ఏపీజేఏసీ చైర్మన్ గా ఘంటసాల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని ఏపీ ఎన్జీజీవో సంఘ కార్యాలయంలో శనివారం జేఏసీ భాగస్వామ్య సంఘాలన్నీ కలిసి గుంటూరు జిల్లా ఏపీ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సంఘ ఐక్యత, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చైర్మన్‌గా ఘంటసాల శ్రీనివాసరావు..
గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఘంటసాల శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీజీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడు) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, జేఏసీ సెక్రటరీ జనరల్‌గా మహమ్మద్ ఖలీద్ (ఏిపీటీఎఫ్–257 జిల్లా అధ్యక్షుడు) ఎంపికయ్యారు. సమావేశంలో కో–చైర్మన్‌లు గా ఎం.శ్రీనివాసరెడ్డి (ఆర్టీసీ సంఘం), షేక్ బాజీ (ఎస్టీయూ ), ఎస్వీ రమణారావు ( కమర్షియల్ టాక్స్ సంఘం) వైస్ చైర్మన్ లుగా ఎం.కళాధర్ ( యూటీఎఫ్), కె.నరసింహారావు(ఇరిగేషన్ సంఘం) యశోదర దేవి (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్) కె.పిచ్చయ్య ( పెన్షనర్స్ సంఘం), జె.పూర్ణచంద్రారెడ్డి ( ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘం), జాయింట్ సెక్రటరీలుగా టి.మహేష్ (స్వర్ణ వార్డ్ స్వర్ణ గ్రామ ఎంప్లాయ్ అసోసియేషన్), ఎం వెంకయ్య ( ఆర్ అండ్ బీ సంఘం ), పి.సుజాత ( ఏపీ ట్రెజరీ అసోసియేషన్ ), కె.రాంబాబు ( వెటర్నరీ సంఘం), చింతల కళ్యాణ్ కుమార్ (కమర్షియల్ టాక్స్ సంఘం), వెల్లంపల్లి పద్మజ (నర్సింగ్ అసోసియేషన్), జి. సుకుమార్ (సీపీఎస్ ఎంప్లాయిస్ సంఘం), కె. సాంబశివరావు (పంచాయతీ సెక్రటరీ సంఘం ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎ.శ్యాంసుందర్ శ్రీనివాస్ ( ఏపీ ఎన్జీజీవో జిల్లా కార్యదర్శి ), ట్రెజరర్ గా ఎల్.శ్రీధర్ రెడ్డి( ఏపీ ఎన్జీజీఓ ) ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా జి.వేళాంగిణి రాజు (ఏపీటీఎఫ్ 1938 ), డి.శ్రీనివాసరెడ్డి (పిఆర్టియు ), టీవీ మోహన్ రాజు (రెసిడెన్షియల్ టీచర్స్ సంఘం), సిహెచ్.అంజనీ దేవి (పే అండ్ అకౌంట్స్), వై సి హెచ్ కోటేశ్వరరావు (స్టాటిటిక్స్ సంఘం), ఎం శ్రీనివాసరావు (అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ సంఘం), జె.వెంకటేశ్వరరావు(గ్రంథాలయాల శాఖ), ఎం కోటయ్య(ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ), ఎం శ్రీనివాసరావు (డీఈఓ ఆఫీస్), పి కోటేశ్వరరావు(క్లాస్ ఫోర్ అసోసియేషన్) నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


