వైభవం... ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

వైభవం... ధ్వజారోహణం

Feb 24 2026 7:16 AM | Updated on Feb 24 2026 7:16 AM

వైభవం... ధ్వజారోహణం

వైభవం... ధ్వజారోహణం

వైభవం... ధ్వజారోహణం

నృసింహుని కల్యాణానికి దేవతలకు ఆహ్వానం ధ్వజారోహణంలో గరుత్మంతుని ప్రతిష్ఠ

మంగళగిరిటౌన్‌: మంగళాద్రిలో వేంచేసిన యున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధృజారోహణం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు సోమవారం రాత్రి ఋత్వికరణ, అంకురారోపణాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కళ్యాణోత్సవానికి భక్త జనులను, దేవతలను ఆహ్వానానికి భక్తాగ్రేస్వరుడైన గరుత్మంతుని ధ్వజంపై ప్రతిష్టించారు. అష్టాంగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దలు అన్న పేరుతో సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ద్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌ కుమార్‌ పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ వ్యవహరించారు.

నేడు హనుమంత

వాహనంపై...

లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం రాత్రి శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement