పీఠా నాగమోహన్‌ కృష్ణ | - | Sakshi
Sakshi News home page

పీఠా నాగమోహన్‌ కృష్ణ

Mar 4 2026 7:38 AM | Updated on Mar 4 2026 7:38 AM

పీఠా నాగమోహన్‌ కృష్ణ

వైఎస్సార్‌ సీపీ రేపలె ్లసమన్వయకర్తగా

రేపల్లె: రేపల్లె నియోజకవర్గం నగరం మండలం కారంకివారిపాలెం పంచాయతీ పీటవారి పాలెంకు చెందిన చెందిన పీఠా నాగమోహన్‌ కృష్ణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు నాగమోహన్‌ కృష్ణ పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన తాత పీఠా పోతురాజు స్మారకార్థం మెమోరియల్‌ ట్రస్ట్‌ను స్థాపించి, నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. నాగమోహన్‌ కృష్ణ నియామకంపై నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగమోహన్‌ కృష్ణ మాట్లాడుతూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమన్వయం సాధిస్తూ రానున్న ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement