సీడీపీవో సుచిత్ర
రేపల్లె: సమాజంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయని, వీటిపై అవగాహన తప్పనిసరని సీడీపీవో ఎం.సుచిత్ర చెప్పారు. మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక సాధికారత అంశాలపై పట్టణంలోని ఆంధ్ర రత్న హైస్కూల్, శివాజీ స్కూల్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా వినియోగంలో అనుమానాస్పద లింక్‌లకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం అపరిచితులతో పంచుకోరాదన్నారు. సాంకేతికతను తమ అభివృద్ధికి వినియోగించాలేగాని, దుర్వినియోగానికి కాదన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత దిశగా పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సిహెచ్ హిమబిందు, ఇన్‌చార్జి హెచ్‌ఎం రాము, ఉపాధ్యాయులు కౌసల్య, శైలజ, అనూష, అంగన్‌వాడీలు నాగలక్ష్మి, బాజీ, నసీమ, మల్లీశ్వరి, ఆర్‌పీలు పర్విన్, సుమీనా, తదితరులు పాల్గొన్నారు.


