లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Feb 23 2026 7:29 AM | Updated on Feb 23 2026 7:29 AM

లక్ష్

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మంగళగిరి టౌన్‌: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీ స్వామి వారు పెండ్లికుమారుని అలంకారంలో దర్శనమిచ్చారు. వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారి తీర్థ బిందె తీసుకురావడం, ప్రాతఃకాలార్చన, స్వామివారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెను చేశారు. అనంతరం తీర్థగోష్టి పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాన్ని ఆలయ ఈవో కె. సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు. పెండ్లికుమారుడి ఉత్సవానికి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ప్రతినిధులు కై ంకర్యపరులుగా వ్యవహరించారు. గాలిగోపురంతోపాటు పరిసర ప్రాంతాలు విద్యుత్‌ దీపాలతో విరాజిల్లుతున్నాయి.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 1
1/1

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement