అటవీ రాయబారులుగా వెలుగొందాలి
బాపట్ల: వ్యవసాయ విద్యార్థులు స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిబద్ధతతో సాగితే వ్యవసాయ అటవీ రాయబారులుగా వెలుగొందుతారని ఐసీఏఆర్ సీఏఎఫ్‌ఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ఎ.అరుణాచలం అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ‘‘స్థిరత్వం కోసం వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించే అడవుల పెంపకం’’పై అతిథి ఉపన్యాసకులుగా ఆయన ప్రసంగించారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని అటవీరహిత ప్రదేశాలలో చెట్లను పెంచడం ద్వారా 33% అటవీ విస్తీర్ణతను పెంపొందించవచ్చన్నారు. ప్రపంచ వృక్ష గణాంకాల గురించి వివరించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి మాట్లాడుతూ పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర నిపుణులు డాక్టర్ కె.ఎస్.రావు, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఏవీ రమణ, సేద్య విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
డైరెక్టర్ డాక్టర్ ఏ.అరుణాచలం


