గుంటూరు రూరల్: రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ‘ఇఫ్తార్ దావత్’ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న శ్రీ కన్వెన్షన్ హాల్‌ను బుధవారం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ఖాదర్‌బాషా, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, కదిరి ఇన్‌చార్జి షేక్ మగ్బూల్‌బాషా, జిల్లా మైనారిటీ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్, లియాఖత్, షేక్ సలీం, ఘనికా ఝాన్సీ తదితరులు పరిశీలించారు. చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.
గుంటూరుకు వైఎస్ జగన్ రాక


