బాల్ బ్యాడ్మింటన్ విజేత దుర్గి
నగరం: గుంటూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరం బాల ఏసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం నిర్వహించారు. పోటీల్లో దుర్గి జడ్పీహైస్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలవగా, నగరం బాల ఏసు ఇంగ్లిష్ మీడియం స్కూల్ రన్నర్స్‌గా నిలిచింది. దూళిపాళ్ళ జడ్పీహైస్కూల్, శేకూరు జడ్పీహైస్కూల్ టీమ్‌లు వరుసగా మూడవ, నాల్గవ స్థానాలలో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇ.శివశంకర్, గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ వై.శ్రీనివాసరావు, నంబూరు స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు బి.నర్సయ్య, స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సునా, ప్రిన్సిపాల్ సిస్టర్ సజీవా, పలు పాఽఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మృతుడిది గుంటూరు జిల్లా నందివెలుగు
సింగరాయకొండ: ముందు వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా నెమ్మది కావడంతో ఆ వెనుకాల వేగంగా పుచ్చకాయ లోడుతో వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ ఇగ్గోలు వెంకట సుబ్బారావు (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారి కందుకూరు ఫ్లయి ఓవర్‌పై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మినీ లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పుచ్చకాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతి చెందిన సుబ్బారావుది గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని నందివెలుగు. సంఘటన స్థలాన్ని ఎస్సై మహేంద్ర పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
చెరుకుపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం కావూరులో చోటుచేసుకుంది. మండలంలోని జొన్నలగడ్డవారిపాలెంకు చెందిన మొవ్వ ముత్యాలరావు(45) తన ద్విచక్ర వాహనంపై చందోలు వైపు నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జొన్నలగడ్డ వారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాల పాలైన ముత్యాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలిరూరల్: మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమై వివాహం చేసుకుంటానని నమ్మబలికి పెద్ద మొత్తంలో నగదు కాజేసి మోసం చేసిన నిందితుడిని తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం సీఐ ఎస్.సాంబశివరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న మహిళకు కొల్లిపర మండలం కొత్తూరులంక గ్రామానికి చెందిన అరవపల్లి వంశీ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఈనెల 2వ తేదీన పరిచయమయ్యాడు. తనకు వివాహమై విడాకులు తీసుకున్నానని తిరిగి వివాహం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఆమెను నమ్మించాడు. మహిళ ఇంటికి కూడా వచ్చి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహానికి ఒప్పించాడు. తదుపరి టిప్పర్ కొనుగోలుకు నగదు కావాలని నమ్మించి, వివిధ మార్గాలలో లోను తీసుకునేలా ప్రేరేపించి ఆమె నుంచి రూ. 12.20 లక్షలు వసూలు చేశాడు. వివాహం చేసుకోనున్నట్లు నమ్మించి ఈనెల 8న శారీరకంగా లోబరుచుకున్నాడు. మరింత నగదు కావాలంటూ ఆమైపె ఒత్తిడి పెంచడంతో ఇవ్వలేనని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కొట్టి, చంపుతానని బెదిరించి, వివాహానికి నిరాకరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
బాల్ బ్యాడ్మింటన్ విజేత దుర్గి
బాల్ బ్యాడ్మింటన్ విజేత దుర్గి


