డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయండి | - | Sakshi
Sakshi News home page

డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయండి

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయండి

డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయండి

డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయండి నేటి నుంచి యార్డులో రైతులకు ఉచిత భోజనం 28న ఐటీ కెరీర్‌పై గైడెన్స్‌, జాబ్‌మేళా

– గుంటూరు వెస్ట్‌, సౌత్‌ డీఎస్పీలకు ఆదేశాలు

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు వెస్ట్‌ డీఎస్పీ కె.అరవింద్‌, గుంటూరు సౌత్‌ డీఎస్పీ జి. భానోదయలను డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2018 గ్రూప్‌–1లో సెలెక్టయిన డీఎస్పీలు రాష్ట్రంలోని పలు చోట్ల విధులు నిర్వహిస్తున్న 25 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు డీఎస్పీలను రిపోర్టు చేయాలని సూచించారు.

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డులో గురువారం నుంచి రైతులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత భోజనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉచిత భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా రైతులకు అందించడం జరుగుతోందని ఆమె వెల్లడించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: కోడింగ్‌ ట్యూటర్‌ ఆధ్వర్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాలను సాధించేందుకు అవసరమైన గైడెన్స్‌తో పాటు జాబ్‌ మేళాను ఈనెల 28న నిర్వహించనున్నట్లు సంస్థ సీఈఓ ఫణిరాజ్‌ జాలిగామ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్‌పేటలోని హోటల్‌ వీ రాయల్‌ పార్క్‌లో జరిగే కెరీర్‌ గైడెన్స్‌లో పాల్గొనేందుకు సెల్‌ నంబరు 96979 89788 లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement