వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం | - | Sakshi
Sakshi News home page

వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం

Feb 21 2026 7:14 AM | Updated on Feb 21 2026 7:14 AM

వీరాం

వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం

వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం

చీరాల: స్థానిక బోస్‌నగర్‌లో వేంచేసియున్న వీరాంజనేయస్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం స్వామివారి సుప్రభాతసేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తుల సహకారంతో 60 సవర్ల బంగారంతో కిరీటాన్ని చేయించారు. సంప్రోక్షణ చేయించి కిరీటాన్ని ఊరేగింపుగా ప్రదక్షణ చేయించి పూజలు నిర్వహించారు. శనివారం జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమం రోజున స్వామివారికి అలంకరించనున్నారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం 1
1/1

వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement