● శాంతియుతంగా ధర్నా చేస్తున్న
వారి అరెస్టును ఖండిస్తున్నాం
● వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెల్డా ఫ్లారెన్స్
నరసరావుపేట: అంగన్‌వాడీ వర్కర్ల ధర్నా శిబిరంపై దాడి హేయమని వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెల్డా ఫ్లారెన్స్ పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్‌వాడీల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్ వాడీలకు వేతనాలు పెంచుతామని టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్క్డటీ నెరవేర్చలేదని అన్నారు.
● అంగన్‌వాడీలుగా పనిచేస్తున్న వారందరూ పేద కుటుంబాల వారని, వారికి అరకొర వేతనాలతో జీవించడం దుర్లభంగా ఉందన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా టెంటులోని వారిని అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.
● తమ పార్టీ అధికారంలో ఉండగా అంగన్‌వాడీలు 42 రోజులు సమ్మెను శాంతియుతంగా చేశారన్నారు. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 42 రోజులకు సంబంధించి జీతాలు కూడా ఇవ్వటం జరిగిందన్నారు.
● అడిగిన తొమ్మిది డిమాండ్లు కూడా ఆ రోజున తమ ప్రభుత్వం జీవోలతో సహా హామీ ఇవ్వటం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లో ఎన్నిసార్లు ధర్నా చేస్తే అన్నిసార్లు జీతాలు కట్ చేయటం హేయం అన్నారు.


