వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

బాపట్ల: వుహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మార్కెట్‌ యార్డు సమీపంలోని జాతీయ రహదారిలో ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు బుధవారం కలిశారు. మార్కెట్‌ యార్డు వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కూడా చేపట్టామని వివరించారు. దీంతోపాటు తవ్వకాలువ సర్కిల్‌ వద్ద ఉన్న విగ్రహాన్ని రోడ్డు విస్తరణ సమయంలో తొలగించినప్పుడు మహానేత పేరుతో సర్కిల్‌ ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్‌ తీర్మానం కూడా చేశారని గుర్తుచేశారు. ఈ రెండు చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కూడా వినతిపత్రాలు ఇవ్వటంతోపాటు పలు అనుమతులు కూడా తీసుకొచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, నాయకులు మచ్చా శ్రీనివాస్‌రెడ్డి, పిన్నిబోయిన ప్రసాదరావు, కటికల యోహోషువా, ఆట్ల ప్రసాదరెడ్డి, రంగయ్య, మోషే తదితరులు ఉన్నారు.

‘సౌర’ యూనిట్లలో ముందంజ అవసరం

సూర్య ఘర్‌ యూనిట్ల స్థాపనలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. 24,620 యూనిట్లు స్థాపించాలని పేర్కొన్నారు. జిల్లాకు 45 గోదాములు మంజూరు కాగా, అందులో 20 ఇప్పటికే పూర్తి చేశామన్నారు.

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. బాపట్ల జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు ఆయా కేంద్రాలలోనే పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. వెంట బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, తహసీల్దార్‌ షాలీమా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement