప్రాజెక్ట్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న గణేశ్, నిర్మల్ జిల్లా బాసరలోని కార్యాలయంలో ఉంటూ విధులకు వెళ్లేవాడు. కోస్లీ శివారులో మొరం తవ్వకాలు జరగడంతో పర్యవేక్షణకు శుక్రవారం సాయంత్రం బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్ఐ వినయ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుని తండ్రి మల్లేశ్వర్రావుకు సమాచారం అందించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వందవాసి మండలం పొదిరి గ్రామానికి చెందిన కొంతమంది 2022లో తెనాలి మండలం అంగలకుదురులో కూలి పనుల కోసం వచ్చి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు. వీరితో వచ్చిన ఆరు గోపి అప్పట్లో మతిస్థిమితం లేని దివ్యాంగురాలైన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు గోపి శిక్ష పడుతుందన్న భయంతో కోర్టు వాయిదాలకు రాకుండా తమిళనాడులో ఉంటున్నాడు. పోలీసులు అతడిని తమిళనాడు నుంచి తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ డి. శ్రీనివాసరావు, ఏఎస్ఐ వెంకటరమణ, సీపీ సుబ్బారెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025పనులు లేని సమయంలో పేదలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తెచ్చింది. అయితే కొంతమంది పెద్దలు, అవినీతి అధికారులు కలసి తమకు ఉపాధిగా మార్చుకున్నారు. మైనర్ల పేరుతో జాబ్ కార్డులు సృష్టించి ఉపాధి సొమ్మును స్వాహా చేస్తున్నారు. దీంతో వాస్తవంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. 7న్యూస్‌రీల్ -
ఫిరాయింపుదారులకే పగ్గాలు
చీరాల: ‘పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని.. పక్క పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారి కంటే పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాం’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అయితే ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. చెప్పేదొకటి.. చేసేదొకటి.. అనే తీరున చీరాల నియోజకవర్గంలో టీడీపీ వ్యవహార శైలి ఉంది. పార్టీ అధినేత చెప్పిన మాటలనే పెడచెవిన పెట్టి పక్క పార్టీలో నుంచి టీడీపీలో చేరిన వారికే ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కౌన్సిలర్‌కు దక్కని గౌరవం పార్టీనే నమ్ముకుని కష్టాలు పడి పార్టీ కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. పార్టీ జెండాను భుజాన వేసుకుని పనిచేసిన వారిలో కొంత మంది మౌనం పాటిస్తున్నారు. అయితే పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం సరైన గౌరవం లభించడం లేదు. చీరాల మున్సిపాలిటీలో టీడీపీ సింబల్‌పై గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్‌పై పోటీ చేసేందుకు ఎంతో మంది పోటీపడ్డారు. అయితే టీడీపీ తరఫున ఆయన 3వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. అనూహ్యంగా కొన్ని వార్డుల్లో పోటీ చేసిన టీడీపీ అన్నింటా ఓడినా మూడో వార్డు మాత్రం గెలుచుకున్నారు. టీడీపీ అధినేత చెప్పిన విధంగా పార్టీ తరుఫున గెలిచిన కౌన్సిలర్‌కు సరైన గౌరవం ఇవ్వాల్సి ఉండగా ఇటీవల టీడీపీలో చేరిన వారికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కూటమి అధిష్టానం కూడా పార్టీ తరఫున గెలిచిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం. అందుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించి కూటమికి మద్దతు పలికిన వారే హవా చూపిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుదారులదే పైచేయి చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎక్కువ సంఖ్యలో గెలిచి మెజార్టీ ఎక్కువగా ఉండడంతో వైఎస్సార్సీపీనే చైర్మన్ పీఠం కై వసం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి పాలవడంతో అప్పటి వరకు పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. ప్రస్తుతం కూటమిలో వెళ్లిన కౌన్సిలర్లదే హవా నడుస్తోంది. అప్పటి వరకు వెన్నంటే నడిచిన వారంతా కూటమి చెంతకు చేరి చైర్మన్ జంజనం శ్రీనివాసరావును ఎలాగైనా చైర్మన్ పీఠం నుంచి దించేందుకు కౌన్సిలర్లు అందరూ కూటమి కట్టారు. కౌన్సిలర్ల పదవీకాలం ఎనిమిది నెలలు మాత్రమే ఉండగా ఎమ్మెల్యేపై కౌన్సిలర్లు ఒత్తిడి తీసుకువచ్చి అవిశ్వాస తీర్మానం చేయించారు. పక్క పార్టీ నుంచి వచ్చినవారికి గ్రీన్ కార్పెట్ పార్టీ సింబల్‌పై గెలిచిన కౌన్సిలర్‌కు దక్కని గౌరవం చీరాల టీడీపీలో వింత పోకడలు 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ పీఠంపై పలువురు కౌన్సిలర్లు మొగ్గు చైర్మన్ కుర్చీ కోసం పలువురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్ సీపీలో ఉన్నవారే. టీడీపీ తరఫున గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావును కాకుండా వైఎస్సార్సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లే చైర్మన్ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది నెలల పదవీకాలం మాత్రమే ఉన్నా అవిశ్వాసం పెట్టించి తిరిగి చైర్మన్‌గా కొత్తవారిని ప్రకటించేందుకు కూటమికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు ఊవ్విళ్లూరుతున్నారు. చైర్మన్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలు.. ప్రలోభాలు.. టూర్లు అంటూ కౌన్సిలర్లను కొద్దిరోజులపాటు తిప్పారు. అయితే రేసులో ఉన్నవారంతా మిగిలిన కౌన్సిలర్లను తమకు మద్దతుగా ఓటు వేస్తారా అనేది ఆశావహుల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంది. మే14న అవిశ్వా సం జరగగా అప్పటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటన రాగా చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా... ఓటింగ్ నిర్వహిస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల ఆశలు ఫలిస్తాయా.. ఫెయిల్ అవుతాయానేది సందిగ్దంలో ఉంది. -
ప్రజల ప్రాణాలతో చెలగాటం
బల్లికురవ: గ్రానైట్ లారీలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మితిమీరిన వేగం, అనుభవలేమితో ఎక్కడ ఎప్పుడు ఎలా ఢీ కొడతారోనని వాహన చోదకులు, పాదచారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ, సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి, కొండల నుంచి స్టీల్‌గ్రే, బ్లాక్ పెరల్ గ్రానైట్ క్వారీలున్నాయి. రెండు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ఖనిజానికి అనుబంధంగా సుమారు వెయ్యి పైగా పరిశ్రమలు ఉంటాయి. గ్రానైట్ మీటరు, ముడిరాళ్లు, వృథా మెటీరియల్, పలకల వంటి ఎగుమతులను మార్టూరు, గుళ్లపల్లి, కృష్ణపట్నం పోర్టు, అనంతపురం, బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం 500 పైగా లారీల ద్వారా ఎగుమతులు చేస్తుంటారు. లైసెన్స్ లేకుండానే.. సాధారణ లారీల కంటే గ్రానైట్ లోడు విపరీతమైన బరువుతో ఉంటాయి. 90 టన్నుల నుంచి 150 టన్నుల వరకు లోడు చేసే లారీలను ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపగలరు. కానీ లారీల యజమానులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బల్లికురవ, మార్టూరు రోడ్డులో ఆటోలు నడిపే వారు, పొలాల్లో ట్రాక్టర్లతో దుక్కులు దున్నే వారిని లారీ డ్రైవర్లుగా నియమిస్తున్నారు. కనీసం లైసెన్స్ అంటే ఏమిటో కూడా తెలియని వారు అధికంగా ఉన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉన్న డ్రైవర్లను రెండు మండలాల్లో వేళ్ల మీద లెక్కించవచ్చు. అందుకే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు చెల్లించకుండానే లైన్ మాముళ్లతో అనుభవంలేని డ్రైవర్లతో నెట్టుకొస్తున్నారు. ఎటు చూసినా ధ్వంసం ఇటీవల బల్లికురవ, ఈర్లకొండ క్వారీలనుంచి రాళ్లు ఎగుమతి చేసే లారీ డ్రైవర్ సాయంత్రం 4 గంటల సమయంలో బల్లికురవ వస్తూ వల్లాపల్లి–అంబడిపూడి గ్రామాల మధ్య మార్జిన్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టాడు. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. వల్లాపల్లి సబ్‌స్టేషన్ నుంచి అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరానిచ్చే మెయిన్ లైన్ కావటంతో ఆశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరి కొత్త విద్యుత్ పోల్ ఏర్పాటుతోపాటు తెగిన సప్లయ్ వైర్లు సరిచేసేందుకు 4 గంటలపాటు శ్రమించారు. తరచూ ప్రమాదాలు చెన్నుపల్లి అనంతవరం రోడ్డులో మల్లాయపాలెం–వేమవరం గ్రామాల మధ్య ఇటీవల అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన మేకల నాగార్జున గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తూ భోజనానికి పల్సర్ బైకుపై వెళ్తుండగా మలుపులో ఎదురుగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు, లారీ కిండ పడి నుజ్జునుజ్జు అయింది. నాగార్జున త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి గాయాలపాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. నూతనంగా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మట్టి తరలించే టిప్పర్లు సుమారు 360 పైచిలుకు తిరుగుతున్నాయి. ఇవి మితిమీరిన వేగంతో వెళ్తూ గ్రానైట్ లారీలు, టిప్పర్లు వేగానికి వాహనచోదకులు రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఓడరేవు చీరాల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా మట్టి తరలించే టిప్పర్లు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లకు పర్చూరు, అన్నంబోట్లవారిపాలెం ప్రాంతాల్లో నలుగురు బలయ్యారు. తనిఖీలు ఎక్కడ? గతేడాది కాలంలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు కేసులు నమోదు చేసిన ఘటనలే లేవు. గత ప్రభుత్వ హయాంలో బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల్లో విస్తృత తనిఖీలతో డ్రైవర్ లైసెన్స్‌లేని వారికి ట్యాక్స్‌లు చెల్లించని, ధ్రువీకరణ పత్రాలు లేనివారికి అపరాధ రుసుంతో కేసులు నమోదుతో అప్పట్లో లారీ యజమానులు హెవీె లైసెన్స్ ఉన్న వారిని డ్రైవర్లుగా నియమించుకున్నారు. అనుభవంలేని డ్రైవర్లను నియమించుకోవటం వల్ల తరచూ ప్రమాదాలతోపాటు రాళ్లు దొర్లి రోడ్లపై పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గ్రానైట్ ఎగుమతి లారీలు, టిప్పర్లకు అనుభవం లేని డ్రైవర్ల నియామకం తరచూ ప్రమాదాలు భయాందోళనలో ప్రజలు బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల్లో 860 పైగా లారీలు, టిప్పర్లు లైసెన్స్ ఉన్న డ్రైవర్లను నియమించుకోండి గ్రానైట్ రాళ్లు తరలించే లారీలకు అనుభవంతోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. అప్పుడే సురక్షితంగా గమ్యం చేరటంతోపాటు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. – వై.నాగరాజు, ఎస్ఐ -
బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ?
హామీలివ్వడం.. ఆపై వాటి ఊసే ఎత్తకపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణా కరకట్ట బలోపేతానికి చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. కానీ, ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అతీగతీ లేదు. వానాకాలం వస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని భయపడుతున్నారు. ఇకనైనా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు. రూ.222 కోట్లతో అభివృద్ధి చేసిన వైఎస్సార్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ నుంచి లంకెవాని దిబ్బ వరకు కరకట్ట అభివృద్ధితోపాటు రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.222 కోట్లు కేటాయించి, పనులు చేయించారు. ఈ పనులే నేటి వరకు రక్షణ కవచంలా కాపాడుతున్నాయి. రేపల్లె: కృష్ణా నదీ తీరానికి రక్షణ కవచంగా నిలవాల్సిన కరకట్ట భద్రతా లోపాలతో ప్రజలను భయపెడుతోంది. పలు చోట్ల బలహీనంగా మారడం, అక్రమ పైపులైన్ల ఏర్పాటు, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల హామీలను మర్చిపోవటం కలిసి ప్రజలకు ఆందోళన మిగిల్చాయి. ఓలేరు నుంచి లంకెవాని దిబ్బ వరకు 35 కిలోమీటర్ల మేర కరకట్ట పలుచోట్ల బలహీనంగా ఉంది. వరదల కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరకట్టను పటిష్టం చేస్తామని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కరకట్ట పటిష్టతకు చర్యలు చేపట్టకపోవడంతో తీర ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. పైప్లైన్లతోనే పొంచి ఉన్న ప్రమాదం నిబంధనల ప్రకారం కరకట్టకు 500 మీటర్ల దూరంలోపు ఎటువంటి చెరువుల తవ్వకాలు జరపకూడదు. పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్టకు ఆనుకొని సుమారు రెండు వేల ఎకరాలకుపైగా భూములను చెరువులుగా తవ్వి పలువురు ఆక్వా సాగు చేస్తున్నారు. వాటికి నీరు అందించడానికి పక్కనే ఉన్న బ్యాంక్ కెనాల్ నుంచి కరకట్టను తవ్వి అక్రమంగా పైపులు ఏర్పాటు చేశారు. దీనివల్ల కరకట్ట బలహీనపడి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఓలేరు వద్ద గండి పడిన సందర్భంలో లీకేజీ వద్ద నుంచే కరకట్ట కోతకు గురై కృష్ణమ్మ రేపల్లె పట్టణాన్ని ముంచెత్తింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పలుచోట్ల బలహీనంగా నది కరకట్ట వందల సంఖ్యలో అక్రమంగా పైపులైన్లు పటిష్టం చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తని సీఎం ఇకనైనా చర్యలు తీసుకోవాలంటున్న తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి నివేదిక పంపాం ఓలేరు నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతకు సర్వే నిర్వహించాం. అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభిస్తాం. కరకట్టకు ఏర్పాటు చేసిన అక్రమ పైప్లైన్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశాం. – నాగేశ్వర నాయక్, కరకట్ట పర్యవేక్షణ అధికారి గత ఏడాది తప్పిన ముప్పు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 అక్టోబర్ 2న ఉగ్రరూపం దాల్చుతూ నది ప్రవహించింది. 11.38 లక్షల క్యూసెక్కులతో కడలి వైపు పరుగులు తీసింది. ఆ సమయంలో కరకట్ట పైనుంచి తాకి ప్రవహించింది. పలు ప్రదేశాలలో కట్ట బలహీనపడి నీటి లీకులు వచ్చాయి. రేపల్లె మండలం మైనేనివారిపాలెం వద్ద అప్రమత్తమైన ప్రజలు అధికారులతో కలిసి ఇసుక బస్తాలు, బంకమట్టితో కరకట్టను పటిష్ఠం చేశారు. కనగాలవారి పాలెం, పిరాట్లంక, రాజుకాల్వ ప్రాంతాలలో బలహీనంగా ఉన్న కరకట్టను పటిష్ఠ పరిచారు. రేపల్లె మండలం రావి అనంతవరం సమీపంలో కరకట్ట పలుచోట్ల బలహీనపడి లీకులు రావటంతో అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు ఇసుక బస్తాలు సాయంతో తాత్కాలికంగా బలోపేతం చేశారు. -
పర్యాటక కేంద్రంగా పెనుమూడి రేవు
రేపల్లె: కృష్ణమ్మ పరవళ్లను తాకుతూ వీచే చల్లటి గాలులు... చూపరులను ఆకర్షణీయంగా కనువిందు చేసే సహజసిద్ధ దీవులు... దీవులలో పక్షుల కిలకిల రాగాలు.... నదిలో విహరించటానికి నావలు... కాసేపు ఆనందంగా గడిపేందుకు ప్రకృతి అందాలను సంతరించుకున్న ప్రాంతమే పెనుమూడి. ఈ రేవు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఆదాయంతోపాటు తీర ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది. సహజ సిద్ధంగా దీవులు పెనుమూడి ప్రాంతంలో కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడ్డ దీవులు మరింత అందాలను సంతరించుకున్నాయి. కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. హంసలదీవిలో కలిసే ముందర కృష్ణా జిల్లా పులిగడ్డ–బాపట్ల జిల్లా పెనుమూడి మధ్యలో మూడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ పాయల మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. బోటు షికారుకు అనుకూలం పెనుమూడి రేవులో బోటు షికారుకు అనువైన ప్రాంతంగా ఉంది. పెనుమూడి రేవుకు 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉండటంతో ఆటుపోట్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో నీటి పరిమాణం ఏమాత్రం తగ్గుదల ఉండదు. సెలవుల సమయంలో పలు ప్రాంతాల నుంచి వర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చి సాధారణ పడవలు మాట్లాడుకుని సరదాగా తూర్పువైపున ఉన్న దీవిలోకి వెళ్లటంతోపాటు నదిలో ప్రయాణించి సరదాగా గడుపుతూ ఉంటారు. ఆప్రాంతంలో బోటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతం సినిమా షూటింగ్‌లకు అనువైనదిగా ఉంది. గతంలో చిత్రీకరణలు జరిగాయి. గతంలో జయ జానకీ నాయక సినిమాలో ఒక సన్నివేశం వారధిపై చిత్రీకరించారు. సినీ నటుడు ఆలీ నటించిన పండుగాడు ఫొటో స్టూడియో సినిమాలోని పలు సన్నివేశాలను పెనుమూడి రేవుతోపాటు దీవులలో చిత్రీకరించారు. డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్రపై తీసిన సినిమాతోపాటు పలు టెలీఫిలిమ్ల షూటింగ్‌లు జరిగాయి. అభివృద్ధికి అనువుగా పెనుమూడి నది మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దీవులు బోటు షికారుకు అనువైన ప్రాంతం సినిమా షూటింగ్‌లకు తగిన రమణీయ దృశ్యాలు టూరిజంపై దృష్టి సారించాలి పెనుమూడి రేవును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం శాఖ దృష్టి సారించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి కలగటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. -
అస్మదీయుడికి నామినేటెడ్ పదవి
వేమూరు: కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాదారులకు నామినేటెడ్ పదవులు లభించడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్‌కు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పదవి కట్టబెడ్డటంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. చావలి గ్రామానికి చెందిన ఆయన మెయిన్ సెంటరులో ప్రభుత్వం భూమి కబ్జా చేసినట్లు గ్రామస్తులు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అందులో ఏర్పాటు చేసిన చికెన్ స్టాల్ తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసినా రాజేష్ పట్టించుకోలేదు. చికెన్ స్టాల్ తొలగించకుండా ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులపై కోర్టుకు వెళ్లాడు. ఇది కాకుండా గ్రామంలోని చెరువు స్థలం కూడా ఆక్రమించుకుని, రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీన్ని కొల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు సర్వే నంబర్ వేసి భార్యపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. పైగా భవనంపై ప్రైవేటు ఫైనాన్స్ నుంచి రుణాన్ని కూడా తీసుకున్నట్లు గ్రామంలో గుసగుసలు విన్పిస్తున్నాయి. భూ కబ్జాలతో పాటు రాజేష్ ఏప్రిల్ 24న దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం నామినేటివ్ పదవి ఇవ్వడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. పైకి జనసేన నేతలు సిద్ధాంతాలు చెబుతూ, లోపల భూకబ్జాదారులకు పదవులు ఇస్తోందని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని, పార్టీ కోసం పని చేసిన వ్యక్తులను గుర్తించి పదవులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
హాస్టళ్లలో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
రేపల్లె: హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎం.సూర్యప్రకాశ్ విమర్శించారు. పట్టణంలోని అంబేడ్కర్ బాలికల గురుకుల వసతి గృహాన్ని శుక్రవారం ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించింది. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ హాస్టల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 618 మంది విద్యార్థినులు ఉన్న గురుకులంలో ఆర్వో ప్లాంట్ పనిచేయక తాగునీటి కోసం అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. మోటర్ పనిచేయక పోవడంతో స్నానాలు, ఇతర అవసరాలకు కింద నుంచి మూడవ అంతస్తు వరకు నీటిని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. ఫిబ్రవరిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు వసతి గృహాన్ని సందర్శించిన సమయంలో ఆయా సమస్యలను విద్యార్థినులు ఆయనకు వివరించారని గుర్తు చేశారు. వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ బాగు చేయిస్తామని, నిధులు వెంటనే కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటని ఖండించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కేవీ లక్ష్మణరావు, బాలికల విభాగం కన్వీనర్ కె.భవాని, పి.నిఖిత, వై.నవీన్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సూర్యప్రకాశ్ -
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన ఊదరగుడి సురేష్ కనిపించచడం లేదని అతని తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య శుక్రవారం తెలిపారు. సురేష్ ఈ నెల 8వ తేదీ ఉదయం బాపట్ల దగ్గరలో ఉన్న నరసాయపాలెం గ్రామంలో అతని బంధువు చనిపోవడం వలన అక్కడికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు మార్టూరు వచ్చాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నానని భార్య నాగవేణికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తర్వాత ఎంతకీ రాకపోవడతో భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ఎరుపు రంగుతో ఉంటాడని, బయటకు వెళ్లేటప్పుడు మెరూన్ రంగు నిండు చేతుల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి గురించి తెలిసిన వారు సంతమాగులూరు ఎస్ఐ 9121102168 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధికార ప్రతినిధిగా సంగీతరావు సత్తెనపల్లి: మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా బొక్కా సంగీతరావు ఎన్నుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎల్ఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి, సీనియర్ న్యాయవాది పూసులూరి జీవా అధ్యక్షతన గుంటూరులో జరిగిన సమావేశంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన న్యాయవాది బొక్కా సంగీతరావుని ఉమ్మడి గుంటూరు (గుంటూరు, బాపట్ల, పల్నాడు)జిల్లా అధికార ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సంగీతరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో న్యాయవాదుల సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తానన్నారు. మాదిగల 30 ఏళ్ల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నెరవేరడం మాదిగ జాతి ప్రజల అదృష్టమన్నారు. అందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యాహ్నభోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు నకరికల్లు: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డెప్యూటీ డీఈఓ ఏసుబాబు హెచ్చరించారు. నకరికల్లులోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని గురువారం తల్లిదండ్రులు ఆందోళన చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి చూశారు. నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ముందుగా బియ్యం, కూరగాయలు నాణ్యతను పరిశీలించుకున్నాక వండాలని సూచించారు. వంట గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మరోసారి నాణ్యత లోపించినా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ కె.పుల్లారావు, జాలాది శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. -
రైతన్నల క‘న్నీటి’ తడులు...
వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పుల ప్రభావం ఖరీఫ్ రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ముందుగా వెద పద్ధతిలో సాగైన పంటకు నీరందక ఎండుపోతున్నాయి. అదనుకు కురవాల్సిన వర్షాలు పడకపోవడంతోపాటు ఎండలు మండుతూ, విపరీతమైన వేడి గాలులు వీస్తుండటంతో మొలక దశలో ఉన్న వెద పద్ధతిలోని వరి మొక్కలు దెబ్బతింటున్నాయి. బీటలు వారిన పొలాలకు డీజిల్ ఇంజిన్లు, విద్యుత్తు మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాలలో విత్తనాల తరుణం కావడం, ఇటు వర్షాలు పడకపోవడం, సాగు నీటి కాలువల ద్వారా నీరు విడుదల కాక సమయం మించిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కొల్లూరు -
సహోద్యోగి కుటుంబానికి అండగా కానిస్టేబుళ్లు
చీరాల: సహోద్యోగి అకాల మరణంతో కుటుంబాన్ని ఆదుకునేందుకు తామున్నామంటూ కానిస్టేబుళ్లు ముందుకు వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుల్ బిల్లా రమేష్ ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రూ.1.58 లక్షలను సమకూర్చారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ శుక్రవారం వేటపాలెంలోని బిల్లా రమేష్ ఇంటికి వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న అతని అమ్మమ్మకు నగదును అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ రమేష్ చిన్న తనంలోనే తల్లిని కోల్పోయాడని, అమ్మమ్మ దాసరి సుబ్బులు అన్ని బాధ్యతలు తీసుకుని పెంచి పోషించిందని తెలిపారు. రమేష్ అకాల మరణంతో కష్టకాలంలో 2009 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన అతడి మిత్రులు నగదును సమకూర్చారని చెప్పారు. ఇది ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రూ.1.58 లక్షలు సమకూర్చిన మిత్రులు -
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
నాదెండ్ల: ఓ యంత్ర పరికరాన్ని దిగుమతి చేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చిరువూరు మండలం, వావిలాల గ్రామానికి చెందిన దంతాల వీరభద్రరావు (67) చిలకలూరిపేటలో లారీ ట్రాలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం నరసరావుపేటలో ఓ యంత్ర పరికరాన్ని లోడ్ చేసుకుని గణపవరం గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం కూలీలు రాకపోయేసరికి 10 గంటలకు ట్రాలర్ యజమానికి ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. సమీపంలోని దుకాణంలో గ్యాస్ తగ్గడానికి పౌడర్ ప్యాకెట్ తీసుకుని నీటిలో కలిపి తాగాడు. లారీలో విశ్రాంతి తీసుకున్నాడు. 11.30 గంటల సమయంలో ట్రైలర్ యజమాని ఫోన్ చేయగా వీరభద్రరావు ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో యజమాని అక్కడకు చేరుకుని చూడగా, వీరభద్రరావు లారీలో మృతి చెంది కనిపించాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై జి.పుల్లారావు మృతుడి కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపారు. గుండెపోటు కారణంగా వీరభద్రరావు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఆది ఆంధ్ర కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడుగా గుండాల ఎన్నిక
బాపట్ల: దగ్గుమళ్లివారిపాలెంలోని ఆది ఆంధ్ర కో–ఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీ అధ్యక్షుడిగా గుండాల విజయ్ డేవిడ్‌రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ఏవీవీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎన్నికల అధికారి లలిత కుమారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఆది ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం 177 మంది సభ్యులు ఉండగా ఎన్నికల్లో 158 మంది సభ్యులు పాల్గొన్నారు. అంతా ఆమోదం తెలపడంతో అధ్యక్షుడిగా గుండాల విజయ్ డేవిడ్‌రాజు, ఉపాధ్యక్షుడిగా బి.వెంకటస్వామి, డైరెక్టర్లుగా బిల్లా ఎడ్విన్ రాజు, సలగల ఏసమ్మ, కూచిపూడి పరిశుద్ధం, మేకల సత్యానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికను ఎన్నికల అధికారి లలితకుమారి అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షుడు గుండాల విజయ డేవిడ్‌రాజు మాట్లాడుతూ ఆది ఆంధ్ర సొసైటీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎన్నికల అధికారి లలితకుమారి అధ్యక్షుడికి నియామక పత్రాన్ని అందించారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాపట్ల టౌన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎంప్లాయీస్ యూనియన్ లక్ష్యమని ఆ యూనియన్ కార్యదర్శి వైఎస్ రావు తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్ రావు మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు, వారికి రావలసిన రాయితీలు, ఉద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాపట్ల డిపో కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడంలో, సమాన పనికి సమాన వేతనం, యూనిఫామ్ ఇప్పించడం, వైద్య సౌకర్యాలు అందించడంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాపట్ల డిపో అధ్యక్షులు టి.చంద్రశేఖర్, టి.యస్.నారాయణ, ఎం.కోటేశ్వరరావు గ్యారేజ్ సెక్రటరీ చలపతి, సి.సి.ఎస్. డెలిగేట్ ఎం.పి.కుమార్, సీనియర్ సభ్యుడు ఐ.యస్.రావు, బాపట్ల జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మహిళా చైర్ పర్సన్ పి.రజిని పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వై.ఎస్.రావు -
అనుగురాజు కాంస్య విగ్రహానికి రూపకల్పన
తెనాలి: పన్నెండో శతాబ్దంలో పల్నాడును పరిపాలించిన అనుగురాజు విగ్రహాన్ని తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు రూపొందించారు. ఆయన చరిత్రకు సంబంధించిన ఫొటోలు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విగ్రహ కమిటీ సూచనతో శిల్పకారులు పలు డ్రాయింగులు, కంప్యూటర్ డిజైన్లను తయారుచేశారు. ఆ ప్రకారం తొమ్మిది అడుగుల నమూనాను తయారుచేసి కమిటీ సంతృప్తిని వ్యక్తంచేశాక 700 కిలోల కాంస్యాన్ని వినియోగించి అనుగురాజు విగ్రహాన్ని సిద్ధం చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం అనుగురాజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతం నుంచి వచ్చి పల్నాడును పరిపాలించారు. ఆయన శరీరాకృతి, వస్త్రధారణను ఊహించి విగ్రహాన్ని రూపొందించామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర చెప్పారు. ఈ విగ్రహాన్ని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో గంగమ్మతల్లి గుడి ఎదురుగా ప్రతిష్టించనున్నారు. విగ్రహ కమిటీ సభ్యులు, అనుగురాజు యాదవ్ అభిమానులతో గురువారం ఆ విగ్రహాన్ని పల్నాడుకు తీసుకువెళ్లారు. పిడుగురాళ్లలో ప్రతిష్ట నిమిత్తం రూపొందించిన తెనాలి శిల్పులు 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన అనుగురాజు 700 కిలోల కంచుతో తొమ్మిది అడుగుల నిలువెత్తు విగ్రహం -
కొత్త కోర్సులు పిలుస్తున్నాయి.. బ్రో !
వేటపాలెం: కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసినా యువకులకు కొలువులు దక్కడం లేదు. ఇంటి దగ్గరే ఉంటున్న పిల్లలను చూసి పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పట్టణాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ, చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. దీంతో ఇటీవల సివిల్, మెకానికల్ కోర్సుల జోలికి వెళ్లడం విద్యార్థులు మానేశారు. సీఎస్ఈ, ఈసీ బ్రాంచ్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో 70 శాంతం మంది ఈ రెండు బ్రాంచిలే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ఉద్యోగ అవకాశాలు అందరికీ అందడం లేదు. కేవలం 15 నుంచి 20 శాతం మందికే వస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు తప్పనిసరి సీఎస్ఈ, ఈసీ బ్రాంచ్‌లకు దీటుగా నేడు మరికొన్ని కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్, డెటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి ఎమర్జింగ్ ఏరియాలను కవర్ చేయగల నాలెడ్జ్ ఉన్న కోర్సులివి. రోబోటెక్ పరిజ్ఞానం ఉండటం ఈ కోర్సుల్లో ప్రధాన పాత్ర. వీటికి ప్రస్తుత మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మేజర్, మెయిన్ కోర్సులు చేసే అవకాశం జిల్లా వ్యాప్తంగా చీరాల, బాపట్లలో ఉన్న నాలుగు ఇంజినీరింగ్ కళాశాలల్లో 3,000 సీట్లు పైగా ఉన్నాయి. వీటిలో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ బ్రాంచుల్లో 2,200 సీట్లు ఉన్నాయి. మెకానికల్, ఈఈఈ, సివిల్ వంటి కోర్ బ్రాంచుల విద్యార్థులకు సైతం సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు ఉండటం విశేషం. ప్రభుత్వం ప్రకటించిన నూనత జాతీయ విద్యా విధానంతో ఒకే సమయంలో మేజర్, మెయిన్ కోర్సులు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. మెయిన్‌గా కోర్ కోర్సులు తీసుకున్నా మైనర్ కింద ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సు చేయడానికి అవకాశం ఉంది. ఈసీఈలో చేరితే సెమీ కండక్టర్, చిప్ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈఈఈ విద్యార్థులైతే ఈఎల్ఎస్, ఎంబెడ్ సిస్టం లాంటి కోర్సులు నేర్చుకోవడంతో మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ వారు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంజినీరింగ్ విద్యలో పలు నూతన కోర్సులు ఆసక్తి చూపుతున్న యువత చీరాల, బాపట్ల కళాశాలల్లో వేలాది సీట్లు డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ కోర్సుల వైపు మొగ్గు -
తిరగబడ్డ రైతుబిడ్డ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండోవిడత భూసేకరణలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత సెగ తగిలింది. సొంత సామాజిక వర్గానికి చెందిన రైతులే తిరగబడటంతో ఒక అడుగు వెనక్కి వేసింది. బుధవారం జరిగిన కేబినేట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. పొంతన లేని లెక్కలు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గ్రామాల్లో జరుగుతున్న తీరుకు సంబంధం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పూలింగ్ పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. పైగా ప్రభుత్వం కూడా ఎక్కడ భూమి తీసుకుంటుందో.. ఏ గ్రామాల్లో ఎంత అవసరమో చెప్పకుండా ఏకంగా గెజిట్ విడుదల చేసింది. ముందు ప్రకటించిన గ్రామాల్లోనే కాకుండా తాడికొండ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే.. పరోక్షంగా లక్ష ఎకరాలకు పైగా భూసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తలాతోక లేని అభిప్రాయ సేకరణ తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో 7,256 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో 10,878, అమరావతి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 19,504, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో 4,586 కలిపి 42,226 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి గ్రామ సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ కూడా వీటికి సంబంధించి విడుదల అయింది. అయితే గెజిట్‌తో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ పేరుతో తాడికొండ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమీకరణకు భూములివ్వబోమని తెగేసి చెప్పారు. వినతిప్రతం కూడా అందజేశారు. భూ బాగోతంపై రైతులు బేజాత్పురం, రావెల గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ ఎమ్మెల్యే, ఆర్డీవోలు మాట దాటవేత ధోరణే తప్ప సమాధానం చెప్పలేదు. నోటిఫికేషన్‌కు ముందు జరిపిన గ్రామ సభలకు సంబంధం లేకుండా గత గురువారం తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో, తర్వాత రోజు ఫణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో సభలు నిర్వహించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో రైతులు ఏకంగా అడ్డం తిరిగారు. తాము భూములిచ్చేది లేదంటూ ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. దీంతో అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగారు. రెండో విడత భూ సమీకరణపై వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల వ్యతిరేకతతో కేబినేట్ నిర్ణయం వాయిదా సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత సొంత సామాజిక వర్గమే బాబుకు ఎదురు తిరగడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి మేలు చేస్తావనుకుంటే మరోసారి సమీకరణ పేరుతో నోళ్లు కొడతారా ? అంటూ గ్రామాల్లో రైతులు దుర్భాషలాడుతున్నారు. భూములు ఇచ్చేది లేదంటూ గ్రామాల్లో మైక్ ప్రచారం చేయడం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
ఓటరు క్లెయిమ్‌ల విచారణ వేగవంతం చేయండి
చీరాల టౌన్: బీఎల్వోలు విధులను సమర్థవంతంగా నిర్వహించి ఓటరు క్లెయిమ్‌ల విచారణ వేగవంతం చేయాలని ఈఆర్వో, ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు సూచించారు. శుక్రవారం చీరాల మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో చీరాల నియోజకవర్గంలోని బీఎల్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటరు అర్జీలు పెండింగ్‌లో లేకుండా పనిచేయాలన్నారు. నిశితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలని పేర్కొన్నారు. అభ్యంతరాల వివరాలను తెలియజేయాలని కోరారు. మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. విచారణ ఈసీ నిబంధనల ప్రకారం చేయాలని కోరారు. సమస్యలుటే తమకు తెలియజేయాలని సూచించారు. తహసీల్దార్ కె.గోపీకృష్ణ, ఎన్నికల డీటీ సుశీల, మున్సిపల్, వేటపాలెం మండలాల్లోని బీఎల్వోలు పాల్గొన్నారు. -
బావమరిది దాడిలో బావ మృతి
చేబ్రోలు: అక్కాబావల మధ్య జరుగుతున్న వివాద విషయం తెలుసుకున్న బావమరిది అక్కడకు వెళ్లి బావతో గొడవ పడి క్షణికావేశంలో కర్రతో తలపై దాడి చేసి గాయపరచటంతో మరణించిన సంఘటన చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండవరం గ్రామానికి చెందిన నన్నపనేని కృష్ణబాబు (35)కు అదే గ్రామానికి చెందిన మక్కే భువనేశ్వరితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కృష్ణబాబు, భువనేశ్వరిల మధ్య వివాదం జరుగుతుండటంతో భువనేశ్వరి తమ్ముడు గోపీకి ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలియజేసింది. గోపి అక్కాబావల ఇంటికి వచ్చి గొడవ విషయం గురించి మాట్లాడుతుండగా బావ బావమరిదిల మధ్య మాటమాట పెరిగింది. క్షణికావేశంలో గోపి బావను సమీపంలో ఉన్న పెద్ద కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయాడు. బంధువులు తీవ్ర గాయాలైన కృష్ణబాబును వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుని తల్లి నన్నపనేని వీరకుమారి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్ఐ డి వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు
ఇంజినీరింగ్ విద్యలో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సులకు డిమాండ్ పెరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి బదులుగా కొత్తగా వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటిల్జెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ రోబోటెక్ కోర్సులకు దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడంతో విద్యార్థులు వీటిపై మొగ్గు చూపతున్నారు. –ఎస్. లక్ష్మణరావు, కరస్పాండెంట్, సెయింట్ ఆన్స్ కాలేజీ, చీరాల -
కొనుగోలు చేయాలి
రైతుల నుంచి మొత్తం పొగాకులక్ష్మీపురం: జిల్లాలో రైతుల నుంచి మొత్తం నల్లబర్లీ పొగాకును గిట్టుబాటు ధరకు కొనగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు డిమాండ్ చేశారు. నాణ్యత లేదనే పేరుతో తిప్పి పంపడం సరికాదని తెలిపారు. గుంటూరు చుట్టగుంట సెంటర్లోని మార్కెట్ యార్డులో శుక్రవారం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఫిరంగిపురం మండలంలోని తక్కెళ్లపాడు, కండ్రిక, మేరికపూడి గ్రామాల రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకులో తేమ శాతం ఎక్కువగా, నాసిరకంగా ఉందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీ గ్రేడ్ కింద 80 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, క్వింటాకు ఆరు వేల రూపాయలు మాత్రమే దక్కుతుందని తెలిపారు. కండ్రిక గ్రామానికి చెందిన కాంతారావు అనే రైతు 16 చెక్కులు తీసుకు రాగా, నాసిరకంగా ఉందని 10 తిప్పి పంపేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మరో రైతు రామయ్య నాలుగు చెక్కులు కొనగోలు కేంద్రానికి తీసుకురాగా రెండు తిప్పి పంపారని చెప్పారు. ఫిరంగిపురం మండలం మేరిక పూడి గ్రామానికి చెందిన రైతు ముక్కంటి 55 చెక్కులు తీసుకు రాగా మొత్తం తెచ్చిన ట్రాక్టర్లోనే అధికారులు వెనక్కి పంపారని వివరించారు. ఈ స్థితిలో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే కొనగోలు కేంద్రాల్లో తక్కువ ధర వేయడం, తిప్పి పంపడం సరికాదని పేర్క్ననారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 30వేల టన్నులు ఉత్పత్తి కాగా ఇప్పటికి నాలుగు వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ స్థితిని గమనించి ప్రైవేటు కంపెనీలు గ్రామాలలోనే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు వేగం పెంచాలని, లేనిపక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.కృష్ణ పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘ నాయకులు -
చీరాల ‘చైర్మన్’పై గందరగోళం
చీరాలలో చైర్మన్ ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే ఎటూ తేల్చకపోవడంతో టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవి ఆశిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కౌన్సిలర్లను మంచిగా ‘చూసుకునే’ వారికే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చీరాల: ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినా కొత్త చైర్మన్ ఎంపిక కత్తి మీద సాములా మారింది. కుల సమీకరణలు, ఆదాయ వనరులను బట్టి ఎక్కువ మొత్తం వెచ్చించిన వారికే దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంపు ఏర్పాటు, విశాఖపట్నం, పాపికొండల టూర్ అంటూ సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పదవీ కాలం ఉండడంతో డబ్బు ఖర్చు పెట్టేందుకు మరికొందరు సంశయిస్తున్నారు. చైర్మన్ పదవిపై మోజు ఉన్నవారు మాత్రం తహతహలాడుతున్నారు. ఈ నెల 16న జరిగే ఎన్నికలో చైర్మన్ ఎవరనేది తేలనుంది. ‘అవిశ్వాసం‘తో వేటు చీరాల మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాలపాటు చైర్మన్‌గా పనిచేసిన జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గతంలో ముందుకొచ్చారు. టీడీపీ మద్దతు కౌన్సిలర్లతోపాటు ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 22 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ఏప్రిల్ 23న కలెక్టర్ జె.వెంకట మురళికి 17 మంది సభ్యులు అందించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికారు. దీంతో మే 14న కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్‌అఫీషియోలతో కలిపి 26 మంది పాల్గొని అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకొని క్యాంపుల పేరు ఇతర ప్రాంతాలకు పంపించారు. చైర్మన్ సీటును ఆశిస్తున్న వారు మిగిలిన కౌన్సిలర్లకు సకల రాజమర్యాదలు చేసి అవిశ్వాస ఓటింగ్ నాటికి తిరిగి చీరాలకు తీసుకువచ్చారు. అవిశ్వాసం నెగ్గిన నాటి నుంచి ఎవరికి చైర్మన్ పదవి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సామాజిక, రాజకీయ సమీకరణాలు చూస్తే తమకే సీటు కేటాయించాలని ఆశావహులు ఇప్పటికే ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేసులోని వారందరూ వైఎస్సార్సీపీ సభ్యులే చీరాల మున్సిపల్ ఎన్నికలలో 33 వార్డుల్లో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి 9 మంది ఉన్నారు. 2024లో ఎన్నికల అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించిన తర్వాత ఆ పదవికి పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్సీపీలో ఉన్నవారే. అయితే టీడీపీ సింబల్‌పై గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావు రేసులో లేకపోవడంతో వైఎస్సార్సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లకే అవకాశం ఉంది. రేసులో ఉన్నవారంతా మిగిలిన కౌన్సిలర్లను అన్నివిధాలా ‘మంచి’ చేసుకోవాల్సి పరిస్థితి నెలకొంది. చీరాల మున్సిపల్ చైర్మన్ పదవిపై ఎటూ తేల్చని ఎమ్మెల్యే రోజు రోజుకూ పెరిగిపోతున్న ఆశావహుల జాబితా కౌన్సిలర్లకు డబ్బులిచ్చి మద్దతు పొందే వారికే ప్రాధాన్యత బరిలో ప్రధానంగా నలుగురు ఎనిమిది నెలల పదవీకాలం ఉన్న మున్సిపల్ పాలక వర్గానికి తమనే చైర్మన్‌గా చేయాలంటూ ఇప్పటికే ఎమ్మెల్యే ముందు నలుగురు ప్రతిపాదనలు ఉంచారు. ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సామాజికవర్గానికి చెందిన మించాల సాంబశివరావు, సీనియార్టీ ప్రకారం తనకే ఇవ్వాలని పొత్తూరి సుబ్బయ్య, గౌడ సామాజికవర్గానికి చెందిన సూరగాని లక్ష్మి, చేనేత సామాజికవర్గానికి చెందిన గోలి స్వాతి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో అనేక రాజకీయ, సామాజిక సమీకరణలతో ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. -
శాకంబరిగా బాల చాముండేశ్వరి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం అమ్మవారిని కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. ఆలయంలోని జ్వాలాముఖి దేవికి కూడా శాకంబరిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. -
కోన ప్రభాకరరావు విగ్రహం ఏర్పాటుకు డిమాండ్
బాపట్ల: జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం ప్రత్యేకత చాటుకున్న దివంగత కోన ప్రభాకరరావు విగ్రహాన్ని బాపట్ల పాత బస్టాండ్ డివైడర్‌పై తిరిగి ప్రతిష్టించాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. గురువారం కోన ప్రభాకర రావు 109వ జయంతి సందర్భంగా కోన రఘుపతి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. కోన ప్రభాకర రావు బాపట్లకు చేసిన సేవలు స్మరించుకునేలా విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు స్ఫూర్తిని పొందేలా చూడాలన్నారు. రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన విగ్రహాలను తిరిగి అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు మాట తప్పారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్, గుర్రం జాషువా, పొట్టి శ్రీరాములు విగ్రహాలను కూడా తిరిగి ప్రతిష్టించాలని కోరారు. పురపాలక సంఘం ఆమోదించిన తీర్మానం ఇప్పటికై నా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, యువజన నాయకులు కోకిలగడ్డ చెంచయ్య, డి.జయభారత్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగం నాయకుడు షేక్ సయ్యద్ పీర్, బులిరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, జోగి రాజా, ఇనగలూరి మాల్యాద్రి, షోహిత్, ఉరబిండి గోపి, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, వేల్పుల మీరాబీ, మునీర్, కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు చల్లా రామయ్య ఆధ్వర్యంలో చేతి కర్రలను పంపిణీ చేశారు. -
సంబరం .. ఇంద్ర వైభవం
నయన మనోహరంగా దుర్గమ్మకు శాకంబరి అలంకారం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో గురువారం ఉదయం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈఓ అన్నదానం పథకానికి రూ. 50 వేల విరాళం సమర్పించారు. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారి మూల విరాట్‌ను వివిధ ఫలాలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించారు. ఆలయాన్ని బత్తాయి. దానిమ్మ, పైనాపిల్, పచ్చి ఖర్జూరం, ఆల్బక్రా, యాపిల్, పుచ్చకాయలు, పలు రకాల ద్రాక్షలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. మూడు రోజుల ఉత్సవాల్లో 36 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మ సన్నిధిలో గురుపూజా మహోత్సవం వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానానికి చెందిన తంగిరాల వెంకటేశధ్వర ఘనాపాటి, శంకరమంచి శివప్రసాద్, అహితాగ్ని గుంటూరు రామచంద్ర సోమయాజులు దంపతులను సత్కరించి పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు గురువులకు హారతులిచ్చి పూజ నిర్వహించారు. నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు. -
పాత జాతీయ రహదారిపై కారు బీభత్సం
వీఆర్వోతో పాటు మరో నలుగురికి గాయాలు తాడేపల్లి రూరల్ : మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా వీఆర్వోతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వైద్యం నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు అతి వేగంగా వెళుతున్న కారు పాత జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. తొలుత పెదకాకాని నుంచి బదిలీ అయి ఇప్పటం వీఆర్వోగా విధులకు హాజరయ్యేందుకు నులకపేటలోని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న జయంతి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఐదు అడుగులు పైకి లేచి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆమెకు కుడి కాలు మోకాలి వద్ద విరిగిపోయింది. వీఆర్వో ద్విచక్ర వాహనం అనంతరం కారు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఇందులో ఇద్దరు పురుషులు, మహిళ, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వీఆర్వోను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు అతి వేగంగా ఉండవల్లి సెంటర్ వైపు వెళ్లడంతో యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ వారి వాహనాలను సైతం ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, ఆర్ఐ వేదాంతం వివరాలు సేకరిస్తున్నారు. -
డ్రెయిన్లలో పూడికతీత పనులు ప్రారంభం
రేపల్లె: ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా డ్రెయిన్లలో పూడిక తీయించకపోవడంపై గత వారం సాక్షిలో ‘‘ముంపు ముప్పు’’ అనే శీర్షికన నియోజవర్గంలోని ప్రధాన మురుగు కాలవలు గురప్రు డెక్క, తూటి కాడతో పూడి పోవడంతో పంటకు నష్టం జరిగే ప్రమాదాన్ని వివరిస్తూ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వాడ మురుగు, ఆర్ఎం డ్రెయిన్లలో గురప్రు డెక్క, తూటి కాడలను తీయిస్తున్నారు. దీనిపై నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సాక్షికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమష్టి కృషితో డిపో అభివృద్ధి చీరాల అర్బన్: ఉద్యోగుల సమష్టి కృషితోనే డిపో అభివృద్ధి సాధ్యమవుతుందని బాపట్ల డీపీటీఓ సామ్రాజ్యం అన్నారు. గురువారం చీరాల ఆర్టీసీ డిపో, బస్టాండ్, గ్యారేజీలను ఆమె పరిశీలించారు. బస్సులను పూర్తి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం బస్టాండ్‌లోని పలు విభాగాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ పరిసరాలు, మరుగుదొడ్లు, స్టాల్స్‌ను పరిశీలించారు. తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓఆర్ పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, బస్సుల సమయపాలన పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. డిపో మేనేజర్ జంజనం శ్యామల, సిబ్బంది ఉన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తాం ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా గురువారం క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారుల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలోని మేజరు కాల్వల్లో రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు. నీటిగుంటలో పడి వ్యక్తి మృతి వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వ తేదీన గ్రామ సమీపంలో బహిర్భూమికని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి పర్చూరు(చినగంజాం): అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి తెలిపారు. స్థానిక అద్దంకి నాంచారమ్మ ఫంక్షన్ హాలులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సమాయత్త సభ పార్టీ మండల అధ్యక్షుడు కఠారి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. గాదె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ రాష్ట్రంలో చక్కటి పాలన అందించారని, సంక్షేమ పథకాలను అవాంతరం లేకుండా చేశాన్నారు. చంద్ర బాబు సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా తమ నాయకుడు జగన్మోహనరెడ్డిని దూషించటమే ధ్యేయంగా పెట్టుకన్నారని ..ఇటువంటి నాయకుడు మనకు అవసరమా ? అని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి కోడ్‌ను ఆయా కుటుంబాలకు చెందిన సెల్ఫోన్లలో స్కాన్ చేయించి అందులో వచ్చే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో, ఇతర వాగ్దానాలు, హామీలు, సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని మధుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, వైస్ ఎంపీపీ పాలేరు వీరయ్య, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, బూత్ కమిటీ అధ్యక్షుడు ముప్పాళ్ళ రాఘవయ్య, కోట శ్రీనివాసరావు,తులసీ నాగమణి, గోరంట్ల శివకుమారి, యూత్ అధ్యక్షుడు కొల్లా శేషగిరి, మల్లా శ్రీను, ప్రచార కమిటీ అధ్యక్షుడు దాసరి వెంకటరావు, మల్లిశెట్టి జగన్నాథం, యద్దనపూడి హరిప్రసాద్, కంచనపల్లి రమేష్, గాదె సురేష్, ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జగదీష్ గురజాల: అంతరాష్ట్ర చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మంచికల్లు గ్రామానికి చెందిన బొల్లెద్దుల కోటేశ్వరరావు దంపతులు గురజాల బైపాస్ మీదుగా దాచేపల్లికి వెళ్తుండగా మార్గం మధ్యలో జగనన్న కాలనీ వద్ద మహిళ మెడలోని నానుతాడు అపహరణకు గురైందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో దంపతులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ ఆవుల భాస్కర్ టీంను ఏర్పాటు చేసి విచారణ సాగించారని, పలు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, కోదాడ మండలం బాలాజీ నగర్ తండాకు చెందిన బర్మవత్ నాగరాజుగా గుర్తించామని చెప్పారు. అతడిని విచారించగా చైన్ స్నాచింగ్‌ను ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద రూ.10 లఽక్షలు విలువ కలిగిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నాగరాజు డీజే ఆపరేటర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడన్నారు. అతను ఫిబ్రవరి నెల 16వ తేదీన నరసరావుపేట సత్తెనపల్లి మధ్య మాదాల గ్రామం వద్ద టీవీఎస్పై భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును, 19వ తేదీన పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని వెళ్లి పోయినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నందిగామ, గండేపల్లి, వత్సవాయి, చిల్లకల్లు, తెనాలి త్రీ టౌన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన సీఐ ఆవుల భాస్కర్, ఎస్ఐ వై.వినోద్ కుమార్, బి.అనంత కృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రేపు వాటర్ పోలో జట్ల ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలోని స్విమ్మింగ్ పూల్‌లో సబ్ జూనియర్స్, జూనియర్స్ జిల్లా వాటర్ పోలో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న 10వ అంతర్ జిల్లాల చాంపియన్‌షిప్ పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లును ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
వ్యాసాయ.. విష్ణురూపాయ!
అమరావతి: సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస ఆరాధన ఘనంగా నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లాడుతూ వేద వ్యాసుడు నాలుగువేదాలు, అష్టా దశ పురాణాలతో పాటుగా మహాభారతాన్ని మానవాళికి అందించాడన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించి, అధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన గురువులను స్మరించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఆది గురువు వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదవ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ అందించారు. వేడుకల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో... పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ షిర్డీసాయి – పర్తిసాయి కపోతేశ్వర ధ్యాన మందిరంలో గురుపూర్ణిమ వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామునే బాబావారికి సుప్రభాతసేవ, నగర సంకీర్తన, షిర్డీ హారతి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత బాబా విగ్రహానికి పంచామృతాలతో మహా భిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, షిర్డీబాబా, సత్యసాయిబాబా చిత్రపటాలకు, బాబావారి పాదుకలకు భక్తులతో పూజలు చేయించారు. చివరగా అన్నదానం నిర్వహించారు,. వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో ఘనంగా గురుపూర్ణమి -
హోంగార్డు కుటుంబానికి రూ.5లక్షలు సాయం
నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఒక రోజు వేతన మొత్తం రూ.5 లక్షలను సాయంగా అందించారు. తెనాలి రూరల్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తూ హోంగార్డు వై.శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో మృతిచెందాడు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ చేతుల మీదగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సాయం చెక్‌ను అందజేశారు. హోంగార్డు కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చని జిల్లా హోంగార్డులను అదనపు ఎస్పీ అభినందించారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటు కారణంగా ఉద్యోగ విరమణ చేసిన బండ్లమోటు పీఎస్ హోంగార్డు ఎ.నాసరయ్యకు రూ.5 లక్షల చెక్‌ను అదనపు ఎస్పీ సంతోష్ అందించారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎస్.కృష్ణ పాల్గొన్నారు. -
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో క్రోసూరు: కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచి పోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని.. దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టారని తెలిపాడు. గతంలో సాగు నీరు విషయమై కూడా దౌర్జన్యం చేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కలిసి డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులతో సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు. -
విద్యారంగ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రేపల్లె: విద్యారంగ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా అందరినీ ఆత్మీయంగా కలిపే కార్యక్రమం ఇదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేసే సంస్కృతిని పెంచడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. ‘ఒక క్లాసుకు ఒక టీచర్’ విధానంలో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మొక్కలు అందించారు. ఆర్డీవో రామలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, కమిషనర్ సాంబశివ రావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, నాయకులు పంతాని మురళీధరరావు, మేకా రామకృష్ణ, స్కూల్ హెచ్ఎం సీహెచ్ సుందరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ -
ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోండి
మేదరమెట్ల: విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని 452 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. కలెక్టర్ వెంకట మురళి, తహసీల్దార్ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, మన్నె రామారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మండల నాయకులు పాల్గొన్నారు. పెరుగుతున్న సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 541.20 అడుగులకు చేరింది. కాగా, ఇది 190.8366 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 4,204, ఎడమ కాలువకు 3,202, ఎస్ఎల్బీసీకి 1,500 క్యూసెక్కులు విడుదల అవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం 8,906 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,16,833 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. కందులు కొనుగోలు చేయండి నరసరావుపేట: కందుల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. గురువారం కలెక్టరేట్లో దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మెరుగైన ధరకు కొనాలన్నారు. ఈ వారంలోగా ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా వ్యవసాయ అధికారి జె.జగ్గారావు, ఆర్డీవోలు కె.మధులత, రమణాకాంత్‌రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు పూర్తి నరసరావుపేట: జిల్లాలో గురువారం ధాన్యం కొనుగోలు బకాయిల్లో రూ.6.29 కోట్లు చెల్లింపులు ప్రధాన కార్యాలయ నుంచి రైతుల అకౌంట్లకు జమ చేశామని, దీంతో మొత్తం బకాయిలు రూ.11.36 కోట్ల చెల్లింపులు పూర్తిచేసినట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2024–25 రబీ సీజన్లో 68 రైతుసేవా కేంద్రాల ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా 550 మంది రైతుల నుంచి రూ.11.36 కోట్ల విలువైన 4,904 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది జూన్ 30 వరకు రూ.4.07 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. జూలై ఒకటో తేదీన మరో రూ. కోటి రైతుల అకౌంట్లకు వేశామన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాకు చర్యలు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి నరసరావుపేట: నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ డి.పుల్లారెడ్డి చెప్పారు. గురువారం ఆయన బరంపేట విద్యుత్ కార్యాలయంలో పల్నాడు జిల్లా సర్కిళ్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులు, రెవెన్యూ కలెక్షన్లు పెంపుదల, పీఎం సూర్య ఘర్లపై సమీక్ష చేసి లక్ష్యాలు నిర్దేశించామన్నారు. వ్యవసాయ పంపు సెంట్ల కనెక్షన్ల కోసం సుమారు రెండు వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే మూడు నెలల వ్యవధిలో ఆ సర్వీసులు అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లో ఓల్టేజ్, అధిక లోడులు ఉన్న ప్రాంతాల్లో బేస్మెంట్లు వేసి అధిక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.విజయకుమార్, ఈఈ సీహెచ్ రాంబొట్లు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం
ఆర్‌ఈఎంజెడ్ కోసం భూములిచ్చే రైతులతో కలెక్టర్ బాపట్ల: అద్దంకి నియోజకవర్గంలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (ఆర్‌ఈఎంజెడ్) స్థాపనకు అవసరమైన భూమి కొనుగోలుకు ఎకరాకు రూ.18 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో రైతులతో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఆర్‌ఈఎంజెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. బల్లికురువ, సంతమాగులూరు మండలాల్లోని కుందూరు, మామిళ్ళపల్లి, మక్కినవారి పాలెం, గుడిపాడు గ్రామాలలో భూమి కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. దాదాపు 1,800 ఎకరాల కొనుగోలుకు నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు ఎకరాకు రూ. 20 లక్షలు ఇవ్వాలని కోరారని తెలిపారు. ల్యాండ్ ఎక్విజేషన్ నిబంధన మేరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జోన్ ఏర్పాటుతో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. దాదాపు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్థానికుల్లో అర్హులైన వారికి ముందుగా అవకాశం కల్పిస్తారని తెలిపారు. నిబంధన మేరకు ఎకరాకు రూ.18 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి రైతులందరూ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, ఉప కలెక్టర్ లవన్న, బల్లికురవ మండల రెవెన్యూ అధికారి ఎం.రవినాయక్, సంతమాగులూరు మండల రెవెన్యూ అధికారి కె.రవిబాబు, జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివ శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ల వేతనాలు పెంపు ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ల రోజు వారీ వేతనాన్ని వీడీఏ పాయింట్ల ఆధారంగా పెంచినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పలు శాఖల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ల రోజువారీ వేతనాలను సవరించినట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం గల వారికి రూ.900 ఉండగా, ఇప్పుడు రూ.937గా మార్చినట్లు వివరించారు. నైపుణ్యం గల వారికి రూ.850 ఇస్తుండగా ఇప్పుడు రూ. 885కి, సెమీ స్కిల్డ్ వారికి రూ.750 ఇస్తుండగా.. రూ.781కి, నైపుణ్యం లేని వారికి ప్రస్తుతం రూ.650 ఇస్తుండగా రూ.677కి పెంచినట్లు తెలిపారు. ఈ వేతనాలు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వర్తిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకట శివప్రసాద్, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఆత్మస్థైర్యంతో పోరాటం
కొల్లూరు: అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయకుండా ప్రజలను నట్టేట ముంచుతుందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండిపడ్డారు. కొల్లూరు గాంధీనగర్ వద్ద పార్టీ మండల కన్వీనర్ సుగ్గున మల్లేశ్వరరావు అధ్యక్షతన గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అశోక్‌బాబు మాట్లాడుతూ కూటమి నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గ్రామాలలో విష సంస్కృతిని అలవాటు చేయడం దురదృష్టకరమని ఖండించారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి కార్యకర్తలు భయపడకుండా కలసికట్టుగా ఉంటూ ఆత్మస్థైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అణచివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తే వారి పైనా ప్రైవేటు కేసులు పెట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోసాలను నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని అన్నారు. క్యూఆర్ కోడ్‌ను వినియోగించే విధానంపై నాయకులు, కార్యకర్తలకు ఆయన వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చొప్పర సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యులు బుల్లా నవరత్నం, బావిరెడ్డి వెంకట్రామయ్య, గుంటూరు రామారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్ బాజి, సర్పంచ్‌లు మంచాల వసుంధర, గుర్రం మురళి మేకతోటి శ్రీకాంత్, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, మాజీ సర్పంచి కట్టుపల్లి సోమయ్య, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి వివిద విభాగాల నాయకులు కోగంటి లవకుమార్, బిట్రగుంట సత్యనారాయణ, పెరికల పద్మారావు, జోషిబాబు, సుధారాణి, గుర్రం వీరరాఘవయ్య, సిరాజుద్దీన్, చలంచర్ల కనకదుర్గ, దివి వెంకటేశ్వరరావు, హుసేన్, నాంచారయ్య, సురేష్, కనపర్తి మోహన్‌రావు, గుంటూరు పవన్‌కుమార్, శివన్నారాయణ, గరిక రమేష్, రామ్మోహన్ పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు కొల్లూరులో విస్తృతస్థాయి సమావేశం -
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అఖిలభారత గిరిజన వికాస పరిషత్ అధ్యక్షుడు భూక్యా తులసీనాయక్ (బీటీ నాయక్), కార్యదర్శి భూక్యా రమేష్ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిటిష్ కాలంలో ఉన్న నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణానికి, అడవి మధ్యలో ఉన్న తమ ఆరాధ్య దేవత తుల్జా భవానీ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపునకు అధికారులు సర్వే నిర్వహి ంచారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట, బెల్లంకొండ మండలాల మధ్య దూరం తగ్గి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పాత రికార్డులు, శాటిలైట్ పిక్చర్స్ పరిశీలించి బాట ఉన్న విషయాన్ని రూఢీ చేసుకున్నారన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెస్సర్స్ మరోని ఇన్ఫ్రా సంస్థ మేనేజర్ జి.బాలాజీ, సివిల్ ఇంజినీర్ డి.నాగరాజు, నరసరావుపేట ఫారెస్ట్ రేంజర్ అధికారి అడవిలో అనువైన స్థలాలను పరిశీలించారన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వెంకటాయపాలెం సర్పంచ్ భూక్యా నాగమ్మ, మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి, హన్మంత్ నాయక్, ఆర్యవైశ్య నాయకులు దేవరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలు చేసిన రిసార్టులపై చర్యలు
చీరాల టౌన్: చీరాల తీర ప్రాంతాల్లో సీఆర్‌జెడ్ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేసిన రిసార్ట్స్‌పై చర్యలు తప్పవని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా డీపీవో ప్రభాకరరావు, పొల్యూషన్ కంట్రోల్ ఈఈ రాఘవరెడ్డిలతో కలిసి వాడరేవు, రామాపురం, విజయలక్ష్మీపురం, కఠారిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన పలు రిసార్ట్సులను పరిశీలించారు. సముద్ర మట్టానికి దగ్గరగా నిర్మాణాలు చేసిన రిసార్ట్సు వివరాలను సేకరించి కొలతలు తీసుకున్నారు. నిబంధనలు విస్మరించి అక్రమ కట్టడాలు చేసిన పలువురు నిర్వాహకులకు నోటీసులు అందించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
‘కూటమి’ దెబ్బకు రైతు కుదేలు
సత్తెనపల్లి: రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సాగుకు సంబంధించిన పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రైతుకు రూ. 13,500 చొప్పున రైతు భరోసా మంజూరు చేయడంతో కొంత లబ్ధి చేకూరింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కంటే అదనంగా కొంత చేర్చి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద అందిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. నిధులు విడుదలవుతాయా? కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా రూ. 20 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడాదైనా ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లబ్ధి పొందడానికి సమీప రైతు సేవా కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేదెన్నడో... అర్హులను గుర్తించి నిధులు విడుదల చేసేదెప్పుడో.. అని రైతులు తలలు పట్టుకుంటున్నారు. భారంగా మారిన సాగు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటికేడు పెరుగుతున్నాయి. దుక్కి, కూలీల ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. వీటన్నింటిని దాటి పంటలను సాగు చేయాలంటే తగిన దిగుబడి చేతికి వస్తుందన్న ఆశ కూడా పూర్తిగా లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో కంటే తక్కువగా పంటలు సాగు చేస్తున్నారు.రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం, పంట నష్టపోతే బీమా పరంగా అండ లభించడం లేదు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి కనీసంపట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక సాయం అందివ్వని ప్రభుత్వం ఖరీఫ్ పెట్టుబడికి తప్పని పాట్లు నగదు లేక కష్టపడుతున్న అన్నదాతలు జిల్లాలవారీగా పరిస్థితి ఇదీ... జిల్లా అర్హులైన రైతులు ఈకేవైసీ పూర్తి ఈకేవైసీ పెండింగ్ గుంటూరు 1,07,942 1,02,731 5,211 పల్నాడు 2,39,110 2,31,495 7,615 బాపట్ల 1,59,157 1,52,842 6,315 -
లేబర్ కోడ్లను రద్దుచేయాలి
సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మణిలాల్ రేపల్లె: కార్మిక లోకానికి నష్టం చేకూర్చే లేబర్కోడ్లను ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం రేపల్లె పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, రైస్ మిల్ ముఠా, సివిల్ సప్లయర్స్ ముఠా, ఆశ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, సుమో డ్రైవర్లు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు, బజార్ ముఠా వర్కర్లు, మున్సిపల్ ఇంజినీరింగ్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. మణిలాల్ మాట్లాడుతూ దేశంలో కార్మికవర్గం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఉమ్మడిగా తిప్పికొట్టాలని కోరారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ధరల పెరుగుదలకు పరిహారంతో పాటు ఐదేళ్ల ఒకసారి కనీస వేతనాల సవరణ చేయాలని కోరారు. కేంద్రంలో 8వ వేతన సంఘాన్ని, రాష్ట్రంలో 12వ వేతన సంఘాన్ని నియమించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శామ్యూల్ మాట్లాడుతు కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం మాత్రమే అమలు చేయాలన్నారు. బిల్డింగ్ వెల్ఫేర్ లేబర్ బోర్డు పునరుద్ధరించాలన్నారు. కార్మిక చట్టాలను తనిఖీ చేసే లేబర్ అధికారుల విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. తొలుత వివిధ కార్మిక సంఘాల కార్మికులు బస్టాండ్ సెంటరులో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రింగు రోడ్డు వరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ, రైతు కూలీ సంఘాలతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు ర్యాలీగా భారీ ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఎం.శోభారాణి, నాయకులు కె.ఝాన్సీ సి.వాణిశ్రీ, పి.బిక్షాలు, ఎం.ఈశ్వరరావు, టి.బుజ్జి, పి.విజయ్, రాఘవ, కె.ఆశీర్వాదం, కె.రమేష్, జి.వెంకటేశ్వరరావు, కె.మాణిక్యరావు, ఎం.సాయి, కాలేశా పాల్గొన్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
పిడుగురాళ్ల రూరల్: మిరప నారు పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు సూచించారు. కామేపల్లి రైతు భరోసా కేంద్రంలో బుధవారం సమగ్ర ఉద్యాన మిషన్ ఆధ్వర్యంలో మిరప నారు పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు, డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ హాజరయ్యారు. ముందుగా కామేపల్లిలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రావు నర్సరీ చట్టం– 2010 గురించి యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జిల్లా డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి, సస్యరక్షణ , విత్తే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కో– ఆర్డినేటర్ మస్తాన్‌వలి, ఉద్యాన శాఖ అధికారి కుమారి అంజిలిబాయి, గ్రామీణ ఉద్యాన శాఖ అధికారులు కరిముల్లా, దస్తగిరి పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకట్రావు -
బాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి బాపట్ల: బాలలకు చదువుకునే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గణపవరం జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో విద్యార్థులతో పనులు చేయించటాన్ని గమనించి ఆమె ప్రధానోపాధ్యాయలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను, హాజరు పటికను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. వంటకాలను రుచి చూశారు. బాలల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1098 నంబరును ప్రతి చోట రాయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలో తప్పని సరిగా ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని కోరారు. బాల బాలికలకు వారి హక్కులకు భంగం కలిగిస్తే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బాపట్లలోని బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖముఖిగా మాట్లాడారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో చారులత, డీసీపీఓ పురుషోత్తమరావు, కర్లపాలెం ఎంఈఓ మనోరంజనీ పాల్గొన్నారు. -
నేటి నుంచి టౌన్‌చర్చి శతవార్షికోత్సవాలు
ఆహ్వానపత్రికను ఆవిష్కరిస్తున్న ప్యారిష్ పాస్టర్ రెవ.దేవరపల్లి ఏసురత్నం తెనాలి: పట్టణంలో టౌన్‌చార్చిగా పిలుచుకునే ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి(తూర్పు గుంటూరు సినడ్) క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ఆరంభం కానున్నాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, బ్రోచర్‌ను బుధవారం టౌన్‌చర్చిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి ఏసురత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై.లెనిన్‌బాబు, రెవరెండ్ డి.సాల్మన్‌రాజు, రెవరెండ్ ఎంవీబీ ప్రకాష్‌బాబు అడ్హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. 10,11,12 తేదీల్లో ఉదయం ప్రార్థన, ఆరాధనలు, సాయంత్రం చర్చి వెలుపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏఈఎల్ చర్చి కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళకు చెందిన మాజీ జడ్జి జోసెఫ్ పీఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఎన్.జేసురత్నకుమార్ హాజరవుతారని తెలిపారు. ● రెవ.వై.లెనిన్‌బాబు మాట్లాడుతూ హాఫ్దొర టౌన్చర్చిని కట్టించి విద్యాలయం, వైద్యశాలను నిర్మించి ప్రజలకు సేవలందించినట్టు తెలిపారు. మూడురోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవ.డి.సాల్మన్‌రాజు, రెవ.ఎంవీబీ ప్రకాష్‌బాబు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్‌జాన్స్ విద్యాసంస్థ పక్కన ఉన్న లూథరన్ యూపీ స్కూలు ప్రాంగణంలో ప్రేమ విందు ఉంటుందని అడ్హాక్ కమిటీ సభ్యుడు జి.వేమయ్య చెప్పారు. -
గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు గవర్నర్ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ గుంటూరు జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి, వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్‌క్రాస్‌కు అవార్డులు వరించాయి. వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు తెనాలిరూరల్: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా రూ.46,76,204 నగదు స్వామి వారికి సమకూరింది. అలానే 19.50 గ్రాముల బంగారం, 319 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించారు. అలానే రద్దయిన పాత రూ. వెయ్యి నోట్లు ఆరు, రూ. 500 నోట్లు పది గుర్తు తెలియని భక్తులు హుండీలో వేశారు. లెక్కింపులో భక్తులు, వలంటీర్లు, చెంచుపేట ఆప్కాబ్ బ్యాంక్ సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు. సమన్వయంతో సైబర్ నేరాలకు చెక్ నగరంపాలెం: పోలీస్ శాఖ, బ్యాంక్‌లు సమన్వయంతో సైబర్ నేరాలను అరికడదామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బుధవారం జిల్లాలోని బ్యాంక్‌ల మేనేజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దృష్ట్యా సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పిద్దామన్నారు. వినియోగదారులు పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే బాధితులకు ఎఫ్ఐఆర్ లేకుండా సహాయమందుతుందని చెప్పారు. ఖాతాదారులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి నగదు లావాదేవీలు నిర్వర్తించే వేళల్లో బ్యాంక్‌లను సంప్రదించి నిజనిజాలను పరిశీలించాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, లోన్ యాప్ మోసాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఖాతాదారులకు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), యూనియన్ బ్యాంక్ డీజీఎం జవహర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి, బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు. -
ఎండుతున్న రైతు గుండె!
