ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్ అమ్మాయి..!
చీరాల: ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్ అమ్మాయి ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. బాపట్ల మండలం కంకటపాలేనికి చెందిన యార్లగడ్డ వెంకట సుబ్బారావు కుమారుడు సాయి సూర్య, సింగపూర్ దేశానికి చెందిన ఎన్‌జీ షా చ్యూ–వాంగ్ క్వీయిన్ దంపతుల కుమార్తె రోయని ఎన్‌జీలువో యాన్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చీరాల్లో వివాహం చేసుకున్నారు. బుధవారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వివాహం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన అమ్మాయి తరుఫున వారందరూ సంప్రదాయబద్ధంగా చీరలు ధరించి వేడుకకు హాజరయ్యారు.


