నేటి ప్రగతికి దారి !
తెలంగాణ వారికీ ఉపయోగకరం
ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. తీరప్రాంతాలకు పర్యాటకులు కూడా అఽధికంగా వస్తారు. వేసవి సెలవులు, వారాంతపు సెలవుల్లో వాడరేవు, రామాపురం తీరప్రాంతాలకు పర్యాటకుల సందర్శన ఎక్కువ. రోడ్డు పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. హైవే నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కలెక్టర్లు, నేషనల్ హైవే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకరంగం, రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడంతోపాటుగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. చిన్న హోటళ్ల నుంచి పెద్ద రిసార్టులు, చిరువ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది. చీరాల మండలంలోని వాడరేవు ప్రదాన రహదారిని వెడల్పు చేయడంతో పాటు నాలుగు మేజర్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్ బ్రిడ్జిల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే చీరాల్లో అన్నదాతలు పండించిన పంటల ఎగుమతులు పెరగడంతో మార్కెట్‌లకు తరలింపు సులభతరం కానుంది.
న్యూస్‌రీల్
నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం
కల్యాణ శుభలేఖ ఆవిష్కరణ
బాపట్ల
గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నాటి చొరవ..
● వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ
రహదారితో మారనున్న ముఖ చిత్రం
● బాపట్ల జిల్లాకు మహర్దశ తీసుకువచ్చేలా
ముమ్మరంగా రోడ్డు నిర్మాణ పనులు
● రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతాల
మధ్య భారీగా తగ్గనున్న దూరం
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ
నిర్ణయంపై సర్వత్రా హర్షం
I
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటుగా రూ.667 కోట్లు నిధులను కూడా విడుదల చేయించారు. ఈ రోడ్డు వాడరేవు నుంచి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా నకరికల్లు అడ్డరోడ్డు వరకు 81.5 కిమీ మేర రహదారిని వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నాటి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చొరవపై , ఆయన ముందుచూపుతో నేడు అభివృద్ధి కొనసాగుతోందని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.8600, మోడల్ ధర రూ.8000 వరకు పలికింది.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం బుధవారం 539.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,207 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మంగళగిరి టౌన్ : ఈ నెల 21న జరగనున్న మంగళగిరి భద్రావతి సమేత భావనాఋషి స్వామివార్ల కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను బుధవారం ఆవిష్కరించారు.
నేటి ప్రగతికి దారి !
నేటి ప్రగతికి దారి !
నేటి ప్రగతికి దారి !
నేటి ప్రగతికి దారి !
నేటి ప్రగతికి దారి !
నేటి ప్రగతికి దారి !
నేటి ప్రగతికి దారి !


