నేడు ఆశ కార్యకర్తల ధర్నా | - | Sakshi
Sakshi News home page

నేడు ఆశ కార్యకర్తల ధర్నా

Mar 5 2026 7:33 AM | Updated on Mar 5 2026 7:33 AM

సీఐటీయూ జిల్లా కోశాధికారి మణిలాల్‌

రేపల్ల: ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం విజయవాడలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఆశలు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి మణిలాల్‌ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం సందర్భంగా ఆశ కార్యకర్తలు రేపల్లె మండలంలోని మోళ్ళగుంట, విశ్వేశ్వరం పీహెచ్‌సీలలో సీఐటీయు ఆధ్వర్యంలో మెడికల్‌ ఆఫీసర్‌లకు బుధవారం వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. పనికి తగిన కనీస వేతనాలు అమలుచేయాలన్నారు. అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, శిక్షణ పొందిన ఏఎన్‌ఎం, జిఎన్‌ఎంలకు పర్మినెంట్‌ పోస్టులు భర్తీచేయాలన్నారు. మృతి చెందిన వారికి దహన సంస్కారాల ఖర్చులు అందించాలన్నారు. నియామకాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్‌ల సంఖ్యను పెంచాలన్నారు. ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. సీహెచ్‌సీకి వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏలు, డీఏలు ఇవ్వాలన్నారు. రూ.10లక్షల ఇన్సూరెన్‌న్స్‌ సౌకర్యం కల్పించి, నాణ్యమైన మొబైల్స్‌, యూనిఫామ్‌ అందించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు దానమ్మ, గ్లోరీ, బుజ్జి, దేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement