సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
లక్ష్మీపురం: కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల సమస్యలను మానతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ అన్నారు. గుంటూరు పోస్టల్ డివిజన్‌లో ఆదివారం నేషనల్ యూనియన్ పోస్టల్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం జరిగింది. వాసిరెడ్డి శివాజీ మాట్లాడుతూ 8వపే కమిషన్‌లో జీడీఎస్ ఉద్యోగులను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సేవల్లో కొన్ని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చెంది కొత్తవి రావాలని, ఇంకా వెల్ఫేర్ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రైవేటైజేషన్ కి అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, సర్కిల్ సెక్రటరీ డేవిడ్ రాజు, పోస్ట్‌మెన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ, డిప్యూటీ సర్కిల్ సెక్రెటరీ నవీన్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్, జీడీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ యోగేశ్వరరావు పాల్గొన్నారు.
నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ శివాజీ


