అక్రమ అరెస్టులపై ఆగ్రహం ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) బాపట్ల 6.21 5.07 నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07 చీరాల: అక్రమ అరెస్టులతో అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యమాలను అణచి వేయలేరని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్ అన్నారు. విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న దీక్షలో పోలీసుల జోక్యం, అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా మంగళవారం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు.
● ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన దీక్షను అణిచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. చర్చలకు పిలుస్తామని మాయమాటలు చెప్పి అర్ధరాత్రి శిబిరంలోకి ప్రవేశించి మహిళలను బలవంతంగా బస్సుల్లో ఎక్కించడం సిగ్గు చేటన్నారు.
● కనీస వేతనాల పెంపు కోరితే అరెస్ట్‌లు, దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
● అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల వారీగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
● అరెస్టులు చేసినా పోలీస్‌స్టేషన్‌లో ఉండి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటామని, ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అడ్డుకోలేదని అన్నారు.
● స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.వసంతరావు, ఎన్.బాబూరావు, జయరాజు, యూనియన్ నాయకులు జి.సుజీవన, ఎం.సులోచన, ఆర్.నిర్మల, కె.అనిత, జ్యోతి, జి.లక్ష్మి, డి.బుల్లెమ్మాయి, తాడికొండ పద్మ, నాగేంద్రం, కె.పద్మ పాల్గొన్నారు.
వేమూరు: అంగన్‌వాడీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ వేమూరు రైల్వే గేటు సెంటర్‌లో మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అమృతలూరు ప్రాజెక్ట్ అంగన్‌వాడీ యూనియన్ గౌరవధ్యక్షులు బి.ఆగస్టీన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విలేకరులతో ఆగస్టీన్ మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేసి అర్థరాత్రి నిద్రిస్తున్న అంగన్‌వాడీలను సంఘ విద్రోహశక్తులను అరెస్ట్ చేసినట్లుగా దాడి చేయడం సమంజసమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంగన్‌వాడీలపై చంద్రబాబు ప్రభుత్వ దమన కాండను ప్రజలందరు ఖండించాలని ఆయన కోరారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంపుదల చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేధిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొనిగల సుబ్బారావు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పద్మ, సుజాత, నీరజ, పద్మావతి, గృహలక్ష్మి, నాగ్రేందమ్మ, సూర్యలక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
బోల్తాకొట్టిన జేసీబీ
బాపట్ల
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) బాపట్ల 6.21 5.07 నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07
● చీరాలలో మోకాళ్లపై కూర్చుని
అంగన్‌వాడీల నిరసన
● వేమూరులో రాస్తారోకో
● అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని
అడ్డుకోలేరంటున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల అక్రమ అరెస్ట్‌లకు నిరసన
చీరాలలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు
తాడేపల్లి రూరల్ : మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు అండర్‌పాస్ వద్ద మంగళవారం జేసీబీ అదుపుతప్పి డ్రైన్‌లో బోల్తాపడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.