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సకాలంలో వర్షాలు పడి కాలువలకు సమృద్ధిగా నీరు వస్తే పంట పొలాలు పైర్లతో కళకళలాడుతుండేవి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడటం, ప్రస్తుతం వరుణుడు మొహం చాటేయటం, ఈదురు గాలులు వీస్తుండటంతో మొలక దశలో ఉన్న నారు మడులు, వెద పెట్టిన పొలాలు మొక్క దశలోనే మాడిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బాపట్ల టౌన్: కళ్లెదుటే రైతుల ఆశలు ఆవిరి అవుతుండటంతో ఆవేదన చెందుతున్నారు. డీజిల్ ఇంజిన్లు, నీటిని పెట్టేందుకు అవసరమైన ట్యూబులు అద్దెకు ఇచ్చే షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు, ఎరువులకు రూ.వేలకు వేలు ఖర్చు చేసి నారుమడులు పోసుకున్న రైతులు మొక్క దశలో ఉన్న పైరును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. సహజంగా రైతులకు నీటి కష్టాలు అక్టోబర్ మాసంలో పైర్లు బిర్రుపొట్ట దశలో ఉన్నప్పుడు తలెత్తేవి. ఒకటి, రెండు తడులు అందిస్తే ఈని నవంబర్, డిసెంబర్ మాసాల్లో కోతలకు వచ్చేవి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆదిలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. నారు మడుల దశలోనే డీజిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లోని రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.పది వేలు ఖర్చు బాపట్ల జిల్లాలో ఏటా రైతులు నార్లు పోసుకొని, నాట్లు వేసుకునే పద్ధతికే మక్కువ చూపేవారు. ఈ ఏడాది జూన్ మాసంలో వర్షాలు కురవడంతో నారు మడులతోపాటు వెద పద్ధతి వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం మొలకలు వచ్చిన పైర్లు కూడా భూమిలో తేమ లేకపోవడం, భానుడి భగభగతో మాడిపోతున్నాయి. నారు మడులు అయితే పూర్తిగా ఎండిపోతున్నాయి. వెద పద్దతిలో సాగు చేసిన పొలాలకు విత్తనాల కొనుగోలు, ట్రాక్టర్ల కూలీ, మందుల పిచికారి, దుక్కులు ఇలా అన్నీ కలిపి ఇప్పటికే ఎకరాకు రూ. 10 వేల వరకు ఖర్చు చేశారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. న్యూస్రీల్నాలుగు రోజుల్లో కాలువలకు నీరు ప్రస్తుతానికి మున్సిపాలిటీ చెరువుకు తాగునీటి అవసరాలకు కాలువల నీటిని అందిస్తున్నాం. రెండు రోజులుగా దీనికే సరఫరా చేస్తున్నాం. పీటీ చానల్‌కు నాలుగు రోజుల్లో నీరు విడుదల చేస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.– వెంకటరమణ, ఇరిగేషన్ జేఈఈ, బాపట్ల కాలువ నీరు వస్తే మేలు మాది చీరాల మండలం, గవినివారిపాలెం. కర్లపాలెం మండలం సమ్మెట వారి పాలెం పంచాయతీ పరిధిలో పొలం ఉంది. ఇటీవల కాలువలకు సాగునీరు రావడంతో నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోశా. ప్రస్తుతం నీరు రావడం లేదు. కొద్దిపాటి నీటిని కాలువ మొదట్లో ఉన్న రైతులు డీజిల్ ఇంజిన్లతో వాడుతున్నారు. బోరు ద్వారా నీటిని అందించేందుకు పైపులు తీసుకెళ్తున్నా. – శ్రీనివాసరావు, రైతు, గవినివారిపాలెం పెరిగిన ఖర్చులతో భారం పీటీ చానల్ పరిధిలో హైదరపేట – సమ్మెట వారి పాలెం మధ్యలో 3 ఎకరాలు ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నాలుగు రోజుల క్రితం నాట్లు వేసేందుకు నారు విత్తనాలు పోశా. ప్రస్తుతం నారు మొలకదశలో ఉంది. వర్షాలు పడటం లేదు. కాలువల్లో నీరు అడుగంటిపోయింది. డీజిల్ ఇంజిన్‌తో తడులు అందిస్తున్నా. మొత్తం తడపాలంటే రూ. 2,500 నుంచి రూ.3,000 వరకు ఖర్చు అవుతోంది. – పిట్టు గురవారెడ్డి, శీలంవారిపాలెం ఆదిలోనే తప్పని క‘న్నీటి’ కష్టాలు నీరందక ఎండిపోతున్న నారు మడులు డీజిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్న అన్నదాతలు ఎకరం తడిపేందుకు రూ.వేల ఖర్చు కాలువల్లో అడుగంటిన సాగునీరు ఆందోళనలో మునిగిపోయిన రైతులు -
కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బాపట్ల: మాజీ గవర్నరుగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకరుగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసిన దివంగత కోన ప్రభాకరరావు విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే పాత బస్టాండ్ వద్ద డివైడర్‌పై తిరిగి ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి కోరారు. బుధవారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోన మాట్లాడుతూ.. రాష్ట్రానికి, దేశానికి కోన ప్రభాకర రావు చేసిన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల పట్టణానికి తాగునీరు అందించిన ఘనత కోన ప్రభాకరరావుకే దక్కుతుందన్నారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చే విధంగా బాధ్యతలు నిర్వహించారన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రహదారి విస్తరణలో పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి తిరిగి ఏర్పాటు చేస్తామని ఆ రోజు తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆ తీర్మానం అమలుకు నోచుకోలేదని, ఆయన జయంతి సందర్భంగానైనా పురపాలక సంఘం అధికారులు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలన్నారు. సుప్రీంకోర్టు సైతం డివైడర్లపై విగ్రహాలు పెట్టుకోవచ్చనే సూచన చేసిందన్నారు. మరి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. రహదారి విస్తరణలో తొలగించిన విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, గుర్రం జాషువా విగ్రహాలను తొలగించి మూలన పెట్టేశారన్నారు. వాటిని కూడా తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. గురువారం జరిగే కోన ప్రభాకరరావు జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జోగి రాజా, శ్రీనివాసరెడ్డి, తన్నీరు అంకమ్మరావు తదితరులు ఉన్నారు. -
నేరాల నియంత్రణకు డ్రోన్ల నిఘా కీలకం
బాపట్ల టౌన్: నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా కీలకమైందని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్లకు ఆయా స్టేషన్ల పరిధిలోని దాతలు డ్రోన్లను అందించారు. బుధవారం దాతలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణలో డ్రోన్ల ద్వారా నిఘా కీలకమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు అందించడం అభినందనీయం అన్నారు. డీజేఐ మినీ–3 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు అందించారన్నారు. నిజాంపట్నం పోలీస్‌స్టేషనుకు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఒకటి, నిజాంపట్నంలోని ఏబీఏడీ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ పెర్ల్ మైరెన్ కంపెనీలు సంయుక్తంగా మరో డ్రోన్ అందించాయి. రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌కు డి.పి.ఎస్. ఫుడ్స్ తరఫున ఒకటి, భట్టిప్రోలు పోలీసు స్టేషనుకు కొల్లూరు మండలం జువ్వలపాలం చెందిన వేములపల్లి రవికిరణ్ ఒకటి, చెరుకుపల్లి పోలీస్ స్టేషనుకు మండలంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ ఒకటి, వేమూరు పోలీస్ స్టేషనుకు హైదరాబాద్‌కు చెందిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డ్రోన్ బహూకరించినట్లు తెలిపారు. అనంతరం దాతలను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాస రావు, రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జున రావు, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, వేమూరు సీఐ ఆంజనేయులు, నిజాంపట్నం, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి ఎస్ఐలు పాల్గొన్నారు. ఆరు డ్రోన్లను అందించిన దాతలు జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ అభినందన -
రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్ కోడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్, పీడీ డ్వామా శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్ సుజాత,అధికారులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వేదవ్యాస ఆరాధన అమరావతి: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాసాలయంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో రెండవరోజు కార్యక్రమాలలో భాగంగా బుధవారం వ్యాస భగవానునికి సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, వ్యాస ఆరాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భవఘ్ని గురూజీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గం పట్టకుండా సన్మార్గంలో నడిపించడానికి వ్యాస భగవానుడు అందించిన భగవద్గీత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వేడుకలలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, షూక్ బాపూజీ పద్యనాటకం భక్తులను ఎంతగానో అలరించాయి. భక్తులు పలు జిల్లాల నుంచి భారీగా పాల్గొన్నారు. జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సీఈ విజయపురి సౌత్: నాగార్జునసాగర్ కుడి కాలువ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ జి.తిరుమల ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్కో క్వార్టర్స్‌ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్‌ను జెన్కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్ కేంద్రం ఈఈ సీహెచ్ అప్పాజీ, సివిల్ ఎస్ఈ కె.వెంకటరమణ, సివిల్ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్ సెక్రటరీ బి.సూరజ్‌చంద్, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అమరేశ్వరుని ఆదాయం రూ.27.09 లక్షలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596, మొత్తం రూ.27,09,095 వచ్చిందన్నారు. -
ఎర్ర జెండాలు కన్నెర్ర
ఎర్ర జెండాలతో చీరాల పట్టణంలో ర్యాలీ తీస్తున్న వివిధ రంగాల కార్మికులు చీరాల: కార్మికులను కట్టు బానిసలుగా మార్చడంతోపాటు కంపెనీల యాజమానులకు అధిక లాభాలను తీసుకొచ్చేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన కార్మిక చట్టాలను రూపొందించాయని ఏపీ ఐఎల్టీడీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధనలక్ష్మి పేర్కొన్నారు. దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె చీరాలలో విజయవంతం అయింది. సీఐటీయూ, వైఎస్సార్టీయూసీ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నాయి. కార్మికుల హక్కులను, రక్షణను విస్మరించే చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నాయకులు, కార్మికులు ఎర్ర జెండాలతో సమ్మె నిర్వహించారు. ఈ కారణంగా ఐఎల్టీడీ కంపెనీ మూతపడింది. కంపెనీ వద్ద జరిగిన ప్రదర్శనలో ఫెడరేషన్ నాయకులు ధనలక్ష్మి మాట్లాడారు. వంద సంవత్సరాల క్రితం సమ్మెలు చేసి కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్నారని, ప్రస్తుత చట్టాలు అమల్లోకి వస్తే ఆ చట్టాలన్నీ కోల్పోతారన్నారు. పట్టణంలో వివిధ కార్మిక సంఘాలు, అంగన్వాడీ, మెప్మా, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ నాయకులు వసంతరావు, గోసాల సుధాకర్, పఠాన్ కాలేషా, కె.రామకృష్ణ, బాబ్జి, కాలేషా, ఆనందబాబు, నాగరాజు, వెంకటేశ్వర్లు, పోతురాజు, అమీర్, కార్మికులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి బాపట్ల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో బుధవారం బాపట్లలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి జీబీసీ రోడ్డు, రథం బజారు ద్వారా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది.ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, ఏఐటీయూసీ నాయకులు సింగరకొండ, కె.శరత్, బి.తిరుమలరెడ్డి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజబెత్, గీత, కృష్ణవేణి, రాహేలు, రత్నం, బుచ్చిరాజు హరిబాబు, ఒ.లక్ష్మణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మె విజయవంతం యజమానులకు లాభాలు తెచ్చేందుకే లేబర్ కోడ్స్ మండిపడిన కార్మిక లోకం -
శరణు శాకంబరి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరి ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. కనకదుర్గనగర్, మహామండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కదంబ ప్రసాదం పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలో చేసిన అలంకారం నుంచి ఒక్క కూరగాయ, ఆకుకూరనైనా ఇంటికి తీసుకువెళ్లాలనే భావనతో భక్తులు కూరగాయల కోసం ఎగబడటం కనిపించింది. చివరి రోజైన గురువారం అమ్మవారిని పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించనున్నారు. ఇందు కోసం యాలకులు, జీడిపప్పులతో దండలను సిద్ధం చేస్తున్నారు. యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. -
వారధిపై అలుముకున్న అంధకారం
రేపల్లె: పెనుమూడి – పులిగడ్డ వారధి అంధకారంలో మగ్గిపోతోంది. ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అనుసంధానంగా ఉన్న ఈ వారధి రాష్ట్రంలో రెండో అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీధి దీపాలు మరమ్మతులకు గురవ్వటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వంతెనపై రాత్రివేళ ప్రయాణం చేయడం కత్తిమీద సాములా మారింది. రోజూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. పులిగడ్డ – పెనుమూడి మధ్య ప్రయాణించాల్సిన వారికిదే ప్రధాన మార్గం. తరచూ ప్రమాదాలు ఇటీవల రేపల్లె మండలం ఆరవపల్లికి చెందిన కుటుంబం మచిలీపట్నం బీచ్‌కి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా తెనాలికి చెందిన కుటుంబం మోపిదేవి గుడికి కారులో వెళ్తూ ఉండగా వారధిపై జరిగిన ప్రమాదంలో వారిలోని ముగ్గురు చనిపోయారు. రుద్రవరానికి చెందిన యువకుడు, పేటేరుకు చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదం గురై మృత్యువాత పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో పాత దీపస్తంభాలు ఉన్నా కరెంట్ సరఫరా లేదు. ఈ వంతెనపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం పెనుమూడి – పులిగడ్డ వారధిపై లైటింగ్ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రాత్రి సమయంలో లైటింగ్ లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను వివరించి, సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం. – శ్రీనివాసరావు, తహసీల్దార్ నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు విద్యుద్దీపాలు వెలగకపోవటంతో తరచూ ప్రమాదాలు -
పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎస్పీ తుషార్ డూడీ ––––––––––––––––––––––– బాపట్లటౌన్: కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్‌డూడీ హెచ్చరించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని కళాశాలలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల అనంతరం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తుల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు, పాన్, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై కోట్పా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, ఆ లక్ష్య సాధన కోసం కృషి చేసే సమయంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు, టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
