బాపట్ల
న్యూస్‌రీల్
నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం
శ్రీవారి వార్షికోత్సవాలు
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
7
మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి
దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత
వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన బుధవారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై
గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన వారు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు.
నేడు యాలి వాహనంపై.....
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. – మంగళగిరి టౌన్
చరిత్రకు దర్పణం భట్టిప్రోలు తిరునాళ్ల
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5500, గరిష్ట ధర రూ.7000, మోడల్ ధర రూ.6200 వరకు పలికింది.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 538.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 40,593 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
దుగ్గిరాల: రైలుపేట కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలలో బుధవారం హనుమంతుని హోమం ఘనంగా నిర్వహించారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


