కర్లపాలెం: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసియున్న చెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. బుధవారం స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిత్యహోమం, బలిహరణ పూజలు జరిపించి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్రస్నానం చేయించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నగరోత్సవం చేశారు. రాత్రికి ధ్వజారోహణం, పూర్ణాహుతి, శాంతిహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడు ఎండూరి సాయిగుప్తా, ఆలయ అర్చకులు వేదాంతం కృష్ణమాచార్యులు, వరదాచార్యులు, చెన్నకేశవ, కేశవ రామానుజులు, ఈవో నరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు.