● గుంటూరు అర్బన్ నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీలు ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్‌లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. కనీసం ఐదు ఆప్షన్లల్లో ఒకట్రెండు వాటికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఏడు నెలల బాబు ఉన్నాడని దరఖాస్తులో తెలియజేసినా గుంటూరు అర్బన్ నుంచి మేడికొండూరు మండలం రూరల్‌కు బదిలీ చేశారని ఓ మహిళా పోలీస్ వాపోయింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అందుబాటులో లేరని చెప్పడంతో డీపీఓ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో చంటి బిడ్డలతో వచ్చిన వారు సైతం వెనుదిరిగి వెళ్లారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు శరత్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అర్ధనగ్న మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. శరత్ మాట్లాడుతూ 15రోజులుగా వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం చేపట్టిన చలో విజయవాడకి తరలిరావాలని కోరారు. జూలై 4నుంచి అత్యవసరాలు మంచినీళ్లు, విద్యుత్తు లాంటి విధు లు నిర్వహిస్తున్న కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలుచేయాలి, జీవో నెంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనం అమలుచేయాలని, తక్షణం తల్లికి వందనం ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గత సంవత్సరం 17రోజుల సమ్మె ఒప్పందాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, బాపట్ల పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూని యన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నాయకులు శరత్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిబాపట్ల: వర్షాకాలంలో సీజనల్ అంటు వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దిగువ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ ఫీవర్ వచ్చే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్లు నమోదైతే తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో అత్యవసరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా నివారించడమే ముఖ్యోద్దేశం అన్నారు. సాధారణం కంటే జ్వరాల కేసులు ఏ ప్రాంతంలోనైనా అధికమైతే వెంటనే సమాచారం పంపాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన ఔషధాలను నిల్వ చేసుకోవాలన్నారు. ఔషధాల కొరత లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కాల్వల పూడికతీత పనులు వేగంగా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలు, గృహాల మధ్య నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నిర్లిప్తంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. భూమిలో కుళ్లిపోయే స్వభావం ఉన్న వ్యర్థాలను పచ్చ కుండీలు, ప్లాస్టిక్ తదితరమైన వ్యర్థ పదార్థాలను ఎరుపు చెత్తకుండీలో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా, సాగర్ కాల్వల నుంచి నీరు విడుదలవుతున్నందున జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ చెరువులన్నిటిని నింపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీపీఓ ప్రభాకరరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు
డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి చీరాలటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వలసలు నిర్మూలించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సిబ్బంది, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై తనిఖీ చేపట్టారు. మండలంలో చేపట్టిన 1243 పనులు, ఖర్చులు రూ.9 కోట్లు, పంచాయతీరాజ్ నిధులు రూ.1.82 కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీఎన్ రూ.6.95 కోట్లతో ఉపాధి పనులు చేశారు. పంట కాలువలు, పూడికతీత పనులు, గోకులం షెడ్లు 10 నిర్మాణాలు, ఉపాధి కూలీలకు చెల్లించిన నగదు, వసతులు, మెటీరియల్ సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులపై సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారిగా చేసిన పనులను వివరించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు, చెల్లింపుల వివరాలను, కూలీలు వివరాలను సిబ్బంది అధికారులకు వివరించారు. సామాజిక తనిఖీకి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పీడీ విజయలక్ష్మి వ్యవహరించగా జిల్లా హెచ్ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, ఎంపీడీవో శివన్నారాయణ, జిల్లా ఏపీడీ కోటయ్య నాయక్, ఏపీవో దాసు, ఫీల్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల గురించి డ్వామా పీడీ పలు సూచనలు చేశారు. -
రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
–రేషన్ దుకాణం సీజ్ చేసిన ఆర్డీఓ చీరాల టౌన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడే డీలర్లపై చర్యలు తప్పవని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని 38 నంబర్ రేషన్ దుకాణంపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ, ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైకుంఠపురంలోని 38 నెంబర్ రేషన్ దుకాణదారుడు దుడ్డు ప్రభాకర్ ప్రజలకు బియ్యం, పంచదార సక్రమంగా అందించకుండా నగదు చెల్లించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో దుకాణానికి కేటాయించిన బియ్యం, పంచదారకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో 300 కిలోల రేషన్ బియ్యం, 57 ప్యాకెట్లు పంచదార అదనంగా ఉండటంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ దుకాణాన్ని, సరుకులను సీజ్ చేశారు. ఆర్డీవో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా ప్రజల నుంచి నగదుకు కొనుగోలు చేసినా, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంటే కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. రేషన్ డీలర్లు విధిగా నిబంధనల ప్రకారం సరుకులు పంపిణీ చేసి స్టాక్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడినా, బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన బియ్యం, పంచదారను ఎన్ఫోర్స్మెంట్ డీటీ గీతాకు అందించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ కె.గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
‘నూటా’ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు
ఏఎన్‌యూ: నూటా (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యాపక సంఘం) ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నూటా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల అధికారి ఆచార్య ఎస్.మురళీమోహన్‌కు మంగళవారం వారిరువురూ వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియలోని లోపాలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తమ పిటీషన్‌పై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు నూటా ఎన్నికల కోసం ఈనెల 1వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
గుంటూరు వెస్ట్: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్‌కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులలో కొరవడిన సమన్వయం జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్‌లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్‌లు రాలేదు. – ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ -
రైలు కింద పడి యువకుడు మృతి
రేపల్లె: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు సికింద్రాబాద్ నుంచి రేపల్లెకి రాత్రి 9 గంటలకు వచ్చే డెల్టా ఎక్స్‌ప్రెస్ కింద యువకుడు పడి మృతి చెంది ఉండటాన్ని రైల్వే గ్యాంగ్మెన్లు గమనించి మంగళవారం సమాచారం ఇచ్చారన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు నగరం మండలం ధూళిపూడి గ్రామానికి చెందిన కొండవీటి మణి (25)గా గుర్తించామన్నారు. మోర్లవారిపాలెం రైల్వే గేటుకు సమీపంలో ప్రమాదం జరిగిందన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. -
పికిల్ బాల్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరువెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం గుంటూరులోని వీవీవీ హెల్త్‌క్లబ్‌లో నిర్వహించారు. ఎన్నికలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి పి.నరసింహా రెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఒలింపిక్ సంఘం నుంచి కె.వేణుగోపాల్‌తోపాటు న్యాయవాది చిగురుపాటి రవీంద్రనాధ్ హాజరయ్యారు. చీఫ్ ఇన్ ప్యాట్రన్‌గా టి.అరుణ్ కుమార్, చైర్మన్‌గా చుక్కపల్లి రాకేష్, గౌరవాధ్యక్షుడిగా టి.హరికిషన్ సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎం.శివకుమార్, ఉపాధ్యక్షులుగా సి.హెచ్.రవీంద్రబాబు, ఎన్వీ కమలాకాంత్, ఎస్వీ రామకోటేశ్వరరావు, డాక్టర్ పి.వరుణ్, డాక్టర్ టి.హనుమంతరావు, ఎం.భరత్ కుమార్, కార్యదర్శిగా జీవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఎం.కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఫణీంద్ర, ఎన్ ఫణిరామ్, ఎస్కే మన్సూర్ వలి, ఎ.సుబ్బారావు, నిర్వహణ కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా కె.సుస్మితా చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
రక్షించేందుకు తోటి రైతులు చేసిన ప్రయత్నం విఫలం కొల్లూరు : వరి ఎండిపోకుండా పంటకు నీరు పెట్టే క్రమంలో కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యుఒడిలోకి చేరిన సంఘటన కొల్లూరులో జరిగింది. కుటంబ సభ్యులు, స్థానిక రైతుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు గుంటపునుగులు చెట్టు ప్రాంతానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావు (53) వరి చేనుకు విద్యుత్ మోటరు సాయంతో నీరు పెట్టేందుకు మంగళవారం ఉదయం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న పొలం వద్దకు సహచర రైతులతో కలసి వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఆలస్యం కావడంతో తోటి రైతులకు ఫోన్ చేసి సరఫరా సమయంపై ఆరా తీసి అక్కడే వేచి ఉన్నాడు. కొద్ది సేపటికి కరెంట్ రావడంతో మోటరు ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. స్టార్టర్ బాక్స్‌కు విద్యుత్ వెలువడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని రక్షించేందుకు కర్రలతో కొట్టడంతో పక్కకి పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని హుటాహుటిన కొల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లగా, వైద్యులు సూచనలతో తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, వివాహమైన కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్ ్స వివరాల సేకరణ సత్తెనపల్లి: క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విజిలెనన్స్ అధికారులు మంగళవారం వివరాలను సేకరించారు. విజిలెనన్స్ రేంజ్ ఇన్స్పెక్టర్ షేక్ సైదులు నేతృత్వంలోని నలుగురు విజిలెన్స్ బృందం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఆర్వో అప్పారావు వద్ద వివరాలు కోరారు. ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ఇచ్చి దాని ప్రకారం వివరాలు నింపాలని సూచించారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామ/వార్డు సచివాలయాల అడ్మిన్లు అందర్నీ మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి వారి చేత ప్రొఫార్మా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు. మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు సత్తెనపల్లి:పోలీసుల విచారణకు హాజరు కావాలని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారంటూ పలు సెక్షన్లతో విచారణకు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 11న సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీ గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్ ఉర్దూ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో చేరేందుకు అర్హులైన పేద ముస్లిం విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు సంప్రదించాలని ప్రిన్సిపల్ పి. సాంబశివరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బైపీసీలో 20, సీఈసీలో 15 సీట్లలో ప్రవేశానికి బీసీ–ఈ, బీసీ–బీ కేటగిరీ విద్యార్థులు అర్హులని తెలిపారు. నేడు సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ లక్ష్మీపురం: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. పాలకులను హెచ్చరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభం అవుతుందని చెప్పారు. బీఆర్ స్టేడియం వరకు సాగుతుందని వివరించారు. అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, యువత, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్‌పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్‌కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. కరీమూన్, రజియా, సైదాబీలు ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ నెల 2వ తేదీన బయలుదేరారు. కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం ప్రత్యేక బృందాన్ని కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తన సిబ్బందితో ఏఎస్సై ఆంటోని, హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావు, కోటేశ్వరరావు, నరసింహారావు, మాణిక్యరావుల సహాయంతో హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలో వీరు ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై ఇనుప రాడ్లతో దాడి
చీరాల అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావూరి బాలకోటిరెడ్డిపై టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుడు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు కావూరి బాలకోటిరెడ్డి తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం కొత్తపాలేనికి చెందిన కావూరి బాలకోటిరెడ్డి మంగళవారం చీరాల నగర్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో దండుబాట వద్ద చెట్టు కింద కూర్చున్నాడు. ఈ సమయంలో బక్కా శివప్రసాద్‌రెడ్డి అనుచరులు రాజు సుబ్బారెడ్డి, బక్కా పరుశురామిరెడ్డిలు.. బాలకోటిరెడ్డిపై ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. రాజకీయంగా గ్రామంలో కీలకంగా మారుతున్నావని.. ప్రజలకు అన్ని విషయాల్లో తోడుంటున్నావని.. నీవు లేకపోతే తమకు అడ్డు ఉండదంటూ దుర్భాషలాడారు. అన్నింటా అడ్డు తగులుతున్నావని, సర్పంచ్‌గా పోటీ చేస్తానని చెబుతున్నావంటూ గాయపరిచారు. తలకు బలమైన గాయం కావడంతో బంధువులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. ఈ మేరకు ఒన్‌టౌన్ పోలీసులు బాధితుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేశారు. దాడి సంఘటన సమాచారం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, పార్టీ నాయకులకు ఏరియా వైద్యశాలకు వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. దాడి చేయడం హేయమైన చర్య అని, టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ప్రకృతి మాతకు ప్రణామం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శాకంబరీ ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. నూతన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, ఉపాలయాలను కరివేపాకు, నిమ్మకాయలు, వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో ఏర్పాటుచేసిన శివలింగాకృతి, పక్కనే స్వామి వారికి నమస్కరిస్తున్న అమ్మవారు, కుమార స్వామి, గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. నీటి కొలనులో సొరకాయలతో తీర్చిదిద్దిన హంసలు, దోసకాయలతో రూపొందించిన బాతులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కాకరకాయలతో చేసిన మొసలి విశేషంగా ఆకట్టుకుంటోంది. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు. కదంబం కోసం బారులు తీరిన భక్తులు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ఏడో అంతస్తులో ఉచిత ప్రసాద వితరణ వద్ద ఉదయం ఆలయ ఈఓ శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాద పంపిణీని ప్రారంభించారు. పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తబృందాలు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ ఈవో అన్నప్రసాద తయారీ పోటులో కదంబ ప్రసాద తయారీని పరిశీలించారు. ప్రసాద తయారీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుందరికి ప్రసాదం అందేలా చూడాలని ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సిన భక్తులు కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసిన దండలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగాశాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మకు అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు